- Home
- Entertainment
- పెళ్లి వార్త చెప్పిన రష్మి గౌతమ్.. ముహూర్తం ఫిక్స్.. చేసుకునేది ఎవరిని? సుడిగాలి సుధీర్ అభిమానుల్లో కలవరం
పెళ్లి వార్త చెప్పిన రష్మి గౌతమ్.. ముహూర్తం ఫిక్స్.. చేసుకునేది ఎవరిని? సుడిగాలి సుధీర్ అభిమానుల్లో కలవరం
జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ నాలుగు పదుల వయసుకు దగ్గరపడుతుంది.ఇంకా పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు తరచూ ఎదురవుతున్నాయి. దీంతో అందరికి ఒకేసారి సమాధానం చెప్పేందుకు రెడీ అవుతుంది రష్మి.

`జబర్దస్త్` యాంకర్ రష్మి గౌతమ్.. దాదాపు పదిహేనేళ్లుగా తన కెరీర్‌ని కొనసాగిస్తుంది. జబర్దస్త్ లోకి రాకముందు నుంచే ఆమె సినిమా ప్రయత్నాలు చేసింది. కొన్ని సినిమాల్లోనూ మెరిసింది. కానీ ఆమెకి గుర్తింపు రాలేదు. ఎవరూ గుర్తించలేదు. `జబర్దస్త్` కామెడీ షోకి యాంకర్‌గా వచ్చాక ఆమెకి మంచి గుర్తింపుతోపాటు క్రేజ్, యాంకర్‌గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. పదేళ్లుగా యాంకర్‌గా చేస్తూ విజయవంతంగా రాణిస్తుంది.
photo credit-ETV Balagam Promo
ఇక `జబర్దస్త్` షోలో కమెడియన్ సుడిగాలి సుధీర్‌తో కలిసి కెమిస్ట్రీ పండించి మెప్పించింది. ఇందులో ఇద్దరు లవ్ ప్రపోజ్ చేసుకున్నారు. డ్యూయెట్లు పాడుకున్నారు. ఒకరికొకరం అన్నారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేమని తెలిపారు. ఇద్ద ఘాటు ప్రేమికులు అని చాటు చెప్పుకున్నారు. అంతేకాదు షోలోనే పెళ్లి పీఠలెక్కారు. ఇక మూడు ముళ్లు పడటమే మిగిలి ఉందనేలా షోని రక్తికట్టించారు. ఆద్యంతం వినోదాన్ని పంచారు.
అంతేకాదు షోలోనే పెళ్లి పీఠలెక్కారు. ఇక మూడు ముళ్లు పడటమే మిగిలి ఉందనేలా షోని రక్తికట్టించారు. ఆద్యంతం వినోదాన్ని పంచారు. అయితే సుధీర్.. జబర్దస్త్ మానేసి ఏడాదిపైనే అవుతుంది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరు అడపాదడపా కలుసుకున్నారు. మరి ఇద్దరి మధ్య ప్రేమ ఉందా? పెళ్లి వరకు వెళ్తుందా అనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.
రష్మి ఏజ్ దాటిపోతుంది. నాలుగు పదులకు చేరువలో ఉంది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు చేసుకుంటుందో తెలియదు. దానిపై ఊసేలేదు. సుధీర్ కోసం వెయిట్ చేస్తుందా? అనేది తెలియదు. తన ప్లాన్స్ ఏంటో తెలియదు. కానీ తరచూ ఈ అమ్మడికి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. వాటిని నవ్వుతో దాట వేస్తూ వచ్చింది రష్మి.
ఇప్పుడు ఆ పెళ్లి ప్రశ్నలు బయటే కాదు, వర్క్ స్పేస్‌లోనూ ఎదురవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, తరచూ అదే ప్రశ్న. ఎవరూ చూసినా రష్మి పెళ్లి ఎప్పుడూ అంటున్నారు. దీంతో విసిగిపోయిన రష్మి ఎట్టకేలకు తన పెళ్లి కబురు చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.
మొత్తానికి జబర్దస్త్ రష్మి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతుంది. తన పెళ్లి కబురు చెప్పేందుకు రెడీ అయ్యింది. ఆ విషయాన్ని తాజాగా ప్రకటించింది. తనకు వరుసగా పెళ్లి ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆమె ఇక పెళ్లి ప్రకటన చేయాలని నిర్ణయించుకుంది. అందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది.
తాజాగా `రష్మి పెళ్లి పార్టీ` పేరుతో ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో తనకు ఎదురయిన పెళ్లి ప్రశ్నలను, ఆమె విసిగిపోయి ఇక పెళ్లి ప్రకటన చేయాలని నిర్ణయించుకోవడం విశేషం. అందరు రెడీ గా ఉండండి, డిసెంబర్ 31న ఆ విషయాన్ని చెప్పబోతున్నట్టు తెలిపింది రష్మి. దీంతో సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రష్మి నిజంగానే అంతటి సాహసం చేస్తుందా? సుధీర్‌ని కాకుండా వేరొకరిని పెళ్లి చేసుకుంటుందా? ఆ వ్యక్తి ఎవరు? అనే ఆరా తీస్తున్నారు. కలవరానికి గురవుతున్నారు.
కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా. ఈ ఇయర్ ఎండ్ సెలబ్రేషన్‌లో భాగంగా ఈ రష్మి పెళ్లి పార్టీ ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఇదంతా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలోని భాగమని, ప్రత్యేకంగా ఇయర్ ఎండ్ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఆ రోజు రష్మి ఏం చెప్పబోతుందని, నిజంగానే పెళ్లి వార్త చెబుతుందా? లేక ప్రాంక్ చేసి వదిలేస్తుందా? అనేది చూడాలి.