MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • రాజమౌళికి ఆయన భార్య పెట్టిన కండీషన్‌, `ఆస్కార్‌` మూవీ డైరెక్టర్‌ అయినా రాత్రి ఆ పనిచేయాల్సిందే

రాజమౌళికి ఆయన భార్య పెట్టిన కండీషన్‌, `ఆస్కార్‌` మూవీ డైరెక్టర్‌ అయినా రాత్రి ఆ పనిచేయాల్సిందే

దర్శకుడు రాజమౌళి తన సినిమాలతో ప్రపంచానికి మనమేంటో చూపిస్తున్నాడు. ఇండియన్‌ బిగ్గెస్ట్ డైరెక్టర్‌గా రాణిస్తున్న ఆయన ఇంట్లో మాత్రం ఆయన భార్య పెట్టిన రూల్స్ ని ఫాలో అవ్వాల్సిందే అట.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Oct 13 2024, 10:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్‌ సినిమా స్థాయిని పెంచారు. `బాహుబలి`తో అన్ని బారియర్స్ బ్రేక్‌ చేశారు. లాంగ్వేజ్‌ బారియర్స్, మార్కెట్‌ బారియర్స్,  కలెక్షన్ల బారియర్స్, బడ్జెట్‌ బారియర్స్ ఇలా అన్నింటిని బ్రేక్‌ చేశాడు. మన ఇండియన్‌ సినిమా సత్తా ఏంటో చూపించారు. అందులోనూ తెలుగు సినిమాని ప్రపంచానికి ముఖచిత్రంగా మార్చేశారు.

బాలీవుడ్‌  అప్పటి వరకు ఇండియన్‌ మూవీస్‌కి ఫేస్‌ఆఫ్‌గా ఉండేది. కానీ తెలుగు బిగ్గిస్ట్ ఇండిస్ట్రీగా మారడంలో ఆయన పాత్ర కీలకమని చెప్పొచ్చు. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఇండియాకి ఆస్కార్‌ కలని నెరవేర్చాడు. ప్రస్తుతం ఆయన మన తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

`ఆర్‌ఆర్‌ఆర్‌`తో ఆస్కార్‌ని సాధ్యం చేసిన రాజమౌళి ఎంతటి పెద్ద దర్శకుడు అయినా ఇంట్లో మాత్రం సాధారణ భర్త అనే చెప్పాలి. సమాజంలో భార్యల వద్ద భర్తలు ఎలా ఉంటారో అలానే ఉంటారు. అంతేకాదు ఇంకా చాలా మంది చేయని పనులు చేస్తుంటారు. అందులో భాగంగా జక్కన్న.. తన భార్య రమా రాజమౌళి చెప్పిన మాట వినాల్సిందే.

ఆమె విషయంలో మాత్రం సినిమా ఇమేజ్‌, క్రేజ్‌ పనిచేయదు. అంతేకాదు ఇంట్లో పనులు కూడా చేయాల్సిందే నట. ఫ్రీ టైమ్‌లో ఇల్లు తూడ్చడం, అంట్లు కడగడం లాంటి పనులు కూడా చేస్తుంటారని, ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 
 

35

అంతేకాదు ప్రతి రోజూ రాత్రి పడుకునే సమయంలో మరో పని మాత్రం కచ్చితంగా చేయాల్సిందేనట. ఈ విషయంలో ఒక అగ్రిమెంట్‌ మీద రాజమౌళి, రమా రాజమౌళి ఉంటారట. సినిమాలు తీసే సమయంలో, అంటే షూటింగ్‌ ఉన్న సమయంలో భార్య రమా.. రాజమౌళి కాళ్లు నొక్కాలి. షూటింగ్‌ లేని సమయంలో రాజమౌళి భార్య రమా కాళ్లు నొక్కాలి. ఇలా ఒక ఒప్పందం ప్రకారం ఈ ఇద్దరు ఉంటారని రాజమౌళి తెలిపడం విశేషం.

కొన్నేళ్ల క్రితం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపారు. అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఏంటంటే.. తాను(రమా) కాళ్లు ఎప్పుడో ఒకసారి నొక్కుతుందని, ఆ రూల్‌ని బ్రేక్‌ చేస్తుందని, కానీ తనకే రోజూ ఆ డ్యూటీ పడుతుందని, పడుకునే ముందు నాకు మాత్రం ఆ పని తప్పడం లేదని వెల్లడించారు జక్కన్న.
 

45

ఎంతటి గొప్ప దర్శకుడైనా భార్య వద్ద మాత్రం అణిగి మణిగి ఉండాల్సిందే, ఆమె ప్రేమకు బానిసనే అనే విషయాన్ని చాటి చెప్పారు రాజమౌళి. అయితే ఇదంతా వాళ్ల మధ్య ప్రేమకి నిదర్శనంగా నిలుస్తుందని, తాను గొప్ప దర్శకుడనే గర్వం మాత్రం ఇంట్లోకి రానివ్వకుండా, తన భార్య కోసం అంతటి పని చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. అ

ది జక్కన్న డౌట్‌ టూ ఎర్త్ మెంటాల్టీని, హుందాతనాన్ని చాటి చెబుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే రమా రాజమౌళి కూడా సినిమాలకు పనిచేస్తుంది. రాజమౌళి చేసే చిత్రాలకు ఆమెనే కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తుంది. కీరవాణి భార్య వల్లి, రమా కాస్ట్యూమ్స్ చూసుకుటారు. 
 

55

రాజమౌళి ప్రస్తుతం మహేష్‌ బాబుతో సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతుంది. సినిమా కోసం మహేష్‌ సరికొత్తగా మేకోవర్‌ అవుతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ లక్ష్యంగా  ప్లాన్‌ చేస్తున్నారు రాజమౌళి. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆడియెన్స్ కి సినిమా రీచ్‌ అయ్యేలా వాళ్లు చూసేలా చేయబోతున్నారు.

దేశంలో సినిమాని చూసే శాతం ఒక్కటి నుంచి  2 శాతం వరకే పరిమితం. దాన్ని పెంచాలనేది, థియేటర్‌కి ఆడియెన్స్ ని రప్పించాలనే దాన్ని లక్ష్యంగా చేసుకుని వర్క్ చేస్తున్నారు. ఇక ఆఫ్రీకన్‌ అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తుంది. ఇందులో ప్రపంచ సాహసికుడిగా మహేష్‌ కనిపిస్తారట. ఆ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందని సమాచారం. 

Read more: చిరంజీవికి నిద్ర లేని రాత్రులు గడిపేలా చేసిన స్టార్‌ హీరో ఎవరో తెలుసా? ఆయన ముందే అసలు విషయం కక్కేసి ఆవేదన

Also Read: సౌందర్య అసలు డ్రీమ్‌ ఏంటో తెలుసా? సినిమాల కోసం త్యాగం.. బలవంతంగా ఆ పని చేయాల్సి వచ్చిందా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Recommended image2
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image3
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved