- Home
- Entertainment
- వన్నె తగ్గని అందం.. రమ్యకృష్ణ సొంతం.. యంగ్ హీరోయిన్లకు సవాల్ విసురుతున్న ‘శివగామి’.!
వన్నె తగ్గని అందం.. రమ్యకృష్ణ సొంతం.. యంగ్ హీరోయిన్లకు సవాల్ విసురుతున్న ‘శివగామి’.!
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishnan) అందాల పోటీల్లో యంగ్ బ్యూటీలకు సవాల్ విసురుతోంది. వన్నె తగ్గని అందంతో చీరకట్టులో పరువాల విందు చేస్తూ కుర్రాళ్లను కవ్వించేలా పోజులిచ్చింది. లేటెస్ట్ ఫొటోషూట్ తో అదరగొడుతోంది.

ఐదు పదుల వయస్సులోనూ వన్నె తగ్గని అందంతో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ మతిపోగొడుతోంది. వరుస చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్ష్ లోనూ దుమ్ములేపుతోంది. ‘బాహుబలి’తో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు టీవీ షోలతోనూ అలరిస్తోంది.
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో గ్లామర్ పరంగా కుర్రాళ్లను ఊర్రూతలూగించిన రమ్యకృష్ణ ఇప్పటికీ వన్నె తగ్గని అందంతో ఆకట్టుకుంటోంది. సినిమాల్లో మెరుస్తూనే ఇటు సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ లో రచ్చ చేస్తోంది. వయస్సు పెరుగుతున్న కొద్ది మరింత అందాన్ని సొంతం చేసుకుంటోంది.
రమ్యకృష్ణను అభిమానించే వారికి ఇటీవల వరుస చేస్తున్న ఫొటోషూట్లు ఐఫీస్ట్ ను కలుగజేస్తున్నాయి. చీరకట్టులో కుర్ర హీరోయిన్లకే షాకిచ్చేలా ఫొటోలకు ఫోజులిస్తోంది. గ్లామర్ షోలో రమ్యకృష్ణ చేస్తున్న ఫొటోషూట్స్ యంగ్ హీరోయిన్లకు సవాల్ గా మారింది. తాజాగా శివగామి పోస్ట్ చేసిన పిక్స్ స్టన్నింగ్ ఉన్నాయి.
ఈ ఫొటోల్లో రమ్యకృష్ణ అందాల విందు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చీరకట్టులో సీనియర్ హీరోయిన్ పరువాల ధాటికి కుర్రాళ్లు సైతం ఉలిక్కి పడుతున్నారు. ఓరకంటి చూపులకు చిత్తైపోతున్నారు. తాజాగా స్లీవ్ లెస్ బ్లాజ్, ట్రాన్స్ ఫరెంట్ శారీలో ఫొటోలకు క్రేజీగా పోజులిచ్చింది. అన్నీ యాంగిల్లో అదుర్స్ అనిపించింది.
ప్రస్తుతం రమ్యకృష్ణ సౌత్ లోని అన్ని భాషల్లో నటిస్తోంది. ఏ ప్రాజెక్ట్ మొదలైనా ఫీమేల్ లీడ్ రోల్ లో అవకాశం అందుకుంటోంది. చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ ను కలిగి ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇలా గ్లామర్ విందు చేస్తోంది. ఇంటర్నెట్ లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.
ఇప్పటికే వెండితెరపై చెరగని ముద్ర వేసుకున్న రమ్యకృష్ణ.. ఇటు బుల్లితెరపై ఫోకస్ పెట్టింది. అదిరిపోయే టీవీషోలతో టెలివిజన్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇప్పటికే ‘బీబీ జోడీగల్ 2’ (BB Jodigal 2) తమిళ షోకు కు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. తెలుగులోనూ ఇటీవల ‘డాన్స్ ఐకాన్’ షోకు జడ్జీగా తన సత్తా చాటుతోంది.
రీసెంట్ ఎపిసోడ్ లో డాన్స్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో కలిసి ‘డాన్స్ ఐకాన్’ షోలో రమ్యకృష్ణ వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇలా సినిమాలు, టీవీ షోలో, ఓటీటీలోనూ అడుగుపెట్టి తనదైన శైలిలో దూసుకుపోతోంది. చివరిగా ‘లైగర్’ (Liger)లో విజయ్ కి అమ్మ పాత్రలో నటించింది. ప్రస్తుతం ఆయా భాషల్లోని చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉంది.