మురళీమోహన్‌తో `జబర్దస్త్` రష్మి సరసం.. `అందాలన్నీ అందుకోరా` అంటూ స్టేజ్ మీదే రచ్చ.. ఇదేం ఆరాచకం రా బాబూ..
`జబర్దస్త్` రష్మి అందంతో, అభినయంతో అలరిస్తుంది. టీవీ షోస్‌లో రచ్చ చేస్తుంది. కుర్ర కారుకి ఊపు తెస్తుంది. అయితే ఇప్పుడు సీనియర్ నటులను కూడా ఉర్రూతలూగించడం విశేషం.
etv-sridevi drama company promo
యాంకర్ రష్మి గౌతమ్.. జబర్దస్త్ కి ఫిక్స్ అయిపోయింది. ఆమె ఓ వైపు `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోతోపాటు `శ్రీదేవి డ్రామా కంపెనీ` షోకి యాంకర్ గా చేస్తుంది. ఈ షోలో ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆల్ మిక్స్ లా ఉంటుంది. కామెడీ స్కిట్లు, డాన్సులు, పాటలు, ఇతర యాక్టివిటీస్ చేస్తుంటారు. ఇక ఫుల్ మీల్స్ లా పెడుతుంటారు. దీంతో షోకి మంచి రేటింగ్ వస్తుంది. ఇందులో రష్మి రచ్చ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది.
etv-sridevi drama company promo
అదే సమయంలో ఈ షోకి తరచూ గెస్ట్ లను ఆహ్వానిస్తూ ఎంటర్‌టైన్ చేస్తారు. వారి చేత ఎంటర్‌టైన్‌మెంట్ చేయిస్తారు. ఈ క్రమంలో తాజాగా సీనియర్ నటులు మురళీ మోహన్, జయసుధలను ఆహ్వానించారు. వారిని గౌరవించారు, వారిచేత నవ్వులు పూయించారు. కామెడీ చేయించారు. అలరించేలా చేశారు. అవి హైలైట్‌గా నిలిచాయి. కానీ ఇందులో యాంకర్ రష్మిపై మురళీ మోహన్ చేసిన వ్యాఖ్యలుగానీ, ఆయనపై రష్మి పాడిన పాట గానీ హైలైట్‌గా నిలిచింది.
etv-sridevi drama company promo
`శ్రీదేవి డామా కంపెనీ` 150వ ఎపిసోడ్‌ని పురస్కరించుకుని మురళీ మోహన్, జయసుధలకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పారు. వారి రాకతో షో మొత్తం సందడిలా మారింది. అందరి అటెన్షన్ వారిపైకే వెళ్లింది. ఆద్యంతం ఎంగేజ్ చేసేలా జరిగింది. అయితే రావడం రావడంతోనే మురళీ మోషన్.. యాంకర్ రష్మిపై ప్రశంసలు కురిపించారు. పరోక్షంగా పంచ్‌లు వేశారు. తన క్రష్ వెల్లడించారు.
etv-sridevi drama company promo
మిమ్మల్ని చూస్తుంటే ముంబయి హీరోయిన్‌ని చూస్తున్నట్టుగా ఉందని కితాబిచ్చాడు. దీంతో రష్మి ఆనందానికి అవదుల్లేవ్. ఆనందంతో ఉప్పొంగిపోయింది. అంతటితో ఆగలేదు. ఆమెకి తాను పెద్ద ఫ్యాన్ అంటూ పులిహోర కలిపే ప్రయత్నం చేశారు. ఇది విన్న వారంతా హో ఏసుకున్నారు. షో మొత్తం హోరెత్తిపోయింది.
etv-sridevi drama company promo
అనంతరం మురళీమోహన్‌ని ప్రత్యేకంగా సత్కరించుకున్నారు. ఆయన్ని ఉద్దేశించి హైపర్ ఆది ప్రశంసలతో కుడిని ప్రసంగం ఇచ్చారు. ఆయన గొప్పతనాన్ని కొనియాడారు. అనంతరం రష్మి రెచ్చిపోయింది. మామూలుగా కాదు, ప్రారంభంలో తనపై ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో రష్మి గౌతమ్ తన జోరు చూపించింది.
etv-sridevi drama company promo
మురళీ మోహన్‌ని పట్టుకుని రొమాంటిక్ సాంగ్ ఏసుకుంది. `అందగాడా అందగాడా.. అందాలన్నీ అందుకోరా..`, `అల్లుకోరా, గిల్లుకోరా.. అందమంతా నీదిరా..` అంటూ మురళీ మోహన్‌తోని రాసుకుని పుసుకునేలా డాన్స్ మూమెంట్ చేసింది. ఆయనలో జోష్ నింపింది. షో మొత్తాన్ని ఊపేసింది. దీంతో రచ్చ రచ్చ అయిపోయింది.
etv-sridevi drama company promo
`శ్రీదేవి డ్రామా కంపెనీ` షోకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోలోని కంటెంట్ ఇది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వైరల్ అవుతుంది. నెటిజన్లని అలరిస్తుంది.ఇందులో రష్మి, మురళీ మోహన్ ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. అయితే దీనిపై చాలా వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే సమయంలో బాబోయ్ రష్మి అరాచకం, రష్మి రచ్చ నెక్ట్స్ లెవల్ అంటూ మరింతగా రచ్చ లేపుతున్నారు.