యానిమల్ మూవీ ఫస్ట్ రివ్యూ... అర్జున్ రెడ్డి జస్ట్ శాంపిల్, వైలెన్స్ కి మీనింగ్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా!
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్ మూవీ తెరకెక్కింది. డిసెంబర్ 1న ఈ మూవీ విడుదల అవుతుంది. సెన్సార్ జరుపుకున్న యానిమల్ మూవీ టాక్ బయటకు వచ్చింది.
అర్జున్ రెడ్డి మూవీతో ఒక ట్రెండ్ సెట్ చేశాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. హీరో విజయ్ దేవరకొండ ఫేట్ మార్చేసిన చిత్రం అది. హీరో క్యారెక్టరైజేషన్ చాలా భిన్నంగా తీర్చిదిద్దాడు. కోపం, ప్రేమ... ఎమోషన్ ఏదైనా అదుపుకోలేడు. ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. అర్జున్ రెడ్డి ఎంత పెద్ద విజయం సాధించిందో అదే స్థాయిలో విమర్శల పాలైంది. అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి మరో భారీ హిట్ కొట్టాడు.
Animal movie
అలాంటి దర్శకుడు నుండి వస్తున్న యానిమల్ మూవీపై సాధారణంగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ తో అవి మరో స్థాయికి చేరాయి. యానిమల్ మూవీ డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యానిమల్ చిత్రానికి A సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే ఓన్లీ అడల్ట్స్ చూసే సినిమా అని.
యానిమల్ చిత్ర నిడివి 3 గంటలు. సందీప్ రెడ్డి వంగా సుదీర్ఘంగా కథను చెప్పారని తెలుస్తుంది. ఇది రివేంజ్ డ్రామా. తండ్రిని అమితంగా ప్రేమించే కొడుకు కథ. తండ్రి చావుకు కారణమైన వాళ్ళపై పగ ఎలా తీర్చుకున్నాడు అనేది కథలో చెప్పారు.
animal movie trailer
యానిమల్ మూవీలో వైలెన్స్ ఊహకు మించి ఉన్నట్లు సమాచారం. కొన్ని సన్నివేశాల్లో మారణహోమం చూపించారట. సిల్వర్ స్క్రీన్ పై రక్తం ఏరులై పారించారట. సెక్స్వల్, కంటెంట్, అబ్యూసివ్ వర్డ్స్ కూడా ఉన్నాయట. ఈ కారణాలతో A సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం.
తండ్రి-కొడుకుల ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా ఉంటాయట. ఓ భిన్నమైన కోణంలో సందీప్ రెడ్డి సన్నివేశాలతో ఆవిష్కరించారు అంటున్నారు. హీరో క్యారెక్టర్ చాలా వైలెంట్ గా ఉంటుందని సమాచారం. అర్జున్ రెడ్డికి మించి వైల్డ్ గా క్యారెక్టర్ డిజైన్ చేశాడట.
హీరో పాత్రకు మించి వైల్డ్ గా విలన్ బాబీ డియోల్ రోల్ ఉందట. ఆయనపై తెరకెక్కిన కొన్ని సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయని అంటున్నారు. బాబీ డియోల్ కెరీర్లో ఎన్నడూ చేయని పాత్రగా ఇది ఉంటుందట.
ఇక హీరోయిన్ రష్మిక పాత్ర కథలో చాలా కీలకం అని సెన్సార్ రివ్యూ ద్వారా తెలుస్తుంది. హీరోతో పాటు హీరోయిన్ పాత్ర సినిమా మొత్తం ట్రావెల్ చేస్తుందట. రెగ్యులర్ హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఉంటుందని సమాచారం. రన్బీర్ తో రష్మీకి రొమాన్స్ కూడా హైలెట్ అంటున్నారు.
అనిల్ కపూర్ పాత్ర సినిమాకు చాలా ప్రత్యేకం అంటున్నారు. కథలో కీలకమైన ట్విస్ట్స్ టర్న్స్ ఉన్నట్లు సమాచారం. మూడు గంటల నిడివి కూడా ఎలాంటి బోర్ కొట్టకుండా సాగుతుందని సమాచారం. మొత్తంగా యానిమల్ తో సందీప్ రెడ్డి వంగా మరో బ్లాక్ బస్టర్ కొట్టనున్నాడట.