చిరంజీవి మాట వినకుండా నష్టపోయిన రామ్ చరణ్..? ఆ సినిమా చేయకుండా ఉండాల్సింది కదా..?
గ్లోబల్ స్టార్ గా ఎదిగినా కాని.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి మాటకాదని ఏ పని చేయరు. సినిమాల విషయంలో కూడా చిరు ఓ లుక్ వేయాల్సింది. గతంలో మెగాస్టార్ మాట వినకపోవడంతోనే చరణ్ నష్టపోయాడట. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..?
మెగాస్టార్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. తన టాలెంట్ తో ఎదిగాడు. మొదట్లో చరణ్ కాస్త నెపోకిడ్ అనిపించుకున్నా.. ఆతరువాత తనలో చాలా మార్పు వచ్చింది. యాక్టింగ్ కూడ రంగస్థలం సినిమా తరువాత కొత్త రామ్ చరణ్ కనిపించాడు. తనకంటూ కొత్త ఇమేజ్ ను స్టార్ డమ్ ను .. సొంత ఫ్యాన్ బేస్ ను కూడా సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయికి ఎదిగాడు రామ్ చరణ్. ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ రేంజ్ ను సాధించాడు చరణ్.
All So Read: ఎన్టీఆర్ క్లాప్ తో.. మోక్షజ్ఞ మూవీ ఓపెనింగ్..? నందమూరి ఫ్యాన్స్ కు పండగే పండగా..
అవతార్ దర్శకడు జేమ్స్ కామరూన్ చేత శభాష్ అనిపించుకున్న రామ్ చరణ్.. గతంలో ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయాలకు ఇబ్బందుపడక తప్పలేదట. ఇంత ఎదిగినా..తన తండ్రి ముందు వినయంగా ఉండే చరణ్.. ఆయన సలహా లేకుండా ఏ పనిచేయడట. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్.. మెగాస్టార్ మాట జవదాటడట. ఓ సారి అలా తండ్రి మాట కాదని.. చేసిన పనికి ఆయన చాలా నష్టపోవడంతో పాటు.. ట్రోలింగ్ ను కూడా ఫేస్ చేయాల్సి వచ్చిందట. ఇంతకీ విషయం ఏంటంటే..?
All So Read: రజినీకాంత్ జైలర్ మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..? బ్లాక్ బస్టర్ సినిమాకు ఏడాది పూర్తి..
రామ్ చరణ్ సినిమాల విషయంలో చిరంజీవి నిర్ణయం తప్పనిసరి. ఆయనకు ఉన్న ఎక్స్ పీరియన్స్ తో కొన్ని కథలు వద్దని చెప్పేస్తుంటారట. అలానే చిరంజీవి వద్దన్నా వినకుండా రామ్ చరణ్ ఓ మూవీలో యాక్ట్ చేశాడట. చివరకు విమర్శల పాలయ్యాడు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు జంజీర్. రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా తెలుగులో తుఫాన్ పేరుతో రిలీజ్ అయ్యింది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని పూర్వ లఖియా డైరెక్ట్ చేశారు.
All So Read: Thangalaan Review: తంగలాన్ ట్విట్టర్ రివ్యూ.. విక్రమ్ ప్రయోగంపై ఆడియన్స్ ఏమంటున్నారంటే..?
అయితే యాక్షన్ స్టోరీ కావడం.. బాలీవుడ్ ఎంట్రీకి మంచి ఛాన్స్ రావడంతో రామ్ చరణ్ ఇష్టపడ్డాట. ఈమూవీ చేయాలని మనసులాగడంతో జంజీర్ చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాడట చరణ్. అయితే ఈ స్టోరీ నీకు సెట్ అవ్వదు.. వద్దు వదిలేయమని చిరంజీవి చరణ్ కు చెప్పారట. కాని చరణ్ మాత్రం పట్టుబట్టి.. మెగాస్టార్ ను ఒప్పించి జింజీర్ చేశాడు. అయితే భారీ అంచనాల నడుమ 2013లో రిలీజ్ అయిన ఈసినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఫస్ట్ షో నుంచే నెగెటీవ్ టాక్ తెచ్చకుందీమూవీ.
ఇక సౌత్ సినిమాను ఎప్పుడు విమర్షించడానికి రెడీగా ఉండే బాలీవుడ్ మీడియా.. రామ్ చరణ్ పై అనవసరంగా నోరు పారేసుకుంది. చరణ్ యాక్టింగ్, లుక్స్ పై కూడా రకరకాలుగా ట్రోల్స్ చేశారు బాలీవుడ్ జనాలు. ఇక అప్పటి నుంచి చిరంజీవి మాట వినకుండా చరణ్ సినిమాల విషయంలో ముందు వెళ్లిన సందర్భాలు లేవని చెప్పాలి. ఇక అంతలా విమర్షించిన బాలీవుడ్ జనాలకు రంగస్థలం, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో ముఖం మీద కొట్టినట్టు బుద్ది చెప్పాడు మెగా పవర్ స్టార్. అంతే కాదు పాన్ వరల్డ్ స్థాయిలో ఇమేజ్ సాధించుకుని... ఏకంగా హాలీవుడ్ దిగ్గజాలే శభాష్ అనేలా చేశాడు.