- Home
- Entertainment
- Skanda Review: స్కంద ప్రీమియర్ షో టాక్.. యాక్షన్ తో రామ్, బీజియంతో తమన్ వీర కుమ్ముడు.. బోయ రోటీన్ కానీ..
Skanda Review: స్కంద ప్రీమియర్ షో టాక్.. యాక్షన్ తో రామ్, బీజియంతో తమన్ వీర కుమ్ముడు.. బోయ రోటీన్ కానీ..
ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. డ్యాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, యాక్షన్ సన్నివేశం అయినా హీరో రామ్ ఎనెర్జీ వేరే లెవల్ లో ఉంటుంది.

ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద. డ్యాన్స్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా, యాక్షన్ సన్నివేశం అయినా హీరో రామ్ ఎనెర్జీ వేరే లెవల్ లో ఉంటుంది. అలాంటి హీరో పవర్ హౌస్ లాంటి మాస్ డైరెక్టర్ బోయపాటితో చేతులు కలిపితే సిల్వర్ స్క్రీన్ పై జాతర ఒక రేంజ్ లో ఉంటుందని ఆశించవచ్చు. ఆ తరహాగా హై ఓల్టేజ్ అంచనాలతోనే స్కంద చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఆల్రెడీ ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. స్కంద చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో ఇప్పుడు చూద్దాం. బోయపాటి మార్క్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ముందుగా శ్రీకాంత్ కి సంబంధించిన కోర్టు సన్నివేశాలతో కథ స్టార్ట్ అవుతుంది. ముంబై బ్యూటీ సయీ మంజ్రేకర్ శ్రీకాంత్ కుమార్తెగా పరిచయం అవుతుంది.
దర్శకుడు బోయపాటి కథని చాలా ఆసక్తికరంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులకు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాల తర్వాత హీరో రామ్ ఎంట్రీ ఊర మాస్ అనిపించే విధంగా విజిల్స్ కొట్టిస్తుంది. ట్రైలర్ లో చూపిన దున్నపోతుతో రామ్ క్రేజీ ఎంట్రీ ఇచ్చారు. రామ్ లుక్ ని డైరెక్టర్ బోయపాటి శ్రీను నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ప్రెజెంట్ చేశారు.
ఫస్ట్ హాఫ్ మొత్తం రామ్ లుక్, యాటిట్యూడ్, బోయపాటి స్టైల్ లో సాగే యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా నిలుస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్, ట్విస్ట్ ని బోయపాటి చాలా లెన్తీ గా డిజైన్ చేశారు. కానీ మాస్ ఆడియన్స్ కి మాత్రం ఇంటర్వెల్ బ్లాక్ ఫీస్ట్ అనే చెప్పాలి. అయితే హీరో ఇంట్రడక్షన్.. ఇంటర్వెల్ సన్నివేశం మధ్యలో కథ కాస్త ట్రాక్ తప్పడం మైనస్ గా చెబుతున్నారు.
ఒక వైపు రామ్ మాస్ యాక్షన్ యాటిట్యూడ్ తో గూస్ బంప్స్ తెప్పిస్తుంటే మరో వైపు తమన్ బిజియంతో వీర కుమ్ముడు కుమ్మాడు అంటూ ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తోంది. సెకండ్ హాఫ్ లో కాస్త ఎమోషనల్ టచ్ కనిపిస్తుంది అని అంటున్నారు. అయినా కూడా మాస్ ఎలిమెంట్స్ ఎక్కడా తగ్గలేదు. కాకపోతే లాజిక్ లేని సన్నివేశాలు రొటీన్ వార్నింగ్ సన్నివేశాలు కొత్తదనం కోరుకునే వారికి చిరాకు తెప్పిస్తాయి.
లాజిక్ వెతక్కుండా చూస్తే స్కంద చిత్రం ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కోసమే తెరకెక్కించిన చిత్రం అని చెప్పొచ్చు. బోయపాటి టిపికల్ స్టైల్ తో సాగే చిత్రం ఇది. రామ్ మాత్రం రెండు గెటప్స్ లో అదరహో అనిపించాడు.
శ్రీలీల, సయీ మంజ్రేకర్ ఇద్దరూ అవకాశం ఉన్న మేరకు బాగానే నటించారు. కొన్ని చోట్ల తమన్ బిజియం ఆశించిన స్థాయిలో లేకపోయినప్పటికీ ఇంటర్వెల్ బ్లాక్ లాంటి కీలకమైన చోట్ల మోత మోగించాడు. ఓవరాల్ గా రామ్ సరికొత్త మాస్ లుక్, బోయపాటి మార్క్ యాక్షన్ ని ఒక సారి ఎంజాయ్ చేసే విధంగా ఉందని ఆడియన్స్ అంటున్నారు.