- Home
- Entertainment
- అన్ని షేర్ చేసుకుంటాం.. కానీ ఫ్రెండ్స్ మాత్రమే.. ఫైనల్‌గా విజయ్ దేవరకొండతో రిలేషన్‌షిప్‌పై రష్మిక క్లారిటీ
అన్ని షేర్ చేసుకుంటాం.. కానీ ఫ్రెండ్స్ మాత్రమే.. ఫైనల్‌గా విజయ్ దేవరకొండతో రిలేషన్‌షిప్‌పై రష్మిక క్లారిటీ
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారని, రహస్యంగా డేటింగ్ చేస్తున్నారని వార్తలు షికారు చేస్తున్నాయి. తాజాగా ఈ ఇద్దరు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు.

రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ కలిసి `గీతగోవిందం`, `డియర్ కామ్రేడ్` చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాల టైమ్‌లో వీరిద్దరి మధ్య సన్నిహిత్యం పెరిగిందని, దీంతో ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారనే చర్చ నడుస్తుంది. పైగా విజయ్ ఇంటికి కూడా పలు మార్లు రష్మిక వచ్చింది. వారి ఫ్యామిలీతో సరదాగా గడిపింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి.
పైగా ఇటీవల ఈ ఇద్దరు మాల్దీవులకు వెకేషన్‌కి వెళ్లడం మరింత హాట్ టాపిక్ అయ్యింది. ప్రేమలో ఉండటం వల్లే ఈ ఇద్దరు వెకేషన్‌కి వెళ్లారనే నిర్ణారణకు వచ్చారు నెటిజన్లు. గత మూడు రోజులుగా ఈ జంటపై విపరీతమైన ట్రోల్స్, మీమ్స్ నడుస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే గతంలో విజయ్‌తో ప్రేమలో ఉన్నామనే రూమర్స్ పై రష్మిక స్పందించింది. వాటిని చదువుతుంటే సరదాగా ఉంటుందని, ఎంజాయ్ చేస్తానని తెలిపింది. కానీవిజయ్‌తో రిలేషన్ వార్తలను ఖండించలేదు. అటు విజయ్ కూడా ఈ రూమర్స్ ని ఖండించలేదు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
తాజాగా దీనిపై రష్మిక మందన్నా రియాక్ట్ అయ్యింది. క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నేను విజయ్ బాగా సన్నిహితంగా ఉంటాం. నాకు సినిమాలకు సంబంధించి ఏదైనా సందేహాలు వస్తే విజయ్‌ని అడుగాను, అన్ని విషయాలను షేర్ చేసుకుంటాం. కానీ మేం స్నేహితులం మాత్రమే` అని తెలిపింది రష్మిక. ఇలా రిలేషన్ రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
మరి దీంతో రష్మిక, విజయ్‌ల మధ్య లవ్ స్టోరీకి సంబంధించిన రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందా? ఎప్పటిలాగే వైరల్ అవుతాయా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే విజయ్, రష్మిక మాల్దీవుల వెకేషన్ పూర్తి చేసుకున్నారు. ఈ ఇద్దరు ఓకే సారి ఇండియాకి చేరుకున్నారు. ముంబయి ఎయిర్‌పోర్ట్ లో కెమెరాలకు చిక్కగా ప్రస్తుతం ఆ వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మాల్దీవులకు బై బై చెబుతూ ఓ ఫోటోని పంచుకుంది రష్మిక. ఇందులో ఆమె చెబుతూ, `చాలా అవసరమైన దూరం ముగిసింది. నేను ఈ ప్రదేశానికి వీడ్కోలు చెప్పానంటే నమ్మలేకపోతున్నా` అని పేర్కొంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హాట్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో `పుష్ప 2` లో నటిస్తుంది. తమిళంలో `వారసుడు` చిత్రం చేస్తుంది. హిందీలో `మిషన్ మజ్ను`, `యానిమల్` సినిమాల్లో నటిస్తుంది. దీంతోపాటు తెలుగు, తమిళం, తమిళంలో కొత్తగా దాదాపు నాలుగు సినిమాలకు కమిట్ అయినట్టు సమాచారం. ఇక విజయ్ దేవరకొండ `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు.