- Home
- Entertainment
- Janaki Kalaganaledu: అఖిల్ విషయంలో పట్టువీడని జానకి.. భార్యపై కోపంతో రగిలిపోతున్న రామ!
Janaki Kalaganaledu: అఖిల్ విషయంలో పట్టువీడని జానకి.. భార్యపై కోపంతో రగిలిపోతున్న రామ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు నవంబర్ 11 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలో.. రామ తన తమ్ముడు అఖిల్ మాట్లాడిన మాటలు తలుచుకొని బాధపడుతూ కనిపిస్తాడు. అదే సమయంలో అక్కడికి జ్ఞానంబ వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. వెంటనే రామ తన తల్లిని చూసి పట్టుకొని ఒక దగ్గర కూర్చోబెడతాడు. ఇక విష్ణు, గోవిందరాజులు వచ్చి ఏం జరిగింది అని భయపడుతూ ఉంటారు. వెంటనే గోవిందరాజులు భోజనం మానేస్తే నీ బాధ తీరుతుందా అని బాధపడుతూ అడుగుతాడు.
దాంతో జ్ఞానంబ.. కోల్కొని నేనేం ఉద్ధరించాలి.. నా కొడుకు జైల్లో ఉన్నట్లు నలుగురు నాలుగు విధాలుగా అంటుంటే ఏం చేయాలో చెప్పు అని బాధపడుతుంది. దాంతో రామ తప్పు నీది కాదు అంటూ.. చేత కన్నీరు పెట్టిస్తున్నాం చూడు అది మాది తప్పు అంటూ.. మొండిగా ప్రవర్తిస్తున్న నా భార్యది తప్పు అంటూ.. ఇప్పుడే నీ బాధను తగ్గించే ప్రయత్నం చేస్తాను అని వెంటనే జానకి దగ్గరికి వెళ్తాడు.
ఇక ఒంటరిగా ఉన్న జానకి.. ఆలోచిస్తూ ఉండగా అక్కడికి రామ వచ్చి కుటుంబం గౌరవం గురించి ఆలోచించే మీరు ఈరోజు నా చేత చెప్పుకోవాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది అని అంటాడు. అంతేకాకుండా అఖిల్ చేసిన విషయంలో 80% నిజం ఉండొచ్చు కానీ మిగతా 20 శాతం లో నిజమయ్యే అవకాశం లేదు కదా.. ఇక నువ్వు ధర్మం గురించి మాట్లాడుకుంటూ పోతే అక్కడ అమ్మ ఆరోగ్యం అఖిల్ భవిష్యత్తు తినేలా ఉంది అంటూ జానకిని తీసుకొని వెళ్తాడు.
జానకి మాత్రం మీరు మీ తమ్ముడు గురించి ఆలోచిస్తున్నాను కానీ అక్కడ అమ్మాయికి జరిగిన అన్యాయం కోసం నేను ఆలోచిస్తున్నాను అంటుంది. అంతేకాకుండా అఖిల్ గురించి అంత ఆలోచించే దానివి.. సంపాదన కోసం ఎందుకు అంత ఒత్తిడి చేశావు అని అంటాడు. ఇప్పుడు అవన్నీ కాదు అంటూ ముందు కేసు వాపస్ తీసుకురండి అని ఆమెను తీసుకెళ్తాడు. ఇక దాంతో జానకి కేసు వాపస్ తీసుకుంటే అఖిల్ మరింత మొండిగా అవుతాడు అని అనుకోని ఈ కేసు నేను వెనక్కి తీసుకొని అని రామతో అంటుంది.
దాంతో రామ షాక్ అవుతాడు. ఇక అందరూ బయటికి వస్తారు. వెంటనే రామ మీరు తీసుకునే నిర్ణయాలు ఇంట్లో గొడవలకు దారితీస్తుంది అని అంటాడు. అప్పుడే మల్లికా కలుగజేసుకొని మరింత నిప్పు పోస్తుంది. దాంతో జ్ఞానంబ కూడా జానకి పై మరింత విరుచుకుపడుతుంది. ఇక రామ కూడా చదువు విషయంలో అమ్మకు చెప్పకుండా ఎన్నోసార్లు నీకు సాయం చేశాను అని అంటాడు.
అంతేకాకుండా మరింత కోపంగా మాట్లాడుతాడు రామ. మీరు కేసు వెనక్కి తీసుకోకపోయిన పర్వాలేదు నా తమ్ముడిని ఎలా రావాలో నాకు తెలుసు అని విష్ణు ని తీసుకొని వెళ్తాడు. జెస్సి తో పాటు గోవిందరాజు దంపతులు కూడా బయలుదేరుతారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లిన తర్వాత.. అక్కడున్న పోలీస్.. ఏం చేయాలన్న కోర్టుకు వెళ్లాల్సిందే అని అంటాడు.
ఇక రామ వాళ్లు మరింత బాధపడుతూ ఉండటంతో ఆ ఎస్ ఐ మీ బాధను నేను అర్థం చేసుకోగలను అని కానీ ఏం చేయలేని పరిస్థితి అంటాడు. ఆ తర్వాత అఖిల్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతారు గోవిందరాజు దంపతులు. ఇక అఖిల్ మాత్రం నేను తప్పు చేయలేదు అన్నట్లుగా మాట్లాడుతాడు. దాంతో జ్ఞానంబ చాలా బాధపడుతూ కనిపిస్తుంది.