MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 500 మంది కోసం 50 లక్షలు ఖర్చు పెట్టిన రామ్ చరణ్, మాట నిలబెట్టుకున్నమెగా పవర్ స్టార్

500 మంది కోసం 50 లక్షలు ఖర్చు పెట్టిన రామ్ చరణ్, మాట నిలబెట్టుకున్నమెగా పవర్ స్టార్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తన మంచి మనసును నిరూపించుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మెగాస్టార్ తనయుడు అనిపించుకున్నాడు. ఇంతకీ ఆయన ఏం చేశారోతెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 01 2026, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మెగాస్టార్ వారసత్వం నిలబెట్టిన హీరో..
Image Credit : Asianet News

మెగాస్టార్ వారసత్వం నిలబెట్టిన హీరో..

మెగాస్టార్ వారసత్వాన్ని తీసుకుని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. తండ్రి పేరు నిలబెడుతూ... తన ట్యాలెంట్ తో ఎదుగుతూ వచ్చాడు. తనకంటూ ఓన్ గా ఇమేజ్ ను, అభిమానులను సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగు వెలుగుతున్నాడు చరణ్. నటనలోనే కాదు.. సమాజ సేవలో కూడా తండ్రి చిరంజీవి వారసత్వాన్ని తీసుకున్నాడు చరణ్. 

ఇచ్చిన మాట మీద నిలబడుతూ.. ఎంతో మందికి సాయం చేస్తున్నాడు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి ప్రాణం పోస్తున్నారు. అంతే కాదు మెడికల్ బిల్లలు, చదువులకోసం ఫీజులు.. ఇలా రోజుకు చిరంజీవి నుంచి 25 లక్షలకు పైగా సాయం అందుతున్నట్టు రీసెంట్ ఆయనఅభిమాని ఒకరు వెల్లడించారు.

25
మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్...
Image Credit : Asianet News

మాట నిలబెట్టుకున్న మెగా పవర్ స్టార్...

ఇక చరణ్ కూడా అదే బాటలో నడుస్తున్నారు. రీసెంట్ గా ఆయన చేతి నుంచి భారీ స్థాయిలో సాయం చేసినట్టు తెలుస్తోంది. అదేంటంటే? రామ్ చరణ్ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు చెందిన సుమారు 500 మంది డ్యాన్సర్లు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు ఆయన ముందుకు వచ్చారు. 

గతంలో తన పుట్టినరోజు సందర్భంగా డ్యాన్సర్లకు మద్దతుగా ఇచ్చిన హామీని తాజాగా చరణ్ నిలబెట్టు కున్నట్టు తెలుస్తోంది. ఈ ఆరోగ్య బీమా పథకానికి సంబంధించిన హెల్త్ కార్డుల పంపిణీ ప్రతిపాదనను తాజాగా ఆయన ఆమోదించినట్లు తెలుస్తోంది.

Related Articles

Related image1
Jabardasth : చలాకి చంటి ని మోసం చేసింది ఎవరు, నాశనమైపోతారని.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ శాపనార్ధాలు..
Related image2
బాలకృష్ణ, మహేష్ బాబు కాంబోలో.. మల్టీస్టారర్ సినిమా కోసం ప్రయత్నించిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
35
ఎంతో శ్రమిస్తున్న డ్యాన్సర్ల కోసం..
Image Credit : instagram /Ram charan

ఎంతో శ్రమిస్తున్న డ్యాన్సర్ల కోసం..

సినిమా కోసం కష్టపడుతున్నవారిలో.. ఎన్నో విభాగాలు ఉన్నాయి. వారిలో డ్యాన్సర్లు కూడా ఉన్నారు. షూటింగ్ టైమ్ లో.. వారు శారీరకంగా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రమాదాలు జరగడం, అనారోగ్యం, రకరకాల సమస్యలను వారు ఎదుర్కొంటున్నారు. 

ఈ విషయాన్ని రామ్ చరణ్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డ్యాన్సర్లు, వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో రామ్ చరణ్ ప్రతి డ్యాన్సర్ కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా చేయించబోతున్నట్టు సమాచారం.

45
500 కుటుంబాలకు 50 లక్షల ఖర్చు..
Image Credit : facebook/AlwaysRamCharan

500 కుటుంబాలకు 50 లక్షల ఖర్చు..

సుమారు 500 మంది డ్యాన్సర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకం కోసం రామ్ చరణ్ సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ విసయం తెగ వైరల్ అవుతోంది. 

డ్యాన్సర్ల సంక్షేమానికి చరణ్ ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు పెడుతున్నాడని తెలిసి..పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి అడుగుజాడల్లోనే సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ, సినీ కార్మికుల సంక్షేమానికి చరణ్ ఎప్పటికప్పుడు తోడ్పాటు అందిస్తున్నారు.

55
రామ్ చరణ్ సినిమాలు..
Image Credit : Asianet News

రామ్ చరణ్ సినిమాలు..

ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది మూవీ చేస్తున్నారు రామ్ చరణ్. ఈసినిమాలో చరణ్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈసినిమాను ఈ ఏడది చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ మూవీ తరువాత ఆయన సుకుమార్ తో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్
జాన్వీ కపూర్
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల టికెట్ల రేట్లు పెంచాం..దేహీ అని అడుక్కోవద్దు, పవన్ కామెంట్స్
Recommended image2
Ravi Mohan: మ్యాచింగ్ డ్రెస్ పై ఆర్తి రవి సెటైర్ వైరల్.. ఎవరిని ఉద్దేశించి ఇలా
Recommended image3
Golmaal 5: గోల్మాల్ 5లో బిగ్ సర్ప్రైజ్..అక్షయ్ సరసన ఆ బ్యూటీ, 17 మంది స్టార్లతో రచ్చ
Related Stories
Recommended image1
Jabardasth : చలాకి చంటి ని మోసం చేసింది ఎవరు, నాశనమైపోతారని.. జబర్దస్త్ స్టార్ కమెడియన్ శాపనార్ధాలు..
Recommended image2
బాలకృష్ణ, మహేష్ బాబు కాంబోలో.. మల్టీస్టారర్ సినిమా కోసం ప్రయత్నించిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved