24 గంటలు సరిపోవడం లేదంటున్న రష్మిక, రోజుకు 36 గంటలు కావాలట ఎందుకో..?
తెలుగులో చాలా తక్కువ టైమ్ లో స్టార్ హీరోయిన్లలిస్ట్ లో చేరిపోయింది రష్మిక మందన్నా. .. కన్నడ నాట నుంచి సౌత్ స్టార్ గా ఎదిగిన బ్యూటీ.. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పాగా వేయాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, మహేఫ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్స్ పక్కన వెలుగు వెలిగిన రష్మిక.. తమిళంలో కార్తి సరసన మెరిసింది. బాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల పక్కడన ఛాన్స్ కోసం ఎదురు చూస్తోంది. క్షణం తీరికలేకుండా గడిపేస్తోంది బ్యూటీ.
Rashmika Mandanna
ఇక ప్రస్తుతం దుల్కర్ సల్మాణ్ - మృణాల్ జంటగా నటించిన సీతా రామం సినిమాలో రష్మిక ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ నెల 5 ఈ సినిమా మల్టీ లాంగ్వేజ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు టీమ్. అంతే కాదు రష్మిక కూడా ఈ ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటోంది.
ఈ సందర్భంగా ఓ ఇంటర్వూలో మాట్లాడింది రష్మిక.. ఈ విధంగా కొన్ని విషయాలు పంచుకుంది. నా సినిమాలలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకోవాలి. అప్పుడే నాకు సంతృప్తికరంగా అనిపిస్తుంది. తెలుగులో నా పాత్రకు నేనే డబ్ చెపుతున్నా.. ఇక తమిళ .. మలయాళ భాషలు కూడా నేర్చుకుని డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అన్నారు.
అంతే కాదు ఒక వైపున షూటింగులు .. మరో వైపున డబ్బింగులు.. ఇలా బిజీ బిజీగా ఉంటూనే అటు వివిధ భాషలు నేర్చుకునే క్లాసులు.. ఇలా నాకు 24 గంటలు సరిపోవడం లేదు.. అందుకే రోజుకు 36 గంటలుంటే బాగుండునని అనిపిస్తోంది అని అన్నారు రష్మిక మందన్నా.
ఇక సీతారామంలో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను .. నాకు తోచినట్టు చేస్తాను అనే టైపు పాత్రలో నేను కనిపిస్తాను. 1964 నాటి వాతావరణం కనిపించేలా షూట్ చేయడానికి చాలా కష్టపడ్డారు. రష్యా .. కశ్మీర్ వంటి ప్రదేశాల్లో విపరీతమైన చలిలో షూట్ చేశారు.. అని అన్నారు కన్నడ కస్తూరి.
rashmika mandanna
ఈ సినిమాలో నేను నటించాను కాని.. హీరో దుల్కర్ కాంబినేషన్లో మాత్రం కనిపించను. ఆయనతో కలిసి నటించే ఛాన్స్ త్వరలో రావాలని కోరుకుంటున్నాను అని తన మనస్సులో కోరిక చెప్పుకొచ్చింది రష్మిక.