- Home
- Entertainment
- 46 ఏళ్ల వయసులో 23 ఏళ్ల మూవీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్న ప్రభాస్.. 500 కోట్ల కలెక్షన్ సినిమాలు ఎన్నో తెలుసా?
46 ఏళ్ల వయసులో 23 ఏళ్ల మూవీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్న ప్రభాస్.. 500 కోట్ల కలెక్షన్ సినిమాలు ఎన్నో తెలుసా?
Prabhas 23 years in cinema : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 23 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నాడు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో.. కెరీర్ లో ఎన్నో మలుపులు చూశాడు. ఆయన కెరీర్ లో 500 కోట్ల కలెక్షన్ సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

ప్రభాస్ ఫిల్మ్ కెరీర్ కు 23 ఏళ్లు
పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్న ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించి 23 సంవత్సరాలు అవుతుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ ఈశ్వర్ నవంబర్ 11 2002 న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రభాస్ కు సబంధించిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ పోస్టర్ లో 23 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా.. యంగ్ రెబల్ స్టార్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
వర్షం సినిమాతో ఫస్ట్ బ్రేక్
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తన 23 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను సాధించారు. 2002లో విడుదలైన ఈశ్వర్ సినిమాలో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయనకు.. 2004లో వచ్చిన వర్షం సినిమాతో ఫస్ట్ బ్రేక్ వచ్చింది. ఈసినిమాతో భారీ సక్సెస్ ను అందుకోవడంమే కాదు.. ఈమూవీ ప్రభాస్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అంతే కాదు ప్రభాస్ కు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కూడా ఈసినిమాతోనే స్టార్ట్ అయ్యింది.
ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా
ఇక ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పిన మరో సినిమా ఛత్రపతి. 2005లో ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఛత్రపతి’తో ప్రభాస్ మాస్ హీరోగా కొత్త స్థాయిని అందుకున్నారు. ఈ సినిమాతో టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. మాస్ ఆడియన్స్ లో ప్రభాస్ క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఇక అమ్మాయిలు అయితే ప్రభాస్ జపం చేయడం స్టార్ట్ చేశారు.
కొత్త జానర్స్ ను ట్రై చేసిన డార్లింగ్
ఇక ఆతరువాత కాలంలో వరుసగా డిఫరెంట్ జానర్స్ ను ట్రై చేశాడు ప్రభాస్ 2010లో వచ్చిన ‘డార్లింగ్’, 2011లో ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాతో కాస్త ఫ్యామిలీ ఆడియన్స్స్ ను కూడా అలరించాడు. ఈసినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యాడు రెబల్ స్టార్. ఈ రెండు సినిమాల తరువాతే ప్రభాస్ కు డార్లింగ్ అనే ముద్దు పేరు అలా నిలిచిపోయింది. ప్రభాస్ కూడా అందరిని డార్లింగ్ అని పిలవడంతో అది అందరికి అలవాటైపోయింది.
మిర్చి సినిమాకు నంది అవార్డు
2013లో విడుదలైన ‘మిర్చి’ చిత్రం ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు ఆయన నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇక మిర్చి సినిమా తరువాత ప్రభాస్ కెరీర్ లో అతి పెద్ద మలుపు చోటు చేసింది. ఆయన స్థాయి పాన్ ఇండియాకు పాకింది. అది బాహుబలి సినిమాతోనే సాధ్యం అయ్యింది.ప్రభాస్ కెరీర్‌లోనే కాకుండా, ఇండియన్ ఫిల్మ్ ఇండస్టరీలోనే గుర్తుండిపోయే సినిమా, టాలీవుడ్ రేంజ్ ను మార్చేసిన సినిమా బాహుబలి. ఈసినిమాతో ఫస్ట్ పాన్ ఇండియా తెలుగు హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు.
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా స్టార్ డమ్
2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’ ప్రభాస్ ను దేశవ్యాప్తంగా పాన్-ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. 2017లో విడుదలైన ‘బాహుబలి 2: ది కన్‌క్లూజన్’ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సృష్టించింది. ఆతరువాత ఆయన తిరిగి చూసుకోలేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోయాడు. ప్రభాస్ కోసం స్టార్ డైరెక్టర్లు క్యూ కట్టారు, వందల కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. మధ్యలో కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా.. ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు.
500 కోట్లు దాటిని ప్రభాస్ సినిమాలెన్ని
ప్రస్తుతం ప్రభాస్ అంటే వందల కోట్ల బడ్జెట్, 1000 కోట్ల కలెక్షన్ హీరో. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూలు చేసిన ప్రభాస్ సినిమాలు 4 ఉన్నాయి. ‘బాహుబలి 1, బాహుబలి 2, , సలార్, కల్కీ సినిమాలతో రికార్డు క్రియేట్ చేశాడు ప్రభాస్, అంతే కాదు 2 వెయ్యి కోట్ల కలెక్షన్ సినిమాల రికార్డు కూడా ప్రభాస్ పేరుమీదే ఉంది. పాన్ ఇండియా హీరో నుంచి ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదుగుతున్నాడు ప్రభాస్.
ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలు
ఇప్పుడు ప్రభాస్ ‘కల్కి 2898 AD’ వంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో పాటు, ‘రాజా సాబ్’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. త్వరలో రాజాసాబ్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ప్రభాస్. వరుసగా అరడజను సినిమాలను చేతిలో పెట్టుకుని..బిజీగా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్.