MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • మీ మనసుని బాధపెట్టి ఉంటే మన్నించండి..ఎట్టకేలకు చిరంజీవిని క్షమాపణ కోరిన ఆర్జీవీ

మీ మనసుని బాధపెట్టి ఉంటే మన్నించండి..ఎట్టకేలకు చిరంజీవిని క్షమాపణ కోరిన ఆర్జీవీ

“శివ” రీ-రిలీజ్ సందర్భంగా చిరంజీవి చేసిన ప్రశంసలకు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ, గతంలో తన వ్యాఖ్యలతో చిరంజీవిని అనుకోకుండా నొప్పించినందుకు క్షమాపణలు తెలిపారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 09 2025, 09:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వివాదాలతో వార్తల్లో రాంగోపాల్ వర్మ 
Image Credit : Asianet News

వివాదాలతో వార్తల్లో రాంగోపాల్ వర్మ 

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ శివ సినిమాలో తన ఫిలిం మేకింగ్ శైలితో యావత్ దేశాన్ని ఆకర్షించారు. కానీ ఇటీవల వర్మ తన సినిమాల కంటే వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవిపై సైతం వర్మ అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. కానీ ఎట్టకేలకు వర్మ చిరంజీవిని క్షమాపణ కోరారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శివ రీ రిలీజ్ పై చిరంజీవి రియాక్షన్ 
Image Credit : annapurna studios

శివ రీ రిలీజ్ పై చిరంజీవి రియాక్షన్ 

“శివ” చిత్రం రీ-రిలీజ్ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. ఆ కాలంలో ఈ చిత్రం తెరపై చూసినప్పుడు కలిగిన అనుభూతిని వివరించారు. చిరంజీవి మాట్లాడుతూ, ఈ మూవీలో నాగార్జున గారి తీవ్రత, రాంగోపాల్ వర్మ చూపిన విప్లవాత్మక దృక్పథం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ యువ దర్శకుడు తెలుగు సినిమాకి భవిష్యత్తు అని అప్పట్లోనే తాను అనుకున్నట్లు చిరంజీవి తెలిపారు. 

35
చిరంజీవికి క్షమాపణ చెప్పిన వర్మ 
Image Credit : Asianet News

చిరంజీవికి క్షమాపణ చెప్పిన వర్మ 

మెగాస్టార్ నుండి వచ్చిన ఈ హృదయపూర్వక సందేశానికి రాంగోపాల్ వర్మ స్పందించారు.  “గతంలో నేను చేసిన కొన్ని వ్యాఖ్యలు చిరంజీవి గారిని అనుకోకుండా నొప్పించి ఉంటే, దానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుకుంటున్నాను. శివ సినిమా గురించి ఇంత అద్భుతంగా చెప్పినందుకు థాంక్యూ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. 

45
చిరంజీవిపై విమర్శలు 
Image Credit : google

చిరంజీవిపై విమర్శలు 

తెలుగు సినీ వర్గాల్లో ఈ పరిణామం విశేష చర్చనీయాంశంగా మారింది. గతంలో వర్మ చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా రాజకీయ సంబంధిత అంశాలపై వచ్చిన ఆయన ట్వీట్లు, మెగా ఫ్యాన్స్‌లో ఆగ్రహానికి కారణమయ్యాయి. పలు సందర్భాల్లో వర్మ పరోక్షంగా చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఎక్స్ లో పోస్ట్ లు పెట్టేవారు. 

Thank you ⁦@KChiruTweets⁩ gaaru, Also on this occasion I want to sincerely apologise to you if I ever unintentionally offended you ..Thank you once again for your large heartedness 🙏🙏🙏 pic.twitter.com/08EaUPVCQT

— Ram Gopal Varma (@RGVzoomin) November 9, 2025

55
ప్రేక్షకుల్లో ఆసక్తి 
Image Credit : google

ప్రేక్షకుల్లో ఆసక్తి 

“శివ” చిత్రం రీ-రిలీజ్ ప్రస్తుతం సినీప్రియులలో విపరీతమైన ఆసక్తిని రేపుతోంది. నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 1989లో విడుదలై తెలుగు సినిమాకు సాంకేతిక, శైలి పరమైన కొత్త దారితీసింది. యూత్ యాక్షన్ డ్రామా జానర్‌లో అది చేసిన విప్లవాత్మక మార్పులు ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంటాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India Top 10 Heroines: పడిపోయిన నయనతార, కాజల్‌, త్రిష, దూసుకొచ్చిన సాయిపల్లవి.. సమంత, రష్మిక స్థానాలివే
Recommended image2
Chiranjeevi: నాగార్జున సినిమా హోరులో డిజాస్టర్ అయిన చిరంజీవి మూవీ..డైరెక్టర్ తో గొడవ అందుకేనా ?
Recommended image3
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Related Stories
Recommended image1
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిటికీలో నుంచి దూకి పారిపోయిన యాంకర్ సుమ.. చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎఫెక్ట్
Recommended image2
రాజమౌళి సినిమాలన్నీ అక్కడ అట్టర్ ఫ్లాప్, ధైర్యమిచ్చిన స్టార్ హీరో గురించి జక్కన్న ఇలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved