MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • RC15 లీక్‌..చరణ్‌ ఫోటో వైరల్‌.. సీఎం పాత్రలో స్టార్‌ హీరో.. గూస్‌బంప్స్ అప్‌డేట్స్

RC15 లీక్‌..చరణ్‌ ఫోటో వైరల్‌.. సీఎం పాత్రలో స్టార్‌ హీరో.. గూస్‌బంప్స్ అప్‌డేట్స్

రామ్‌చరణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `ఆర్‌సీ15`. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్లు వైరల్‌ అవుతున్నాయి. ఓ ఫోటో లీక్‌ కావడం ఆశ్చర్యపరుస్తుంది.   

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 21 2022, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రామ్‌చరణ్‌(Ram Charan)-శంకర్‌ కాంబినేషన్‌లో బిగ్గెస్ట్ పొలిటికల్‌ డ్రామా మూవీ(RC15) తెరకెక్కుతుంది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్‌, అంజలి వంటి భారీ తారాగణం నటిస్తుంది. దిల్‌రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు అప్‌డేట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అంచనాలను పెంచేస్తున్నాయి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ సినిమాలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారట. ఓ పాత్రలో సీఎంగా, మరో పాత్రలో ఐఏఎస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తారని టాక్‌. ఐఏఎస్‌ పాత్ర పేరు రామ్‌నందన్‌ అని టాక్. ఓ పాత్రకి నత్తి ఉంటుందని టాక్‌. ప్రస్తుతం లీక్‌ అయిన సమాచారం నెట్టింట చక్కర్లు కొడుతుంది. అంతేకాదు ఓ ఫోటో కూడా లీక్‌ అయినట్టు తెలుస్తుంది. ఓ చెరువు కట్ట మధ్యలోనుంచి రామ్‌చరణ్‌ సైకిల్‌పై వస్తున్న ఫోటో చక్కర్లు కొడుతుంది. ఇందులో వైట్‌ షర్ట్ దోతి కట్టుకుని ఉన్నాడు చరణ్‌. మరి ఇది ఆయనదేనా? వేరే ఫోటోనా? అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ ఫోటో ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. 

36

దీంతోపాటు ఈ సినిమాలో ఓ బిగ్గెస్ట్ స్టార్‌ హీరో కనిపించబోతున్నారట. కీలక పాత్ర కోసం మాలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌(Mohanlal) నటిస్తున్నారని సమాచారం. ఆయన ఇందులో సీఎం పాత్రలో కనిపించబోతున్నారట. సెకాండాఫ్‌లో మోహన్‌లాల్‌ పాత్ర వస్తుందని, ఇది సినిమాకి చాలా కీలకంగా ఉంటుందని టాక్‌. దీంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆకాశమే హద్దుగా మారిపోతుంది. 
 

46

దీంతోపాటు షూటింగ్‌ డిటెయిల్స్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతుందట. రామ్‌చరణ్‌ లేకుండా ఇతర పాత్రధారులపై చిత్రీకరణ చేస్తున్నారని, ఏపీలో జరగబోయే షెడ్యూల్‌లో చరణ్‌ పాల్గొంటారని తెలుస్తుంది.  రాజమండ్రి వద్ద గోదావరి బీచ్‌లో భారీగా పొలిటికల్‌ సభకి సంబంధించి మీటింగ్‌ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది. 
 

56

తాజాగా అక్కడ వేస్తున్న సెట్‌ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పబ్లిక్‌ మీటింగ్‌ సన్నివేశాలు ఇందులో షూట్‌ చేయబోతున్నారని సమాచారం. రేపటి నుంచే ఈ షూట్‌ జరగోబోతుందని టాక్‌. రాజమండ్రితోపాటు కర్నూల్‌, వైజాగ్‌లోనూ చిత్రీకరించబోతున్నారని తెలుస్తుంది. సింహాచలంలో జనవరి 7 నుంచి షూట్‌ చేయబోతున్నారట. వచ్చే ఏడాది ఫస్టా ఆఫ్‌ వరకు సినిమా షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో శంకర్‌ ఉన్నారట. ఆ దిశగానే చిత్రీకరణని ప్లాన్‌ చేశారని సమాచారం. 

66

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రామ్‌చరణ్‌ భారీగానే పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఏకంగా వంద కోట్లు రెమ్యూనరేషన్‌ కోట్‌ చేశారట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఫిల్మ్ నగర్‌లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దిల్‌రాజు అంత పారితోషికం ఇస్తారా? అనేది పెద్ద డౌట్‌. నెక్ట్స్ సినిమా నుంచైతే మాత్రం వంద కోట్లు డిమాండ్‌ చేస్తున్నారట చరణ్‌. ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Temper Vamsi: టెంపర్ వంశీకి టెంపర్ లేచింది, రోహిత్ తో తీవ్ర స్థాయికి చేరిన గొడవ.. చుక్కలు చూపించిన దేబ్జానీ
Recommended image2
Ranveer Singh: బాక్సాఫీస్ వద్ద అసలైన 'ధురంధర్' రణ్‌వీర్ సింగ్.. ఈ 5 కారణాలే ప్రూఫ్!
Recommended image3
Jason Sanjay: నాన్న సీఎంగా బిజీ, అందుకే ఇన్వాల్వ్ కాలేదు.. కానీ సిగ్మా కోసం ఎదురుచూస్తున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved