- Home
- Entertainment
- Janaki Kalaganaledu: రామచంద్ర మాటలకు కుమిలిపోతున్న జానకి.. అఖిల్ ని విడిపించనున్న జానకి?
Janaki Kalaganaledu: రామచంద్ర మాటలకు కుమిలిపోతున్న జానకి.. అఖిల్ ని విడిపించనున్న జానకి?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 16 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈ రోజు ఎపిసోడ్ లో మల్లిక మాటలకు రామచంద్ర ఆలోచనలో పడతాడు. లేదు అఖిల్ కి శిక్ష పడడానికి వీల్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటాడు రామచంద్ర. ఇంతలోనే రామచంద్ర లాయర్ కి ఫోన్ చేస్తాడు. అప్పుడు రామచంద్ర మా తమ్ముడికి ఉరిశిక్ష కాని కార్యదర్శి పడే అవకాశం ఉంటుంది అంటున్నారు అలా జరగదు కదా అనడంతో పడే అవకాశం ఉంది రామచంద్ర గారు అనడంతో రామచంద్ర షాక్ అవుతాడు. ఆ అమ్మాయి కనక చనిపోతే మీ ఆవిడ కోర్టులో సాక్ష్యం చెబితే కచ్చితంగా మీ తమ్ముడు శిక్ష పడుతుంది మీ తమ్ముడు జీవితం మీ భార్య చేతిలో ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు లాయర్.
మరోవైపు జానకి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి గోవిందరాజులు వస్తాడు. అప్పుడు గోవిందరాజులు అఖిల్ గురించి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటాడు. మీ అత్తయ్య గారు కేవలం మీ నుంచి ప్రేమను మాత్రమే ఆశిస్తుంది జానకి అని అంటాడు. కొడుకుని కాపాడమని ముందుకు వచ్చి అడగలేక బాధపడుతోంది జానకి అని అంటాడు గోవిందరాజు. అఖిల్ కి తండ్రిగా ఓడిపోయినా కూడా జ్ఞానాంబ కు భర్తగా నేను గెలవాలి అనుకుంటున్నాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గోవిందరాజులు. అప్పుడు గోవిందరాజులు మాటలు విన్న మల్లిక ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
ఆ తర్వాత రామచంద్ర ఆలోచించుకుంటూ ఒకచోట కూర్చుని బాధపడుతూ ఉంటాడు. కోపంతో రగిలి పోతూ జానకి దగ్గరికి వెళతాడు. అప్పుడు జానకి ఆలోచిస్తూ ఉండగా రామచంద్ర అక్కడికి వెళ్లి నేను చెప్పిన దానికి మీరు నా దగ్గరికి నేరుగా వచ్చి ఏదో ఒక నిర్ణయం చెబుతారు అనుకున్నాను కానీ మీరు అలా చేయలేదు. ఇప్పటికే అఖిల్ మీద కేసు రాయడం వల్ల రేపు మధ్యాహ్నం వాడు నీ కోర్టుకి తీసుకుని వెళ్తున్నారు. మనం ఆలోపు పోలీస్ స్టేషన్ కు వెళ్లి వాడిని విడిపించుకొని వద్దాం సిద్ధంగా ఉండండి అని రామచంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా సారీ రామచంద్ర గారు నా నిర్ణయంలో ఎటువంటి మార్పులు ఉండవు అని అంటుంది జానకి.
అప్పుడు రామచంద్ర నేను నిన్ను అర్థం చేసుకోవడం కాదు జానకి గారు నన్ను అమ్మను జెస్సి బాధను అర్థం చేసుకోండి అని అంటాడు. అప్పుడు మీ నాన్నగారి ఐఏఎస్ కల కోసం నేను మా అమ్మగారికి ఎన్నోసార్లు అబద్ధం చెప్పాను ఆ విషయంలో నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేదా అని నిలదీస్తాడు రామచంద్ర. నేను మిమ్మల్ని నమ్మి మీకు అండగా నిలబడితే నా తమ్ముడిని ఎక్కడ కోల్పోతానేమో అని భయంగా ఉంది జానకి గారు అని ఉంటాడు రామచంద్ర. అప్పుడు జెస్సికి నేను అన్యాయం చేయలేను జానకి గారు జెస్సికి పుట్టబోయే బిడ్డ నాన్న ఇక్కడ అని అడిగితే జెస్సి ఏం సమాధానం చెబుతుంది చెప్పండి జానకి గారు అని జానకిని నిలదీస్తాడు రామచంద్ర.
మా అమ్మ ఎంత మంచిదో తెలుసా జ్ఞానకి గారు మీరు ఇన్ని చేస్తున్నా కూడా కనీసం మిమ్మల్ని ఒక్క మాట అనకుండా మౌనంగా ఉంది ఇప్పటికీ నీ వైపు నుంచి ఆలోచిస్తుంది అంటాడు రామచంద్ర. ఇప్పుడు జానకి ఎమోషనల్ అవుతూ ఒక అమ్మాయిని మర్డర్ చేసింది నా మరిది కాకపోతే ఎంత బాగుండు అని నేను ఎన్ని బాధలు పడ్డాను లోపల ఎంత కుమిలిపోతున్నానో నాకు మాత్రమే తెలుసు రామ గారు ఈ విషయాన్ని మీరు ఎలా చెప్పాలి అని అంటుంది. అప్పుడు రామచంద్ర నేను మా తమ్ముని కాపాడుకోలేకపోతే వాడు జైలుకు వెళ్తే నేను మీతో సంతోషంగా ఉంటాను అని మీరు అనుకుంటున్నారా అనడంతో జానకి షాక్ అవుతుంది.
మీరు ఏం చేస్తారో నాకు తెలియదు రేపు ఉదయం 10 గంటలకు మీరు నా తమ్ముడిని విడుదల చేసుకొని తీసుకు వస్తాను అని నాకు చెప్పాలి అంటాడు రామ. అప్పుడు జానకి మాత్రం మీరు చెప్పినట్టు నేను చేయను అని అంటుంది. ఆ తర్వాత జానకి రామచంద్ర మాటలకు ఆలోచనల పడుతూ కుమిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు జానకి నావల్ల ఎవరు బాధపడకూడదు అఖిల్ ని నేనే వెళ్లి బయటకు తీసుకొని వస్తాను అని నిర్ణయం తీసుకుంటుంది.