ఏనుగులన్నీ నాపైకి వచ్చేయడంతో చాలా భయం వేసింది- రానా

First Published Mar 23, 2021, 7:24 PM IST

దేశవ్యాప్తంగా పలు భాషల్లో నటిస్తూ విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వెర్స‌టైల్ హీరో రానా దగ్గుబాటి. ఆయన ప్రధాన పాత్ర పోషించిన చిత్రం అరణ్య. ప్రభు సాల్మోన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రీయా పింగోల్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈరోస్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ మూవీ మార్చి26న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలవుతుంది. హిందీలో హాథీమేరేసాథీ, తమిళంలో కాదన్‌ అనే టైటిల్స్‌తో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సంద‌ర్భంగా వెర్స‌టైల్ హీరో రానా దగ్గుబాటి ఇంట‌ర్వ్యూ.