MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `మగధీర` టైమ్‌లో కాజల్‌తో చాలా ఇబ్బంది పడ్డా.. ఎన్టీఆర్‌తో చెప్పి షాకిచ్చిన రామ్‌చరణ్‌.. అసలేం జరిగిందంటే?

`మగధీర` టైమ్‌లో కాజల్‌తో చాలా ఇబ్బంది పడ్డా.. ఎన్టీఆర్‌తో చెప్పి షాకిచ్చిన రామ్‌చరణ్‌.. అసలేం జరిగిందంటే?

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఓ షాకింగ్‌ విషయం వెల్లడించాడు. `మగధీర` టైమ్‌లో కాజల్‌తో ఇబ్బంది పడ్డ విషయాన్ని ఇన్నాళ్లకి రివీల్‌ చేశాడు. ఎన్టీఆర్‌ ముందు ఆ సంఘటన పంచుకుని అభిమానులకు షాక్‌ ఇచ్చాడు. ఇంతకి ఏం జరిగిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 22 2021, 10:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎన్టీఆర్‌ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షో నేడు(ఆదివారం) రాఖీ సందర్బంగా ప్రారంభమైంది. షో చాలా సింపుల్‌గా ప్రారంభమైంది. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా ప్రారంభించారు ఎన్టీఆర్‌. మొదటగా శ్రీ శ్రీ వ్యాఖ్యలు చెప్పి అందరి మనసులను దోచుకున్నారు. 

27
Evaru meelo koteeswarulu

Evaru meelo koteeswarulu

గతంలో మాదిరిగానే `ఎవరు మీలో కోటీశ్వరులు` షో సాగింది. ఎలాంటి మార్పులు లేకుండా అవే నిబంధనలతో షో సాగుతుందనే విషయాన్ని ఎన్టీఆర్‌ చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ షోకి తొలి గెస్ట్ గా రామ్‌చరణ్‌ పాల్గొనడంతో షోకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఎందుకంటే వీరిద్దరు కలిసి `ఆర్‌ఆర్ఆర్‌` నటిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్‌ ఆసక్తికరంగా మారింది. 

37

ఇందులో సెలబ్రిటీలు గెలుచుకునే మనీ సొంతంగా వాడుకోకూడదని, ఛారిటీ కోసం ఆడాలని చెప్పగా, `కరోనా క్రైసిస్ ఛారిటీ`(సీసీసీ) కోసం ఇందులో గెలుచుకున్న మొత్తాన్ని విరాళంగా అందిస్తామన్నారు చరణ్‌.

47

ఎన్టీఆర్‌తో సాగిన గేమ్‌లో తన పర్సనల్‌గా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు చరణ్‌. తన వద్ద గతంలో ఆరు డాగ్స్ ఉండేవన్నారు. ఓ పెద్ద డాగ్‌ ఉండేదని తెలిపారు. అది చాలా స్పెషల్‌ అని చెప్పారు. 

57

మరోవైపు తన వద్ద గుర్రాలు కూడా ఉన్నాయని, అందులో ఒక దాని పేరు బాద్షా అని తెలిపారు. అది `మగధీర` టైమ్‌లో ఉపయోగించమన్నారు. దీంతోపాటు మరో గుర్రం ఉండేదని, దాని పేరు కాజల్‌ అన్నారు. అది తన ఫ్రెండ్‌ ఇచ్చాడని, అతను చనిపోయే ముందు తనకు గిఫ్ట్ గా ఇచ్చాడని, అది తనకు చాలా స్పెషల్‌ అని చెప్పాడు. 
 

67

అయితే `మగధీర` సినిమా టైమ్‌లో ఆ గుర్రాన్ని ఉపయోగించామని, అయితే సినిమాలో హీరోయిన్‌ కూడా కాజలే కావడం, తన గుర్రం పేరు కూడా కాజల్‌ కావడం చాలా ఇబ్బంది అయ్యిందని, దాన్ని పిలిచే విషయంలో మరింతగా ఇబ్బంది పడ్డామని తెలిపాడు రామ్‌చరణ్‌. ఇది నవ్వులు పూయించింది. 

77

ప్రస్తుతం రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కలిసి `ఆర్ఆర్‌ఆర్‌`లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అలియాభట్‌, ఒలివీయా మోర్రీస్‌ హీరోయిన్లుగా, అజయ్‌ దేవగన్‌, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఈ దసరాకి విడుదల కావాల్సి ఉంది. కానీ వచ్చే ఏడాది సమ్మర్‌కి విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna మాత్రమే టాప్ లో ఎలా? ఇండియన్ సినిమాను ఏలడానికి కారణాలివే
Recommended image2
VV Vinayak: ఆది బడ్జెట్ 2 కోట్లే.. కానీ మార్నింగ్ షో పడగానే కోట్ల ఆఫర్..!
Recommended image3
మరణించి కూడా 9 మంది హీరోయిన్ల కెరీర్‌ను నిలబెట్టిన నటి.. దివ్య భారతి వల్ల స్టార్ అయ్యింది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved