రీ ఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి హీరోయిన్, ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన బ్యూటీ ఎవరో తెలుసా?
చిరంజీవితో సినిమాలు చేసి స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. రీ ఎంట్రీలో ఎలాంటి పాత్రలు చేయబోతోందో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి సరసన నటించిన హీరోయిన్లు, స్టార్ డమ్ తో ఒక వెలుగు వెలిగిపోయారు. టాలీవుడ్ ను ఏలారు, ఫెయిడ్ అవుట్ అయిన తరువాత కూడా కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. కొందరు మాత్రం ఇండస్ట్రీని వదిలేసి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఇండియా వదిలిపెట్టి ఫారెన్ లో సెటిల్ అయ్యారు.

rambha
ఈక్రమంలో ఫారెన్ లో సెటిల్ అయిన ఓ హీరోయిన్ తిరిగి ఇండియాకు వచ్చి మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేయబోతుందట. మెగాస్టార్ చిరంజీవితో హిట్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. 90స్ లో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టించింది. గ్లామర్ తో పాటు నటనతో ఎంతో ఆకట్టుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా. ఆమె ఎవరో కాదు రంభ. అవును రంభ రీ ఎంట్రీకి రెడీ అవుతుందట.
మెగాస్టార్ తో హిట్లర్ సినిమాలో నటించి మెప్పించిన ఈ సీనియర్ బ్యూటీ.. ఆతరువాత బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి జోడీగా నటించి మెగా హిట్ అందుకుంది. చిరంజీవితో వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. ఆతరువాత వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్స్ తో హిట్టు మీద హిట్లు కొట్టింది. ఆతరువాత ఫెయిడ్ అవుట్ అయిన రంభ.. కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంది. దేశముదురు సినిమాలో అల్లు అర్జున్ తో, యమదోండ సినిమాలో ఎన్టీఆర్ తో ఐటమ్ సాంగ్స్ చేసింది రంభ.
ఆతరువాత పెళ్ళి పిల్లలు అంటూ ఫారెన్ లో కాపురం పెట్టింది. చాలా కాలంగా ఫారెన్ లోనే ఉంటున్న ఈ బ్యూటీ, అప్పుడప్పుడు చెన్నై వచ్చి వెళ్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం రంభ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగులో ముగ్గురు స్టార్ హీరోల మూవీస్లో ఆమె ఇప్పటికే బుక్ అయినట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాల్లో కూడా ఇంపార్టెంట్ పాత్రల కోసం ఆమెను తీసుకోవాలని చూస్తున్నాట మేకర్స్. రంభను కూడా అప్రోచ్ అవుతున్నారని తెలుస్తోంది. ఇక రంభ కూడా పిల్లలు పెద్దవాళ్లు కావడంతో రీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

