- Home
- Entertainment
- అనసూయ, శ్యామల, శ్రీముఖి, ఇతర యాంకర్ల కులాలపై రచ్చ రచ్చ.. రష్మీ సంచలన వ్యాఖ్యలు, నెటిజన్లు చుక్కలు చూపిస్తూ
అనసూయ, శ్యామల, శ్రీముఖి, ఇతర యాంకర్ల కులాలపై రచ్చ రచ్చ.. రష్మీ సంచలన వ్యాఖ్యలు, నెటిజన్లు చుక్కలు చూపిస్తూ
బుల్లితెరపై గ్లామర్ గా, ఫన్నీగా కనిపించే రష్మీ ఆఫ్ స్క్రీన్ లో జంతువులు అంటే అమితమైన ప్రేమ. జంతులకు ఎక్కడ ఆపద ఉందని తెలిసినా రష్మీ తట్టుకోలేదు.

జబర్దస్త్ షో తో క్రేజీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. బుల్లితెరపై రష్మీ యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడూ నటిగా కూడా రాణిస్తూ ఉంది. ఒకప్పుడు రష్మీ, సుధీర్ రొమాన్స్ బుల్లితెరపై ఆడియన్స్ కి మంచి వినోదాన్ని అందించింది.
బుల్లితెరపై గ్లామర్ గా, ఫన్నీగా కనిపించే రష్మీ ఆఫ్ స్క్రీన్ లో జంతువులు అంటే అమితమైన ప్రేమ. జంతులకు ఎక్కడ ఆపద ఉందని తెలిసినా రష్మీ తట్టుకోలేదు. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది.
జంతువుల కోసం రష్మీ తరచుగా నెటిజన్లతో వాగ్వాదాలకు సైతం దిగుతూ ఉంటుంది. పలుమార్లు రష్మీ ట్రోలింగ్ ఎదుర్కొంది. తాజాగా అలాంటి సంఘటన జరిగింది. జంతువుల గురించి నెటిజన్లతో మొదలైన గొడవ కులం గురించి కొట్లాడుకునే వరకు వెళ్ళింది. దీనితో నెటిజన్లు రష్మీతో పాటు టాలీవుడ్ లేడీ యాంకర్స్ అందరి కులాల ప్రస్తావన తీస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.
ఓ నెటిజన్ ఎప్పుడూ జంతువుల మీదే కాదు కాస్త పిల్లల సేఫ్టీ గురించి కూడా స్పందించు అని పోస్ట్ పెట్టాడు. చిన్న పిల్లలని ఎవరో కాదు సమాజంలో ఉన్న కుటుంబాలలోని వ్యక్తులే వేధిస్తున్నారు. ముందు మీరు మీ కుటుంబ సభ్యులు మారండి అని రష్మీ సలహా ఇచ్చింది. ఈమెకి చిన్న పిల్లల కంటే జంతువులే ఎక్కువ అని ఓ నెటిజన్ కామెంట్స్ చేశాడు. అలా మొదలైన గొడవ పెద్ద రచ్చగా మారింది.
ఓ నెటిజన్ రష్మీ కులంపై కామెంట్స్ చేశాడు. రష్మీ బ్రాహ్మణ కులానికి చెందిన వారు. చిన్నప్పటి నుంచి ఆమె కులంలో శాకాహారం అలవాటు చేశారు. మాంసం ఎలాగూ తినదు కాబట్టి జంతువుల పై ప్రేమ ఉన్నట్లు నటిస్తోంది. తాను తినే ఫుడ్ గొప్ప అని మనమీద రుద్దడానికి జంతువుల పై ప్రేమ ఉన్నట్లు నటిస్తోంది అని కామెంట్ చేశాడు. అక్కడ కులం గురించి రచ్చ మొదలయింది.
నేను నా కులంలో పుట్టినందుకు మీలాగే గర్వపడుతున్నా. నా కులానికి జంతువుల పై ప్రేమకి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి కులం టాపిక్ తీసుకురావద్దు అని చెప్పింది. కానీ నెటిజన్లు పదేపదే ఆమె కులాన్ని ప్రస్తావించారు. మనిషి బతకడం కోసం తినాలి.. అది ఏదైనా.. తినడం కోసమే బతకకూడదు అని తెలిపింది. ఒకప్పుడు ఆదివారం రోజు నాన్ వెజ్ తినేవారు. కానీ ఇప్పుడు ప్రతి రోజూ జంతువులని చంపి తింటున్నారు అని పేర్కొంది.
మరో నెటిజన్ ఇతర కులాల్లో మీ కంటే ట్యాలెంట్ ఉంది రాత్రి పగలు కష్టపడే వారు ఉన్నారు. వాళ్ళకి మీకు మించిన అవకాశాలు రావాలి. కానీ నీతోపాటు, అనసూయ, శ్యామల, శ్రీముఖి, వర్షిణి, విష్ణుప్రియ, మంజూష లాంటి యాంకర్స్ అంతా ఎక్కువ మంది బ్రాహ్మణ, కమ్మ కులానికి చెందిన వారే. కాబట్టే మీకు అవకాశాలు వస్తున్నాయి అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దీనితో రష్మీ కూడా అంతే ఘాటుగా స్పందించింది. వెళ్లి వాళ్ళందరి క్యాస్ట్ సెర్టిఫికెట్స్ చెక్ చేసుకో. ఇది చాలా సెన్సిటివ్ టాపిక్. మీరు చెప్పిన వాళ్లంతా హార్డ్ వర్క్ చేసి ఈ స్థాయికి వచ్చారు. కులం వల్ల కాదు. పైగా మేమంతా టివిలో సక్సెస్ అయ్యాం. సినిమాల్లో కాదు. నీవన్నట్లు కులం వల్లే అవకాశాలు వచ్చేలా ఉంటే మేము సినిమాల్లో కూడా సక్సెస్ అయి ఉండాలి కూడా అని రష్మీ కౌంటర్ ఇచ్చింది.