- Home
- Entertainment
- ఆరెంజ్ శారీలో రష్మిక మందన్నా క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్.. ఎంత ముద్దుస్తుందో.. అసిస్టెంట్ పెళ్లిలో సందడి..
ఆరెంజ్ శారీలో రష్మిక మందన్నా క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్.. ఎంత ముద్దుస్తుందో.. అసిస్టెంట్ పెళ్లిలో సందడి..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉంది. బయట కనిపించడం తగ్గించేసింది. ఇంపార్టెంట్ ఈవెంట్లలోనే సందడి చేసే ఈ భామ ఇప్పుడు అసిస్టెంట్ పెళ్లిలో తళుక్కున మెరిసింది.

రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఆరెంజ్ శారీలో మెరిసింది. ఇందులో కలర్ ఫుల్ అందంతో కట్టిపడేస్తుందీ నేషనల్ క్రష్. ఆరెంజ్ శారీలో రష్మిక సందడంతా తన వద్దే ఉందనేట్టుగా చేసింది. దీంతో ఆమె లుక్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
రష్మిక.. తన పర్సనల్ అసిస్టెంట్ సాయి పెళ్లిలో పాల్గొంది. నేడు హైదరాబాద్‌లో సాయి వివాహం జరుగుతుంది. అసిస్టెంట్ కోసం స్వయంగా వచ్చింది రష్మిక. ఆరెంజ్ శారీ కట్టి పెళ్లి పండపానికి రావడంతో అందరి చూపు ఈ బ్యూటీపైనే పడ్డాయి. పైగా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది Rashmika.
రష్మిక తన పెళ్లికి రావడంతో సాయి ఆనందానికి అవదుల్లేవు. ఆమె కాళ్లపై పడి ఆశీర్వాదాలు తీసుకున్నారు. నూతన వధువరులకు అక్షింతలతో ఆశీర్వదించింది రష్మిక. వారితో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా రష్మిక మందన్నా.. ఆరెంజ్ కలర్ శారీతోపాటు స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించింది. దీంతో ఆమె అందం ఓవర్‌లోడ్ అనేలా ఉంది. అంతేకాదు చీరలో ఎంతో క్యూట్‌గా ఉంది రష్మిక. ఓరకంగా ముద్దొస్తుందని చెప్పొచ్చు.
ఇక రష్మిక మందన్నా వరుసగా పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె తెలుగులో అల్లు అర్జున్‌తో `పుష్ప2` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఇప్పటికే `పుష్ప` మొదటి భాగం విడుదలై పెద్ద హిట్ అయ్యింది. అది ఇటీవల రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు వరించింది. అలాగే సాంగ్స్ విభాగంలో దేవిశ్రీ ప్రసాద్‌కి నేషనల్ అవార్డు దక్కింది.
ఇప్పుడు `పుష్ప2`ని రెట్టింపు బడ్జెట్‌తో, భారీ స్కేల్‌లో తెరకెక్కిస్తున్నారు. కథ పరిధిని కూడా పెంచారు. ఇందులోనూ రష్మిక శ్రీవల్లిగా రచ్చ చేసేందుకు వస్తుంది. ఇందులో ఆమె పాత్ర మధ్యలోనే ముగుస్తుందనే వార్తలొస్తున్నాయి. నిజం ఏంటనేది చూడాలి.
దీంతోపాటు రష్మిక మందన్నా హిందీలో `యానిమల్` చిత్రంలో నటిస్తుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ హీరో. ఈ సినిమా డిసెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. దీంతో మరోసారి పాన్ ఇండియా లెవల్‌లో రచ్చ చేయబోతుంది రష్మిక.
అలాగే తెలుగులో `రెయిన్‌బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ నిర్మిస్తుంది. తెలుగు, తమిళంలో బైలింగ్వల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. మరోవైపు ధనుష్‌తో ఢీ51 మూవీ చేస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇందులో నాగార్జున కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.