MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గేమ్ ఛేంజర్ లో గంగవ్వ పాత్ర మైండ్ బ్లోయింగ్.. బిగ్ బాస్ వేదికపై రాంచరణ్ క్రేజీ కామెంట్స్

గేమ్ ఛేంజర్ లో గంగవ్వ పాత్ర మైండ్ బ్లోయింగ్.. బిగ్ బాస్ వేదికపై రాంచరణ్ క్రేజీ కామెంట్స్

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకి రాంచరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగార్జున బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని చరణ్ కి పరిచయం చేశారు. 

tirumala AN | Published : Dec 15 2024, 10:40 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ ఫినాలే ప్రారంభం అయింది. విజేత ఎవరు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ప్రేరణ, నిఖిల్, గౌతమ్, నబీల్, అవినాష్ ఫైనల్ కి చేరుకున్నారు. అయితే వీరిలో టైటిల్ బరిలో ముందున్నది మాత్రం గౌతమ్, నిఖిల్ ఇద్దరే. వీరిద్దరిలో విజేత ఎవరనే సస్పెన్స్ కి నాగార్జున తెర దించనున్నారు. అయితే విజేత ఎవరనేది ముందుగానే తెలిసిపోయింది. నిఖిల్ బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నారు. 

24
Asianet Image

బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ ఫినాలేకి రాంచరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాగార్జున బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని చరణ్ కి పరిచయం చేశారు. గంగవ్వని పరిచయం చేయగానే.. ఆమెని గేమ్ ఛేంజర్ సెట్స్ లో తొలిసారి కలిశాను. నాతో కలసి నటించారు. నన్ను ఇష్టం వచ్చినట్లు తిట్టేశారు. మీ డ్యూటీ మీరు సరిగ్గా చెయ్యట్లేదు అని తిట్టే పెద్దావిడ పాత్రలో గంగవ్వ నటించినట్లు రాంచరణ్ తెలిపారు. 

34
Asianet Image

ఆ తర్వాత నాగార్జున రోహిణిని పరిచయం చేయగా.. తాను కూడా గేమ్ ఛేంజర్ లో నటించినట్లు తెలిపారు. ఆ తర్వాత అవినాష్ మెగాస్టార్ చిరంజీవిని మిమిక్రీ చేస్తూ కొన్ని డైలాగ్స్ చెప్పారు. అదే విధంగా రాజశేఖర్ ని కూడా మిమిక్రీ చేశారు. అవినాష్ ట్యాలెంట్ కి రాంచరణ్ ఫిదా అయ్యారు. 

44
Asianet Image

నాగార్జునతో రాంచరణ్ గేమ్ ఛేంజర్ ముచ్చట్లు రివీల్ చేశారు. రాజమౌళి గారి ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎలాంటి మూవీ చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో శంకర్ గారి సినిమాలో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టం అని రాంచరణ్ తెలిపారు. శంకర్ ఓల్డ్ స్టైల్ పొలిటికల్ డ్రామా, ఎంటర్టైన్మెంట్ గేమ్ ఛేంజర్ లో ఉంటాయని రాంచరణ్ తెలిపారు. 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
అక్కినేని నాగార్జున
 
Recommended Stories
Top Stories