- Home
- Entertainment
- సీతని తెమ్మంటే పీతని తెచ్చారు, రమ్యకృష్ణని అవమానించిన స్టార్ డైరెక్టర్, అయితేనేం ఆయనే డేట్ కోసం వెయిటింగ్
సీతని తెమ్మంటే పీతని తెచ్చారు, రమ్యకృష్ణని అవమానించిన స్టార్ డైరెక్టర్, అయితేనేం ఆయనే డేట్ కోసం వెయిటింగ్
Ramya Krishnan : రమ్యకృష్ణ తెలుగుకి పరిచయం చేసిన సినిమా `కంచు కాగడ`. కానీ ఆమె సైన్ చేసిన మూవీ వేరే ఉంది. అదేంటి? ఆ సమయంలో డైరెక్టర్ ఎలా అవమానించాడో తెలుసుకుందాం.

ramya krishnan
Ramya Krishnan : రమ్యకృష్ణ.. `బాహుబలి`కి ముందు `బాహబలి`కి తర్వాత అనేలా మారిపోయింది. శివగామిగా ఆమె వేరే లెవల్ యాక్షన్ చూపించింది. ఇప్పుడు రమ్యకృష్ణని చూసే కోణమే మారిపోయింది. సరైన రోల్ పడితే తాను ఎంతగా రెచ్చిపోతుందో చూపించింది. అయితే రమ్యకృష్ణకి తెలుగులో తొలి సినిమాతోనే అవమానం జరిగింది. మరి అదేంటో చూద్దాం.
ramya krishnan
రమ్యకృష్ణ కోలీవుడ్‌లో నటిగా పరిచయమై తెలుగులోకి వచ్చింది. 1983లో ఆమె కోలీవుడ్‌లో పరిచయం కాగా, తెలుగులోకి ఏడాది తర్వాత `కంచు కాగడ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది. కానీ ఆమె మొదట కమిట్ అయిన మూవీ మాత్రం `కృష్ణలీల`. దీనికి రవిరాజా పినిశెట్టి దర్శకుడు. ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ రావు నిర్మాత. ఆయన కొడుకే కళ్యాణ చక్రవర్తి. ఆయన్ని హీరోగా పెట్టి ఈ మూవీ తీశారు.
krishna leela
త్రివిక్రమ రావు, ఆయన స్నేహితుడు నాగేశ్వరరావు కలిసి నిర్మించారు. ఇది హిందీలో ఓ మూవీకి రీమేక్. ఈ సినిమా సెలక్షన్ సమయంలో సీత పాత్ర కోసం హీరోయిన్ల అన్వేషణ జరుగుతుంది. ఆ బాధత్యలు అప్పట్లో లిరిక్ రైటర్ కనగాల జయకుమార్‌కి అప్పగించారు. ఆయన ఓ మూవీ షూటింగ్‌లో రమ్యకృష్ణని చూశారు. చూడగానే భలే అనిపించింది. దీంతో ఆమెని తీసుకొని వెళ్లి రవిరాజా పినిశెట్టికి చూపించారు.
jayakumar
రమ్యకృష్ణని చూడగానే రవిరాజా పినిశెట్టి అన్న మాట.. `సీతని తెమ్మంటే పీతని తెచ్చావ్` అంటూ మండిపడ్డాడట. కానీ రమ్యకృష్ణ నిర్మాతలకు నచ్చింది. దీంతో రవిరాజాని కన్విన్స్ చేశారు. ఎట్టకేలకు ఆమెనే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అలా తెలుగులో రమ్యకృష్ణ ఫస్ట్ సైన్ చేసిన మూవీ `కృష్ణ లీల`. ఇందులో లీల పాత్రలో కళ్యాణ్ చక్రవర్తికి జోడిగా రమ్యకృష్ణ నటించి మెప్పించింది.
ramya krishnan
ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మోహన్‌బాబుని ఎంపిక చేశారు. ఆయన హీరోగా సినిమాలు చేసి ఉన్నాడు, విలన్‌గా కూడా చేస్తున్నాడట. ఇందులోనూ అలాంటి పాత్రనే. మొదట నో చెప్పినా, తర్వాత చేశాడట. సినిమా షూటింగ్ సాగిందని, దీంతో రిలీజ్ లేట్ అయ్యింది. కమిట్ అయిన మూడేళ్ల తర్వాత ఈ మూవీ విడుదలైంది. రమ్యకృష్ణకి మంచి పేరు తెచ్చింది.
ramya krishnan
అలా కనగాల జయకుమార్.. రమ్యకృష్ణని తెలుగుకి పరిచయం చేసిన క్రెడిట్ సంపాదించుకున్నాడు. రవిరాజ పినిశెట్టి ఆ రోజు అన్నమాటకి చాలా బాధపడిన రమ్యకృష్ణ తన నటనతో, గ్లామర్‌తో మెప్పించింది. మళ్లీ ఆయన వరుసగా తన సినిమాల్లో హీరోయిన్‌గా తీసుకునేలా చేసింది. తన డేట్స్ కోసం వెయిట్ చేసేలా చేసిందట.
read more: 280 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. పొలిటికల్‌గా సంచలనంగా మారిన మంచు విష్ణు కామెంట్స్