MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘ఆస్కార్స్’ బరిలోకి రామ్ చరణ్ ఎంట్రీ.. అప్డేట్ లిస్టులో మెగా పవర్ స్టార్ పేరు.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్.!

‘ఆస్కార్స్’ బరిలోకి రామ్ చరణ్ ఎంట్రీ.. అప్డేట్ లిస్టులో మెగా పవర్ స్టార్ పేరు.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్.!

‘ఆర్ఆర్ఆర్’లో అద్భుతమైన పెర్ఫామెన్స్ కనబర్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కూడా ఆస్కార్ బరిలో నిలిచారు. ఇప్పటికే లిస్టులో ‘ఎన్టీఆర్’ ఉండగా.. తాజాగా చెర్రీ పేరు కూడా చేర్చడంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేవనే చెప్పాలి.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 16 2022, 12:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఉద్యమ వీరులు కొమురం భీం, అల్లూరి సీతారామరాజులు ప్రధాన పాత్రలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR). ఈ చిత్రంలో సీతా రామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.NTR) నటించిన విషయం తెలిసిందే.

26

ఎన్టీఆర్, రామ్ చరణ్ పెర్ఫామెన్స్ ‘ఆర్ఆర్ఆర్’లో అద్భుతమనిపించింది. ప్రపంచ వ్యాప్తంగా వీరి నటనకు ప్రశంసలు దక్కాయి. ఏకంగా హాలీవుడ్ దర్శకుడు, రచయితలు, స్టార్స్ కూడా ఈ మూవీ గొప్పదంటూ తమదైన శైలిలో రివ్యూలు ఇచ్చాడు. ముఖ్యంగా మూవీలో కొన్ని ఎలివేషన్ షాట్స్, వీఎఫ్ఎక్స్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంట్రీ సీన్లు, ఇంటర్వెల్ షాట్ ఆడియెన్స్ కు ఎప్పటి గుర్తుండిపోయేలా చేశాయి. 
 

36

ముఖ్యంగా చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని రామ్ చరణ్, ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ తో ఇరగదీశారు. ఇందుకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్ నిలిచారు. ఆయన పేరు ప్రముఖ మీడియా సంస్థ ‘వెరైటీ’ లిస్టులో ఇప్పటికే చేరింది. కాగా, తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ రామ్ చరణ్ కూడా ఆస్కార్ బరిలో నిలిచారు. 
 

46

మిస్టర్ బాక్సాఫీస్ రామ్ చరణ్ తేజ్ పేరును కూడా ‘వెరైటీ’ సంస్థ రీసెంట్ గా అప్డేట్ అయిన లిస్టులో చేర్చింది. 35వ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ఉండగా, 36వ స్థానం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు చేరింది. ఈ  సందర్భంగా చెర్రీ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 
 

56

దీంతో రామ్ చరణ్ పేరు ఇంటర్నెట్ లో వైరల్ చేస్తున్నారు. #RamCharanForOscars అనే హ్యాష్ ట్యాగ్  సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. చరణ్, తారక్ అభిమానులు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే బెస్ట్ ఇంటర్నేషనల్ సినిమాల లిస్టులో ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ (Oscar) అవార్డు కూడా రావాలని ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ డిమాండ్ చేస్తున్నారు. 
 

66

ప్రస్తుతం రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో ‘ఆర్సీ15’ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ సగానికిపైగా పూర్తైనట్టు తెలుస్తోంది. తన కేరీర్ లోనే చెర్రీ బెస్ట్ లుక్ తో, బెస్ట్ పాత్రల్లో అదరగొట్టనున్నాడు. మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Khushbu Sundar Weight Loss: ఖుష్బూ చెప్పిన ఈ పనిచేస్తే చాలు మీరు ఏనుగులా ఉన్నా సరే దెబ్బకి స్లిమ్‌ అయిపోతారు
Recommended image2
Raghavendra Raoకి మాటిచ్చి ఆ కోరిక తీర్చకుండానే వెళ్లిపోయిన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా?
Recommended image3
Most Expensive Songs: ఇండియన్ సినిమాలో 8 ఖరీదైన పాటలు.. నెం.1 అమీర్, షారుఖ్ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved