- Home
- Entertainment
- Rashmika Mandanna Ads Income: రష్మిక మందన్నా యాడ్స్ ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా? సినిమాలు జుజూబీ
Rashmika Mandanna Ads Income: రష్మిక మందన్నా యాడ్స్ ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా? సినిమాలు జుజూబీ
Rashmika Mandanna Ads Income : రష్మిక మందన్నా సినిమాల ద్వారానే కాదు, కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా గట్టిగా సంపాదిస్తోంది. ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే యాడ్స్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తోంది.

రహస్యంగా విజయ్ దేవరకొండతో రష్మిక మందన్నా ఎంగేజ్‌మెంట్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఎట్టకేలకు పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది. ఆమె రౌడీ బాయ్, హీరో విజయ్ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం అతికొద్ది మంది బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా ప్రైవేట్‌గా వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది. తమ ఎంగేజ్‌మెంట్‌ని రహస్యంగా ఉంచారు. కాకపోతే వీరి ఎంగేజ్‌మెంట్‌ని పీఆర్ టీమ్ ధృవీకరించింది. ఈ క్రమంలో ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్‌మెంట్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.
ప్రేమని రహస్యంగా ఉంచిన రష్మిక
గత ఏడేళ్లుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమించుకుంటున్నారు. `గీతా గోవిందం` సమయంలో ఈ ఇద్దరు పరిచయం అయ్యారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలచింది. ఈ సినిమాతోనే ఇద్దరి మధ్య ప్రేమ స్టార్ట్ అయ్యింది. ఇన్నాళ్లు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. అయితే అనేక సందర్భాల్లో తమ ప్రేమ విషయాన్ని హింట్ ఇస్తున్నారు. ఇద్దరు కలిసి ఎయిర్ పోర్ట్ లో కనిపించడం, ఒకే లొకేషన్‌లో వెర్వేరుగా ఒకే సమయంలో కనిపించడం, ఆయా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వచ్చారు. ఇలా హింట్ ఇస్తూ వచ్చారు. తాము డేటింగ్‌లో ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే తమ ప్రేమ కథ గురించి మీడియా అడగ్గా తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వచ్చారు.
ఫిబ్రవరిలో రష్మిక, విజయ్ మ్యారేజ్
ఇక అటు అభిమానుల మధ్య, ఇటు సినీ ప్రియుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్న అనేక అనుమానాలను తాజాగా బ్రేక్ చేశారు. ఎట్టకేలకు రూమర్లని నిజం చేశారు. ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి చేసుకునేందుకు రెడీ అవుతున్నారట. చాలా గ్రాండ్ మ్యానర్‌లో మ్యారేజ్‌కి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకి సంబంధించిన అనేక విషయాలు ఆసక్తికరంగా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా రష్మిక చేస్తోన్న యాడ్స్ ఏంటి? ఆమె యాడ్స్ ద్వారా ఎంత సంపాదిస్తోందనేది ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తోంది. మరి ఆ విషయాల గురించి తెలుసుకుంటే.
రష్మిక మందన్నాచేస్తోన్న యాడ్స్ ఇవే
రష్మిక మందన్నా డిగ్రీ చదువుకునే సమయంలో యాడ్స్ చేయడం ప్రారంభించింది. ఫస్ట్ ఆమె మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. 2014లోనే టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన క్లీన్ అండ్ క్లీన్ ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో విన్నర్‌గా నిలిచింది. ఆ తర్వాత రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన `కిరిక్ పార్టీ` చిత్రంతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఈ మూవీ హిట్ కావడంతో పాపులర్ అయ్యింది. 2018లో `ఛలో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కూడా ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ `గీతా గోవిందం` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో ఇక తిరుగులేదు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దీంతో వరుసగా ఆమెకి యాడ్స్ వచ్చాయి. బ్రాండ్ అంబాసిడర్‌గా చేస్తూ రాణిస్తోంది. ఓ వైపు వరుసగా పాన్ ఇండియా మూవీస్, మరోవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు రెండు చేతులా సంపాదిస్తోంది.
సినిమాల కంటే యాడ్స్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తోన్న రష్మిక
రష్మిక 2024లో ఫోర్బ్స్ అండర్ 30లో చోటు సంపాదించింది. ఇక రష్మిక చేసిన యాడ్స్ చూస్తే, మెక్ డోనాల్డ్స్, డాబర్ హనీ, క్యాషిఫై, కళ్యాణ్ జ్యూవెల్లరీ, బిక్స్ ఫామ్, ఒనిట్సుకాటైగర్, క్రంచీ రోల్ అనిమీ అవార్డు ఈవెంట్‌కి అంబాసిడర్‌గా, ప్లమ్, మీసో, 7అప్, బోట్, డీఆర్‌ఏ హోమ్స్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం ఆమె క్రాస్ ఇండియా ఫుట్‌వేర్ బ్రాండ్‌ని, అలాగే బెవకూఫ్ ఆన్‌లైన్ దుస్తుల కంపెనీకి, స్వరోస్కీ జూవెల్లరీ, స్మైల్ ఫౌండేషన్, ఇసో ప్యూర్ ప్రోటీన్ వాటర్, డియర్ డైరీ పర్‌ఫ్యూమ్, ఎప్సాన్ ఎకో టాంక్ ప్రింటర్ ఇలా అన్ని రకాల యాడ్స్ చేస్తూ గట్టిగా సంపాదిస్తోంది. ఒక్కో యాడ్‌కి సుమారు రూ.4 కోట్లు పారితోషికం తీసుకుంటుందట. అలాగే ఒక్కో మూవీకి ఐదు కోట్ల నుంచి పది కోట్ల వరకు సినిమా రేంజ్‌ని బట్టి, బడ్జెట్‌ని బట్టి తీసుకుంటోంది. సినిమాల కంటే యాడ్స్ ద్వారానే బాగా సంపాదిస్తోంది రష్మిక. ఏడాదికి దాదాపు యాభై కోట్ల వరకు సంపాదిస్తుందని సమాచారం.
రష్మిక మందన్నా చేస్తోన్న సినిమాలు
గతేడాది `పుష్ప 2`తో పాన్ ఇండియా లెవల్‌లో దుమ్ములేపింది రష్మిక మందన్నా. ఆ తర్వాత `ఛావా`తో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది. సల్మాన్ తో చేసిన `సికందర్` మూవీ డిజప్పాయింట్ చేసింది. చివరగా `కుబేర` మూవీతో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆమె `ది గర్ల్ ఫ్రెండ్`, `తామా`, `మైసా` వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కమర్షియల్ సినిమాలతోపాటు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంది. `మైసా`, `ది గర్ల్ ఫ్రెండ్` వంటి చిత్రాలు మహిళా ప్రధాన కథతో రూపొందుతున్నాయి.