MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాజమౌళి సినిమాలన్నీ అక్కడ అట్టర్ ఫ్లాప్, ధైర్యమిచ్చిన స్టార్ హీరో గురించి జక్కన్న ఇలా..

రాజమౌళి సినిమాలన్నీ అక్కడ అట్టర్ ఫ్లాప్, ధైర్యమిచ్చిన స్టార్ హీరో గురించి జక్కన్న ఇలా..

ఆ భాషలో రాజమౌళి సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీనితో జక్కన్నకి ఓ స్టార్ హీరో ధైర్యం ఇచ్చారు. ఆ భాషలో రాజమౌళికి దక్కిన తొలి విజయం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 09 2025, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజమౌళి, మహేష్ బాబు మూవీ
Image Credit : Asianet News

రాజమౌళి, మహేష్ బాబు మూవీ

దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమాలో తిరుగులేని ఫిలిం మేకర్ గా ఎదిగారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో రాజమౌళికి పాన్ ఇండియా మాత్రమే కాదు.. వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా ఆస్కార్ అవార్డు కొల్లగొట్టింది. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబు హీరోగా గ్లోబ్ ట్రాటర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీతో హాలీవుడ్ మార్కెట్ ని సైతం కొల్లగొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకే ఈ చిత్రం 1000 కోట్ల బడ్జెట్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
అక్కడ రాజమౌళి సినిమాలన్నీ ఫ్లాప్
Image Credit : Social Media

అక్కడ రాజమౌళి సినిమాలన్నీ ఫ్లాప్

రాజమౌళికి ఇంతవరకు పరాజయమే లేదు. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అన్ని చిత్రాలు ఘన విజయం సాధించాయి. రాజమౌళి సినిమాలని పలు భాషల్లో రీమేక్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ రాజమౌళి సినిమాలు ఒక దశ వరకు తమిళంలో అట్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాయి. 

Related Articles

Related image1
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిటికీలో నుంచి దూకి పారిపోయిన యాంకర్ సుమ.. చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎఫెక్ట్
Related image2
రాము రాథోడ్ కు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ , 9 వారాలు బిగ్ బాస్ లో ఉన్నందకు ఎంత వసూలు చేశాడంటే?
35
రవితేజ ఫోటో స్టార్ హీరో ఫోన్ లో..
Image Credit : our own

రవితేజ ఫోటో స్టార్ హీరో ఫోన్ లో..

తమిళ నటుడు కార్తీ నటించిన సినిమా ఈవెంట్ కి గతంలో రాజమౌళి హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో కార్తీ మాట్లాడుతూ..ఇండియన్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ని అద్భుతంగా తీర్చి దిద్దే దర్శకుడు రాజమౌళి అని ప్రశంసలు కురిపించారు. రాజమౌళి సినిమాల్లో ఉండే సినిమాటిక్ మూమెంట్స్ ని ప్రేక్షకులు ఎక్కువగా కోరుకుంటారు అని కార్తీ తెలిపారు. విక్రమార్కుడు రీమేక్ చేయడం కోసం రెండేళ్ల పాటు రవితేజ ఫోటోని తన ఫోన్ లో పెట్టుకుని తిరిగినట్లు కార్తీ తెలిపారు. 

45
ఆ భాషలో రాజమౌళికి తొలి హిట్
Image Credit : our own

ఆ భాషలో రాజమౌళికి తొలి హిట్

విక్రమార్కుడు రీమేక్ సిరుతై చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని కార్తీ అన్నారు. రాజమౌళి మైక్ తీసుకుని ఈ సందర్భంగా నేను కార్తీకి కృతజ్ఞతలు చెప్పాలి అని అన్నారు. ఎందుకంటే నా సినిమాలు ఒక్కటి కూడా తమిళంలో సరిగ్గా ఆడలేదు. కానీ కార్తీ చేసిన విక్రమార్కుడు రీమేక్ సిరుతై మాత్రం సూపర్ హిట్ అయింది. దీనితో నా సినిమాలు కూడా తమిళంలో ఆడతాయి అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకు కార్తీకి కృతజ్ఞతలు అని రాజమౌళి అన్నారు. 

55
తెలుగులో కార్తీ క్రేజ్
Image Credit : our own

తెలుగులో కార్తీ క్రేజ్

బాహుబలి నుంచి రాజమౌళి సినిమాలకు పాన్ ఇండియా గుర్తింపు లభించింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఇండియా సినిమా బిగ్గెస్ట్ హిట్స్ లిస్ట్ లో చేరాయి. ఇక కార్తీ ఆవారా, ఖైదీ లాంటి చిత్రాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఎస్.ఎస్. రాజమౌళి

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Venky: చిరంజీవి మూవీని కాపీ కొట్టి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న వెంకటేష్‌.. నిజాలు బయటపెట్టిన నిర్మాత
Recommended image2
Rashmika Mandanna: స్టేజ్‌పై ఆ పదం వాడిన రష్మిక, కృతికి ఫ్యూజులు ఔట్.. హీరో చేసిన పనికి నేషనల్‌ క్రష్‌ ఇబ్బంది
Recommended image3
Peddi Movie Trailer: పెద్ది ట్రైలర్‌ రివ్యూ.. ఆట మాత్రమే కాదు, అంతకు మించి.. కానీ డిజప్పాయింట్‌ చేసేది ఇదే
Related Stories
Recommended image1
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కిటికీలో నుంచి దూకి పారిపోయిన యాంకర్ సుమ.. చిరంజీవి, పవన్, ఎన్టీఆర్ ఎఫెక్ట్
Recommended image2
రాము రాథోడ్ కు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ , 9 వారాలు బిగ్ బాస్ లో ఉన్నందకు ఎంత వసూలు చేశాడంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved