MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రష్మిక మందన్న వింత కోరిక, కొరియన్ సిరీస్ లపై కన్నేసిన నేషనల్ క్రష్, కానీ కండిషన్స్ అప్లై..

రష్మిక మందన్న వింత కోరిక, కొరియన్ సిరీస్ లపై కన్నేసిన నేషనల్ క్రష్, కానీ కండిషన్స్ అప్లై..

Rashmika Mandanna dreams : నేషనల్ క్రష్ రష్మిక మందన్న దూసుకుపోతోంది. ఇండ్ట్రీలో తీరుగులేని కెరీర్ ను కొనసాగిస్తోంది. ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ రెండు ఇండస్ట్రీలలో స్టార్ గా వెలుగు వెలుగుతున్న ఈ బ్యూటీకి.. ఈమధ్య కొత్తగా మరో ఇండస్ట్రీపై మనసు మళ్లింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 12 2025, 08:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దూసుకుపోతోన్న రష్మిక మందన్న..
Image Credit : Instagram@Rashmika Mandanna

దూసుకుపోతోన్న రష్మిక మందన్న..

వరుస సినిమాలు.. వరుస విజయాలతో రష్మిక మందన్న దూసుకుపోతోంది. ఆమె చేసిన ప్రతీ సినిమా హిట్ అవ్వడంతో.. రష్మిక డిమాండ్ భారీగా పెరిగింది. అంతే కాదు ఏ హీరోయిన్ సాధించలేని క్రేజ్ రష్మిక మందన్న సాధించింది. నేషనల్ క్రష్ గామారిపోయింది. పుష్ప సినిమాతో ఆమెకు వరల్డ్ వైడ్ గా గుర్తింపు వచ్చింది, పాన్ఇండియా వైడ్ గా స్టార్ డమ్ కూడా వచ్చింది. దాంతో రెమ్యుునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేస్తోందట రష్మిక మందన్న. ఇక టాలీవుడ్, బాలీవుడ్ లలో వరుస సినిమాలు చేస్తూ వెళ్తోన్న ఈ బ్యూటీకి .. మరో ఫిల్మ్ ఇండస్ట్రీపై మనసు మళ్లింది... ఆమెకు కొరియన్ సినిమాలు చేయాలని ఆశపుట్టింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
కొరియన్ సినిమాలపై రష్మిక కామెంట్స్..
Image Credit : stockPhoto

కొరియన్ సినిమాలపై రష్మిక కామెంట్స్..

రష్మిక మందన్న తాజాగా కొరియన్ సినిమాలపై కామెంట్స్ చేశారు. కే డ్రామాలు అంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె వెల్లడించారు. అయితే, వాటిలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని, కానీ కొన్ని కండీషన్ల ప్రకారమే అందులోనటిస్తానన్నారు. ఆ ప్రాజెక్ట్ తనకు పూర్తిగా నచ్చాలి. నచ్చితేనే నటిస్తానన్నారు రష్మిక మందన్న. ఓ జాతీయ మీడియా సంస్థతో రష్మిక మాట్లాడుతూ.. “కే-డ్రామాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అది చాలా సరదాగా ఉంటుంది. అయితే, వాళ్లు ఎలాంటి కథతో వస్తారన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తెరపై కనిపించే పాత్రల విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను” అని అన్నారు.

Related Articles

Related image1
కథ చెప్పడానికి వెళ్తే.. స్టార్ డైరెక్టర్ ను గెట్ అవుట్ అన్న భానుమతి, కారణం తెలిస్తే షాక్ అవుతారు?
Related image2
46 ఏళ్ల వయసులో 23 ఏళ్ల మూవీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్న ప్రభాస్.. 500 కోట్ల కలెక్షన్ సినిమాలు ఎన్నో తెలుసా?
35
కోవిడ్ టైమ్ లో అలవాటు చేసుకున్నా..
Image Credit : youtube/zee telugu

కోవిడ్ టైమ్ లో అలవాటు చేసుకున్నా..

రష్మిక మాట్లాడుతూ..“ కరోనా వల్ల దేశమంతా లాక్‌డౌన్ చేసినప్పుడు నాకు చాలా సమయం దొరికింది. ఒక్కో కే-డ్రామాలో 16 ఎపిసోడ్లు ఉండటంతో వాటిని చూస్తూ సమయాన్ని గడిపాను. అప్పుడే వాటిపై నా ఇష్టం పెరిగింది,” అని రష్మిక మందన్నా అన్నారు. అప్పటి నుంచి టైమ్ దొరికినప్పుడల్లా.. రష్మిక కొరియన్ సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడటం అలవాటుగా మారిందట. అందుకే అందులో నటించాలన్న కోరికను ఆమె వెల్లడించారు.

45
రష్మిక మందన్న వరుస సినిమాలు
Image Credit : Instagram

రష్మిక మందన్న వరుస సినిమాలు

రష్మిక మందన్న వరుస సినిమాలు

ఇక సినిమాల విషయానికొస్తే, రష్మిక తాజాగా ‘థామా’ అనే హారర్-కామెడీ సినిమాలో నటించి, విజయం సాధించారు. ఆయుష్మాన్ ఖురానా, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, ‘భేడియా’, ‘స్త్రీ’, ‘ముంజ్యా’ వంటి హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందించబడింది. ఇందులో రష్మిక వాంపైర్ (రక్త పిశాచి) పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక రష్మిక మందన్న నటించని తాజా తెలుగు చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఇది ఒక రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది.

55
విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం..
Image Credit : Instagram

విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం..

ప్రస్తుతం రష్మిక మందన్న రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ‘కాక్‌టెయిల్ 2’, ‘మైసా’ వంటి ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉంది. స్టార్ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మో వైపు విభిన్న జానర్లలో కొత్త పాత్రలను ప్రయత్నిస్తూ, తన నటనా పరిధిని మరింత విస్తరించుకుంటుంది రష్మిక. ఇక టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండను త్వరలో పెళ్లాడబోతోంది నేషనల్ క్రష్. రీసెంట్ గా వీరి నిశ్చితార్థం రహస్యంగా జరిగింది.. పెళ్లిపై త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసి.. ఈ స్టార్ జంట పెళ్లి చేసకోబోతున్నట్టు సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రష్మిక మందన్న
విజయ్ దేవరకొండ
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
బాలీవుడ్
ఓటీటీ

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR CM: ఎన్టీఆర్‌ సీఎం అవడం పక్కా, ఆయన పార్టీలో చేరతాం.. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి బోల్డ్ స్టేట్‌మెంట్‌
Recommended image2
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image3
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Related Stories
Recommended image1
కథ చెప్పడానికి వెళ్తే.. స్టార్ డైరెక్టర్ ను గెట్ అవుట్ అన్న భానుమతి, కారణం తెలిస్తే షాక్ అవుతారు?
Recommended image2
46 ఏళ్ల వయసులో 23 ఏళ్ల మూవీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్న ప్రభాస్.. 500 కోట్ల కలెక్షన్ సినిమాలు ఎన్నో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved