MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • సినిమా అవకాశాలు లేక ప్రాణాలు తీసుకున్న స్టార్స్ వీరే.. వెండితెర వెనుక హృదయాన్ని కదిలించే విషాదాలు

సినిమా అవకాశాలు లేక ప్రాణాలు తీసుకున్న స్టార్స్ వీరే.. వెండితెర వెనుక హృదయాన్ని కదిలించే విషాదాలు

Actors Suicide: సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌.. ఆరేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నారు. సినిమాలు లేకపోవడం వల్లే, బాలీవుడ్‌ మాఫియా వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఆయనలా ఇండస్ట్రీని విషాదంని మిగిల్చిన స్టార్స్ ఎవరో తెలుసుకుందాం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 26 2026, 09:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
టీవీ నటుడు నితిన్‌ చౌహాన్‌
Image Credit : Instagram

టీవీ నటుడు నితిన్‌ చౌహాన్‌

`స్ల్పిట్స్ విల్లా’, ‘క్రైమ్ పెట్రోల్’ వంటి టీవీ షోలలో కనిపించిన ఈ 35 ఏళ్ల నటుడు నితిన్ చౌహాన్, 2024  నవంబర్‌ లో ముంబైలో ఆత్మహత్య చేసుకున్నారు. చాలా ఏళ్లుగా టీవీ, సినిమా అవకాశాలు లేకపోవడంతో అతను డిప్రెషన్‌తో బాధపడ్డాడని, దీని కారణంగానే మరణించినట్టు పోలీస్‌ రిపోర్ట్ లో తేలిపింది. ఆయనకు అప్పటికే పెళ్లై ఓ కూతురు కూడా ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
భోజ్‌పురి నటి అమృతా పాండే
Image Credit : Instagram

భోజ్‌పురి నటి అమృతా పాండే

27 ఏళ్ల భోజ్‌పురి నటి అమృతా పాండే, ఏప్రిల్ 2024లో భాగల్పూర్‌లోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకొని షాకిచ్చింది. ఆమెను అన్నపూర్ణ అనే స్క్రీన్ నేమ్‌తో కూడా పిలుస్తారు. చాలాకాలంగా అవకాశాలు రాకపోవడంతో ఆమె డిప్రెషన్‌తో బాధపడిందని, దీని కారణంగా ఆమె ప్రాణాలు తీసుకుందని విచారణలో బయటపడింది. 

38
 టీవీ నటుడు మన్‌మీత్‌ గ్రెవాల్‌
Image Credit : Instagram

టీవీ నటుడు మన్‌మీత్‌ గ్రెవాల్‌

32 ఏళ్ల టీవీ నటుడు మన్‌మీత్ గ్రెవాల్, మే 2020లో ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు. నటించడానికి ప్రాజెక్ట్ లు లేకపోవడంతో పెరుగుతున్న అప్పులను భరించలేక తీవ్రమైన ఒత్తిడికి గురై ప్రాణాలు విడిచినట్టు  తెలిసింది.

48
 టీవీ నటి ప్రేక్షా మెహతా
Image Credit : Instagram

టీవీ నటి ప్రేక్షా మెహతా

‘క్రైమ్ పెట్రోల్’లో కనిపించిన టీవీ నటి ప్రేక్షా మెహతా, మే 2020లో ఇండోర్‌లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. 25 ఏళ్ల ఈ నటి, మహమ్మారి లాక్‌డౌన్ సమయంలో అవకాశాలు లేకపోవడం, షూటింగ్‌లు ఆగిపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిందని, దీంతో ఆత్మహత్యకు పాల్పడిందని రిపోర్టులు వచ్చాయి.

58
 ఎంఎస్‌ ధోనీ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌
Image Credit : Instagram

ఎంఎస్‌ ధోనీ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జూన్ 2020లో బాంద్రాలోని తన ఇంట్లో చనిపోయి కనిపించాడు. 34 ఏళ్ల సుశాంత్ అవకాశాలు తగ్గడం, సక్సెస్‌ లేకపోవడంతో మానసికంగా కుంగిపోయి ప్రాణాలు తీసుకున్నారు. ఆయన మరణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్‌ సినిమా మాఫియా ఆయన్ని ఎదగనివ్వలేదని, అవకాశాలు రాకుండా చేశారని, దీని కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సుశాంత్‌ `ఎంఎస్‌ ధోని` చిత్రంతో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. 

68
 బెంగాలీ నటి మౌమితా సాహా
Image Credit : Instagram

బెంగాలీ నటి మౌమితా సాహా

బెంగాలీ టీవీ నటి మౌమితా సాహా నటిగా ఎదుగుతున్న సమయంలోనే , 2019లో కోల్‌కతాలోని తన ఫ్లాట్‌లో చనిపోయి కనిపించింది. పోలీస్, సోషల్ మీడియా విచారణ ప్రకారం, 23 ఏళ్ల ఈ నటి సినిమా, టీవీ పరిశ్రమలో గుర్తింపు కోసం పోరాడుతూ తీవ్రమైన డిప్రెషన్‌తో బాధపడింది. ఆయా పరిస్థితులు తట్టుకోలేక వెళ్లిపోయిందంటారు.

78
నటుడు కుశాల్‌ పంజాబీ
Image Credit : Instagram

నటుడు కుశాల్‌ పంజాబీ

నటుడు, డ్యాన్సర్ అయిన కుశాల్ పంజాబీ, డిసెంబర్ 2019లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు. 42 ఏళ్ల ఈ నటుడు డిప్రెషన్, వ్యక్తిగత సమస్యలు, పనిలేకపోవడంతో వచ్చిన ఆర్థిక ఒత్తిడితో బాధపడ్డాడని, దీని కారణంగా ఆయన మరణించినట్టు తెలిసింది. 

88
 నటి శిఖా జోషి
Image Credit : Instagram

నటి శిఖా జోషి

‘బి.ఏ. పాస్’ సినిమాలో నటించిన నటి శిఖా జోషి, మే 2015లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో చనిపోయి కనిపించింది. చనిపోయే ముందు 40 ఏళ్ల శిఖా, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో యాక్టింగ్ అవకాశాలు రాకపోవడంపై తీవ్ర నిరాశ, డిప్రెషన్‌లో ఉన్నట్లు చెప్పింది.

Disclaimer: ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. మీకు కూడా ఆత్మహత్య చేసుకోవాలని లేదా మిమ్మల్ని మీరు గాయపరుచుకోవాలని ఆలోచనలు వస్తుంటే, వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సైకియాట్రిస్ట్ సహాయం తీసుకోండి. కింద ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి కూడా సహాయం పొందవచ్చు. ఆస్రా (ముంబై) 022-27546669, సుమైత్రీ (ఢిల్లీ) 011-23389090, రోష్ని (హైదరాబాద్) 040-66202000, లైఫ్‌లైన్ 033-64643267 (కోల్‌కతా). స్పందన్ (మధ్యప్రదేశ్) 9630899002, 7389366696, సంజీవని: 0761-2626622, TeleMANAS 1-8008914416/14416, జీవన్ ఆధార్: 1800-233-1250. వండ్రేవా ఫౌండేషన్ ఫర్ మెంటల్ హెల్త్: 9999666555 , ISS iCall: 022-25521111. మానసిక ఒత్తిడికి కౌన్సెలింగ్ కోసం 14416, 1800 8914416 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించి ఇంట్లో నుంచే సహాయం పొందవచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవి ముఖం మీదే బాలేదని చెప్పిన నటుడు ఎవరో తెలుసా? సెట్ లో అంతా షాక్..
Recommended image2
Mohan Babu: రాజమౌళికి పొగరు, రాఘవేంద్రరావుకి అహంకారం ఎక్కువ.. మోహన్ బాబు సంచలన కామెంట్స్..
Recommended image3
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Related Stories
Recommended image1
Samantha: భర్త రాజ్‌ నిడిమోరు గురించి ఫస్ట్ టైమ్‌ ఓపెన్‌ అయిన సమంత.. మా ఇంటి బంగారం ట్రైలర్‌ ఎలా ఉందంటే?
Recommended image2
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ తో రొమాన్స్ చేసి చివరికి మెకానిక్‌లా మారిపోయిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved