ఆలియా ఎంకరేజ్ తోనే ఆ సీన్లు చేశా.. రణబీర్ కపూర్ కామెంట్స్..
ఒకప్పుడు ప్లే బాయ్ గా.. లవ్వర్ బాయ్ గా.. బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా వెలుగు వెలిగిన రణబీర్ కపూర్.. ఇప్పుడు ఓ భర్తగా.. తండ్రిగా.. కంట్రోల్ లో ఉండక తప్పడం లేదు.. అయినా యానిమల్ సినిమాలో రెచ్చిపోవడానికి కారణం ఏంటో రివిల్ చేశాడు బాలీవుడ్ స్టార్ హీరో.
యానివమల్ సినిమాలో రణబీర్ కపూర్ రెచ్చిపోయాడు.. బాలీవుడ్ లో రొమాంటిక్ ఇమేజ్ ఉన్న ఈ హీరో.. మాస్ యాక్షన్ తో పాటు.. బోల్డ్ సీన్స్ కూడా అదరగొట్టాడు. అయితే ఒకప్పుడు రణబీర్ అయితే.. ప్లే బాయ్ గా.. లవర్ బాయ్ గా అందరికి సుపరిచితమే.. కాని ఇప్పుడు ఈ హీరో పెళ్ళై.. ఓ పాపకు తండ్రి కూడా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను 5 ఏళ్లు ప్రేమించి.. మూడు ముళ్ళు వేశాడు.
ఇక రణబీర్ రొమాంటిక్ ఇమేజ్ అలానే ఉంటుందేమో కాని.. మనోడు మాత్రం సినిమాల్లో కాస్త హద్దులు పాటించాల్సిందే. బాలీవుడ్ స్టార్ కపుల్స్ లిస్ట్ లో ముందు ఉన్నారు రణబీర్ కపూర్, అలియా భట్.. ఇద్దరు ప్రస్తుతం కెరీర్ లో మంచి ఊపుమీద ఉన్నారు. అలియా భట్ రీసెంట్ గా ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంటే.. రణబీర్ యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాడు.
ఇలా ఇద్దరు సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నారు. రణబీర్ అయితే.. యానిమల్ మూవీతో 900 కోట్లకు పైగా కలెక్షన్స్ ని సాధించాడు.. తన కెరీర్ లోనే ఈ సినిమా హైయెస్ట్ ని నమోదు చేసుకున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా రష్మిక, త్రిప్తి దిమ్రి హీరోయిన్స్ గా నటించారు.
ఇక అసలు విషయానికి వస్తే.. మూవీలో హీరో హీరోయిన్ మధ్య అదిరిపోయే హాట్ హాట్ సీన్స్ రావడం తెలిసిందే. సందీప్ వంగా సినిమా.. అందులోనూ.. బాలీవుడ్ రొమాంటిక్ హీరో రణబీర్ అక్కడ.. ఇక సీన్లు ఏరేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. మరి పెళ్ళై .. ఓపాపకు తండ్రిగా మారిన రణబీర్.. ఆలియా ఉండగా.. అలా ఎలా నటించాడు అని అందరికి డౌటు. ఈ విషయంలో ఆలియా నుంచి ఏమాత్రం వ్యతిరేకత రాలేదా అని రణబీర్ ను ప్రశ్నించారట కూడా..
అయితే ఆ విషయంలో తాజాగా ఈస్టార్ హీరో క్లారిటీ ఇచ్చాడు. ఈ సీన్స్ చేయడానికి రణబీర్ కూడా ముందుగా సందేహంలో నిలిచారట. అయితే అలియా భట్ తనని ఎంకరేజ్ చేసి.. ఆ ఇంటిమేట్ సీన్స్ చేయడానికి రణబీర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. యానిమల్ సినిమాకి సంబంధించి ప్రతి సన్నివేశం గురించి రణబీర్, అలియాతో మాట్లాడేవారట. ఈక్రమంలోనే ఈ ఇంటిమేట్ సీన్స్ గురించి కూడా చెప్పారట.
అయితే సినిమాని సినిమాగానే ట్రీట్ చేయాలని.. ఆలియా భట్ ఆలోచించి.. ఈసీన్లకు అడ్డు చెప్పలేదని అంటున్నారు. అంతే కాదు.. రణబీర్ ఇమేజ్ ను ఆమె బ్రేక్ చేయదలుచుకోలేదట. ఇక దాంతో ఎప్పటిలాగానే యానిమల్ సినిమాలో రణబీర్ రెచ్చిపోయాడు. ఎంతైనా రొమాంటిక్ హీరో కదా..?