- Home
- Entertainment
- రాజమౌళి కథ ఎలా మొదలుపెడతారు ? ఐడియా రాగానే ఫస్ట్ చెప్పేది ఎవరికి ?.. సీక్రెట్ బయటపెట్టిన రమా రాజమౌళి
రాజమౌళి కథ ఎలా మొదలుపెడతారు ? ఐడియా రాగానే ఫస్ట్ చెప్పేది ఎవరికి ?.. సీక్రెట్ బయటపెట్టిన రమా రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమా పూర్తి చేసిన వెంటనే తదుపరి సినిమా కథని ఎలా ప్రారంభిస్తారు ? స్టోరీ ఐడియాను ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకుంటారు ? అనే వివరాలు ఈ కథనంలో చూద్దాం.

రాజమౌళి వారణాసి మూవీ బడ్జెట్
దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో తెలుగు సినిమాని ప్రపంచానికి పరిచయం చేశారు. ఇప్పుడు వారణాసి మూవీతో వరల్డ్ వైడ్ గా సినీ ప్రేక్షకులని అక్కట్టుకోవడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి చిత్రాన్ని రాజమౌళి ఏకంగా 1000 కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఆ బడ్జెట్ 1500 కోట్లు వరకు ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఫ్యామిలీ మొత్తం టీమ్ వర్క్
రాజమౌళి సినిమాలకు ఆయన కుటుంబం మొత్తం ఒక టీంలాగా కష్టపడతారు. కీరవాణి సంగీతం అందిస్తారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రెడీ చేస్తారు. భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరిస్తారు. రాజమౌళి గురించి రమా రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు రాజమౌళి తాన్ సినిమాల కథని ఎలా ప్రారంభిస్తారు ? స్టోరీ ఐడియా రాగానే షేర్ చేసుకునేది ఎవరితో అనే ఉత్కంఠ ఉంటుంది. కొన్ని సినిమాలకు డైరెక్ట్ గా విజయేంద్ర ప్రసాద్ నుంచే స్టోరీ ఐడియా మొదలవుతుంది. కొన్ని సినిమాలకు రాజమౌళి తన ఆలోచనలు బయట పెడతారు.
రాజమౌళి స్టోరీ ఐడియా ఫస్ట్ చెప్పేది ఎవరికంటే
ఒక సినిమా పూర్తయిన వెంటనే ఫ్యామిలీతో కలిసి రాజమౌళి వెకేషన్ కి వెళతారట. అక్కడికి రిలాక్స్ కావడానికి వెళ్లినప్పటికీ రాజమౌళి మాత్రం నెక్స్ట్ మూవీ ఎలాంటి కథతో చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటారట. అక్కడ వెకేషన్ లోనే కథని ప్రారంభిస్తారట. ఐడియా రాగానే ముందుగా తనకే చెబుతారు అని రమా రాజమౌళి రివీల్ చేశారు.
రాజమౌళి మతిమరుపు
అలా నిత్యం రాజమౌళి ఆలోచిస్తూనే ఉంటారట. శారీరకంగా విశ్రాంతి తీసుకున్నప్పటికీ ఆయన బ్రెయిన్ మాత్రం కొత్త స్టోరీ ఐడియా కోసం పనిచేస్తూనే ఉంటుంది అని అన్నారు. ఈ క్రమంలో ఇతర విషయాలు అన్నీ మరచిపోతారట. కొన్నిసార్లు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మరచిపోయి ఫోన్ అనుకుని వాళ్ళ టీవీ రిమోర్ట్స్ జేబులో పెట్టుకుని వచ్చేస్తారట.
రాజమౌళి కోసమే చేస్తున్నా
ఇంట్లో ఏదైనా వస్తువు కనిపించకపోతే నంది(రాజమౌళి) జేబులో ఉంటుంది చూడండి అని చెబుతారట. రమా రాజమౌళి తన గురించి తాను చెబుతూ.. కాస్ట్యూమ్ డిజైన్ విషయంలో నేను ఎలాంటి స్పెషలైజేషన్ చేయలేదు. ఆ పని తనకు ఇష్టం కాబట్టే నేర్చుకున్నాను అని అన్నారు. తనకి కెరీర్ ప్లానింగ్ అంటూ ఏమీ లేదని.. రాజమౌళి కోసమే కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నట్లు రమా రాజమౌళి తెలిపారు.

