MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సుధీర్ తో రొమాన్స్ అంతా డ్రామానే.. రష్మీకి కాబోయే అసలైన భర్త ఇతడే ?

సుధీర్ తో రొమాన్స్ అంతా డ్రామానే.. రష్మీకి కాబోయే అసలైన భర్త ఇతడే ?

జబర్దస్త్ షో యాంకర్‌ రష్మి.. పెళ్లి పార్టీ అంటూ సందడి చేసింది. తాను పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పింది. అంతేకాదు త్వరలోనే కాబోయే భర్తని పరిచయం చేస్తానని తెలిపింది. తాజాగా అనంత పని చేసింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 30 2023, 09:17 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రష్మి గౌతమ్‌.. నాలుగు పదులు దగ్గరపడుతుంది. ఇంకా సింగిల్‌గానే ఉంది. ఇన్నాళ్లు సుడిగాలి సుధీర్‌తో పులిహోర కలిపింది. ఇద్దరూ లవర్స్ గా బుల్లితెరపై మెప్పించారు. స్టేజ్‌పై కెమిస్ట్రీ పండించి ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఈ జంటకి ప్రత్యేకమైన అభిమానగనం ఏర్పడిందంటే అతిశయోక్తి కాదు. కానీ ఇటీవల ఈ ఇద్దరు విడిపోయారు. సుధీర్‌ సినిమాల వైపు వెళ్లాడు. రష్మి జబర్దస్త్ కే పరిమితమయ్యింది. 

27

సింగిల్‌గానే షోస్‌ చేస్తుంది జబర్దస్త్ రష్మి. ఇంకా ఒంటరిగానే ఉంటుంది. పెళ్లి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. తనకు వరుసగా పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో ఎట్టకేలకు స్పందించింది. త్వరలోనే కాబోయే వాడిని పరిచయం చేస్తానని, పెళ్లి కబురు చెబుతానని వెల్లడించింది. ఈ మేరకు `పెళ్లి పార్టీ` పేరుతో ఓ గ్లింప్స్ వదిలింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేసింది రష్మి. 
 

37

ఇయర్‌ ఎండ్ స్పెషల్‌గా ప్రసారం కానున్న `పెళ్లి పార్టీ` స్పెషల్‌ ఈవెంట్‌ ప్రోమో విడుదలైంది. అయితే ఇందులో తనకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. కాబోయే వాడిని పరిచయం చేస్తా అన్నావు? నవ్వు చేసుకోబోయే వాడు ఎలా ఉంటాడో మేమూ చూడాలనుకుంటున్నాం హైపర్‌ ఆది.. రష్మిని అడిగాడు. దీంతో సిగ్గులతో ముగ్గేసిన రష్మి గౌతమ్‌ ఎట్టకేలకు సర్‌ప్రైజ్‌ చేసింది. 
 

47

యాంకర్‌ రష్మి.. దానికి సంబంధించిన విషయం చెబుతూ సంతోషానికి లోనయ్యింది. ఈ సందర్భంగా కాబోయే వాడి గురించి చెబుతూ, `ప్రతి అమ్మాయికి కాబోయే వాడి గురించి ఒక ఇమాజినేషన్‌ ఉంటుంది. చేసుకునేవాడు ఇలా ఉండాలి, అలా ఉండాలని అనుకుంటారు. పొడుగ్గా ఉండాలనుకుంటారు అని అంటున్న క్రమంలో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. 

57

క్లీన్‌ షేవ్‌లో, హైట్‌ పర్సనాలిటీతో రొమాంటిక్‌ బాయ్‌లా ఉన్నాడు. పిల్లి కళ్లు, పూర్తి వైట్‌గా ఉన్నాడు. చూడ్డానికి ఫారెన్‌ కుర్రాడిలా ఉన్నాడు. మంచి హ్యాండ్సమ్‌ అని చెప్పొచ్చు. అందరిని ఆయనకు పరిచయం చేసింది. అంతేకాదు హైపర్‌ ఆదితో ఏదో గొడవ కూడా పడింది. కాసేపు హంగామా జరిగింది. 
 

67

ఈ సందర్భంగా స్టేజ్‌పైనే కాబోయే వాడిని చూస్తూ ఉండిపోయింది. కళ్లల్లో ప్రేమ, ముఖంలో ఆనందం కనిపిస్తుంది. యాంకర్‌ రష్మి మొత్తానికి ఫుల్‌ హ్యాపీగా ఉంది. అయితే రష్మి పరిచయం చేసిన వ్యక్తి.. హైట్‌ పర్సనాలిటీలో సుడిగాలి సుధీర్‌ని మించి ఉన్నాడు. పైగా రష్మి కోరుకున్నట్టుగా, ఆమె చెప్పిన క్వాలిటీస్‌ అన్నీ అతనిలో కనిపిస్తున్నాయి. సుధీర్‌కి జెలసీ పుట్టించేలా ఉన్నాడని చెప్పొచ్చు.
 

77

ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. మరి నిజంగానే యాంకర్‌ రష్మి చేసుకోబోయే వ్యక్తినా? అతను ప్రియుడా? లేక ప్రాంకా? అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి షోస్‌లో చాలా వరకు ప్రాంక్ చేస్తుంటారు. నిజాలు వెల్లడించడం చాలా అరుదు. మరి రష్మి ఏం చేయబోతుందనేది చూడాలి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, ఇది పెద్ద కామెడీ అని, ప్రాంక్‌ చేస్తున్నారని అంటున్నారు నెటిజన్లు. రష్మికి సుధీరే సరైన జోడీ అంటున్నారు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రష్మీ గౌతమ్
Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad: పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ.. ఇచ్చి పడేసే గోత్రంతో ఇరగదీసిన పవర్ స్టార్, కానీ
Recommended image2
Dhurandhar 2 Review: ధురంధర్‌ 2 మూవీ రివ్యూ, రేటింగ్‌.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image3
జోరందుకున్న ఉస్తాద్ అడ్వాన్స్ బుకింగ్స్, గంటల వ్యవధిలోనే ఏం మ్యాజిక్ జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved