ఏ తెలుగు హీరోని ఉద్దేశించి రామ్ గోపాల్ వర్మ ఆ షాకింగ్ కామెంట్, పెద్ద చర్చే మొదలైందిగా
. చాలా మంది పెద్ద స్టార్ అనగానే సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ వంకే వేళ్లు చూపిస్తున్నారు. అయితే ఎవరా హీరో అనేది మాత్రం తేలటం లేదు. మొత్తానికి వర్మ గొప్ప స్టఫ్ ఇచ్చాడు.
ఆ మధ్యన కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడి అందరి చేత తిట్టించుకున్నాడు వర్మ. అలాగే వైయస్ జగన ్పార్టీకి సపోర్ట్ గా వ్యూహం, శపథం సినిమాల తీసారు. ఆ పార్టీ పరాజయంతో సైలెంట్ అయిపోయారు . ఆ మధ్యన ప్రేక్షకులే అన్ని నిర్ణయించి సినిమా తీస్తే ఎలా ఉంటుందని యువర్ ఫిల్మ్ అనే కాన్సెప్టుతో వార్తల్లో నిలిచాడు. అంటే ఆడియెన్సే సినిమాకు సంబందించిన హీరో, హీరోయిన్, డైరక్టర్, సినిమాటోగ్రాఫర్ ఇలా అన్ని టెక్నీషియన్లు ఎంచుకోవాలని, ఓటింగ్ లో అగ్రస్థానంలో ఉన్నవారితో తానే నిర్మాతగా సినిమా తీస్తానని ఆర్జీవీ ప్రకటించాడు. మరి ఈ కాన్సెప్ట్ ఎంత వరకు వచ్చిందో తెలియదు కానీ తాజాగా ఒక ఆసక్తికరమైన కామెంట్ తో మన ముందుకు వచ్చాడు ఆర్జీవీ.
ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ...తెలుగు సెలబ్రెటీ గురించి , అతను చేసే ట్రిక్స్ గురించి చెప్పుకొచ్చారు. తన సినిమాలు ఎక్కువ కాలం థియేటర్ లో ఆడాలని కోరుకునే ఆ హీరో సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి జనం రాకపోయినా షోలు వేస్తూంటాడని చెప్పుకొచ్చారు. అయితే ఆ హీరో ఎవరనేది చెప్పలేదు. దాంతో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేసిన ఆ తెలుగు హీరో ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది.
గలాటా ప్లస్ కు ఇచ్చిన ఇంటర్వలోని ఓ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఇంటర్వూలో భాగంగా వర్మ మాట్లాడుతూ.... ఒక పర్టిక్యులర్ హీరో తో ముంబైకు చెందిన ఓ కార్పోరేట్ కంపెనీవాళ్లు సినిమా తీసారు. అతను తెలుగులో పెద్ద స్టార్. అయితే సినిమా ప్లాఫైంది. దాంతో ఆ కార్పోరేట్ కంపెనీ సినిమాని థియేటర్ లోంచి తీసాయలనుకుంది. అయితే ఆ స్టార్ ఫ్యాన్స్ ఊరుకోరు కదా..తమ హీరో సినిమా ముందే థియేటర్స్ నుంచితీసేస్తే అవమానం గా ఫీలయ్యారు. మరికొంతకాలం ఆడించాల్సిందే అని పట్టుపట్టారు.
కానీ ప్లాఫ్ అయ్యి డిఫిషిట్ లో ఉన్న సినిమాని కార్పోరేట్ కంపెనీలకు ఏం పని ఆడించటానకి ...అప్పుడు హీరో సీన్ లోకి వచ్చి తానే సినిమాను తీయకుండా ఉంటే ఆ డెఫిషిట్ ఎమౌంట్, థియేటర్ రెంట్ లు పే చేస్తానని అన్నారు. ఓకే ఆడించుకుంటానంటే మీ ఇష్టం అన్నట్లు కార్పోరేట్ కంపెనీ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమా అలా హీరో డబ్బులతో జనం లేకపోయినా అయ్యింది. అయితే ఆ సినిమా ఆడుతోందని పేపర్లో కూడా యాడ్ ఇవ్వలేదు. అది హీరో చూసుకోలేదు. కార్పోరేట్ కంపెనీకు ఆ యాడ్ ఇవ్వాల్సిన అవసరం తమకు లేదనుకున్నారు. ఎంత చిన్న ఎమౌంట్ అయినా వాళ్లు ఖర్చు పెట్టరు అని వర్మ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఇంతకీ ముంబై కార్పోరేట్ కంపినీ వచ్చి తెలుగులో ఆడించిన సినిమా ఎవరిది..ఏ హీరో ది అనే చర్చ మొదలైంది. చాలా మంది పెద్ద స్టార్ అనగానే సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్ వంకే వేళ్లు చూపిస్తున్నారు. అయితే ఎవరా హీరో అనేది మాత్రం తేలటం లేదు. మొత్తానికి వర్మ గొప్ప స్టఫ్ ఇచ్చాడు.