- Home
- Entertainment
- జూ.ఎన్టీఆర్ తలుచుకుంటే ఓవర్ నైట్ లో టీడీపీ ఫినిష్.. ఆ భయమే అలా చేయిస్తోంది, వర్మ సంచలన వ్యాఖ్యలు
జూ.ఎన్టీఆర్ తలుచుకుంటే ఓవర్ నైట్ లో టీడీపీ ఫినిష్.. ఆ భయమే అలా చేయిస్తోంది, వర్మ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో పొలిటికల్ హీట్ సినిమాలని కూడా తాకుతోంది. ఎన్నికల నేపథ్యంలో మరింత రచ్చ జరిగేలా యాత్ర 2, రాజధాని ఫైల్స్ లాంటి చిత్రాలు ఆల్రెడీ విడుదలయ్యాయి. ఈ చిత్రాల గురించి జనాల్లో బాగానే చర్చ జరుగుతోంది.

ఏపీలో పొలిటికల్ హీట్ సినిమాలని కూడా తాకుతోంది. ఎన్నికల నేపథ్యంలో మరింత రచ్చ జరిగేలా యాత్ర 2, రాజధాని ఫైల్స్ లాంటి చిత్రాలు ఆల్రెడీ విడుదలయ్యాయి. ఈ చిత్రాల గురించి జనాల్లో బాగానే చర్చ జరుగుతోంది. మరో రెండు రోజుల్లో రాంగోపాల్ వర్మ తన వ్యూహం చిత్రంతో ఎన్నికల హంగామా పెంచేందుకు రెడీ అవుతున్నారు.
వర్మ సాధారణంగానే సినిమా తీస్తే అది పెద్ద వివాదం అవుతుంది. అలాంటిది కొందరు రాజకీయ నాయకులని టార్గెట్ చేసి సినిమా చేస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం అధికార పార్టీకి అనుకూలంగా ప్రతి పక్ష పార్టీలని టార్గెట్ సహజ విధంగా ఉండబోతోందనే విమర్శలు ఆల్రెడీ మొదలయ్యాయి .
వర్మ చేసే పొలిటికల్ కామెంట్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఎలాంటి సంచలన కామెంట్స్ కి అయినా వర్మ వెనుకాడరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వర్మ తెలుగు దేశం పార్టీని, జూ.ఎన్టీఆర్ ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారేలా ఉన్నాయి. వర్మ తరచుగా చంద్రబాబుని, లోకేష్, పవన్ కళ్యాణ్ లని టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం.
తాజాగా వ్యూహం మూవీ ప్రమోషన్ లో భాగంగా వర్మ మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకువచ్చారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ ని టిడిపి దూరం చేసిందా లేక అతడే దూరంగా ఉంటున్నాడా అనేది నాకు తెలియదు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంత క్రేజ్ ఉన్నది జూనియర్ ఎన్టీఆర్ కే. ఆ భయం టిడిపిలో ఉంటుంది.
జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారి నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అని ప్రకటన చేస్తే.. టిడిపి ఓవర్ నైట్ లో ఫినిష్ అయిపోతుంది అని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ కి ఇక ఏమీ మిగలదు అని వర్మ అన్నారు. బహుశా ఆ భయంతోనే జూ.ఎన్టీఆర్ పై ద్వేషం పెంచుకుని ఉండొచ్చు అని వర్మ అన్నారు.
యాత్ర 2 చేసినందుకు దర్శకుడు మహి వి రాఘవ్ కి రెండు ఎకరాల భూమి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. మీరు కూడా ఆ విధంగా డబ్బు కోసమో ఇంకేదో ఆశించి వ్యూహం చిత్రం చేసారా అని యాంకర్ ప్రశ్నించారు. దీనికి వర్మ సమాధానం ఇస్తూ నా కోసం నేను సినిమాలు చేస్తున్నాను తప్ప ఎవరినుంచో ఏదో వస్తుంది అని తాను ఎప్పుడూ సినిమాలు చేయనని వర్మ అన్నారు.