MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వీరయ్య కోసం చిట్టిబాబు వస్తున్నాడు.. సంబరాలు లోడింగ్, గ్రాండ్ ఈవెంట్ డీటెయిల్స్ ఇవిగో

వీరయ్య కోసం చిట్టిబాబు వస్తున్నాడు.. సంబరాలు లోడింగ్, గ్రాండ్ ఈవెంట్ డీటెయిల్స్ ఇవిగో

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తోందో అందరికి తెలిసిందే. దర్శకుడు బాబీ మెగాస్టార్ అభిమానులకు ఎలాంటి అంశాలు కోరుకుంటారో వాటితోనే ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేశారు.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 28 2023, 08:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తోందో అందరికి తెలిసిందే. దర్శకుడు బాబీ మెగాస్టార్ అభిమానులకు ఎలాంటి అంశాలు కోరుకుంటారో వాటితోనే ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేశారు. అయితే క్రిటిక్స్ నుంచి ఎక్కువగా వాల్తేరు వీరయ్య చిత్రానికి ఎక్కువగా నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. 

26

కానీ వాటన్నింటిని అధికమిస్తూ మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలైన స్టామినా చూపిస్తున్నారు. తనకు పడాల్సిన చిత్రం పడితే వసూళ్ల వరద ఎలా ఉంటుందో చూపించారు.  వాల్తేరు వీరయ్య చిత్రం రెండు వారాల్లోనే 200 కోట్ల గ్రాస్ అధికమించింది. 125 కోట్లకి పైగా షేర్ తో దూసుకుపోతోంది. 

36

అన్ని ఏరియాలలో బయ్యర్లు కళ్ళు చెదిరే లాభాలు అందుకుంటున్నారు. దీనితో వాల్తేరు వీరయ్య చిత్రం బిగ్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. దీనితో మైత్రి నిర్మాతలు వాల్తేరు వీరయ్య సక్సెస్సెలెబ్రేషన్స్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు. జనవరి 28 అంటే నేడు 'వీరయ్య విజయ విహారం' పేరుతో సక్సెస్ సెలెబ్రేషన్స్ జరగనున్నాయి. 

46

హనుమకొండ లోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ వద్ద సక్సెస్ ఈవెంట్ ఈ సాయంత్రం జరగనుంది. ఈ సక్సెస్ ఈవెంట్ లో సంబరాలు రెట్టింపు అయ్యేలా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా రాబోతున్నాడు. చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అంటే మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్, మాస్ మహారాజ్ రవితేజ ఒకే వేదికపై కనిపించబోతున్నారు. 

56
Ram Charan

Ram Charan

రాంచరణ్ మైత్రి మూవీస్ సంస్థలోనే రంగస్థలం చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది. ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్యగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నారు. మెగా హీరోలకి మైత్రి సంస్థకి జోడి భలే కుదురుతోంది. 

66

రాంచరణ్ రంగస్థలం, సాయిధరమ్ తేజ్ చిత్రలహరి, వైష్ణవ్ తేజ్ ఉప్పెన, అల్లు అర్జున్ పుష్ప .. ఇప్పుడు వాల్తేరు వీరయ్య.. ఈ బ్లాక్ బస్టర్ చిత్రాలు అన్నీ మైత్రి మూవీస్ సంస్థలోనే నిర్మించబడ్డాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Allu Arjun ఎప్పుడు ఏడుస్తాడో తెలుసా? ఇంటి రహస్యాలు బయటపెట్టిన అల్లు అరవింద్‌
Recommended image2
Kavalan Movie: రోజాని చూసి షాకైన విజయ్! ఆ ఒక్క విషయం నమ్మలేకపోయాడు.. ఫ్లాష్‌బ్యాక్ సీక్రెట్స్!
Recommended image3
Spirit Update: `స్పిరిట్‌`లో వివేక్‌ ఒబెరాయ్‌.. అంచనాలకు అందని సందీప్‌ రెడ్డి ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved