- Home
- Entertainment
- Ram Charan: ఉక్రెయిన్ నుంచి రాంచరణ్ కి ఫోన్.. వెంటనే ఆర్థిక సాయం, హృదయం బరువెక్కే సంఘటన
Ram Charan: ఉక్రెయిన్ నుంచి రాంచరణ్ కి ఫోన్.. వెంటనే ఆర్థిక సాయం, హృదయం బరువెక్కే సంఘటన
ప్రస్తుతం ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తనకు తెలిసిన వ్యక్తులకు ఆర్థిక సాయం చేసినట్లు స్వయంగా రాంచరణ్ రివీల్ చేశాడు.

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్.మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. దేశం మొత్తం ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
త్వరలో రిలీజ్ ఉండడంతో ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ మరోసారి ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొంతభాగం ఉక్రెయిన్ లో షూటింగ్ జరుపుకుంది. యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉక్రెయిన్ లో దయనీయ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా ప్రేక్షకులని 'నాటు నాటు' సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్ మొత్తం ఉక్రెయిన్ లో షూట్ చేశారు. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో రాంచరణ్ రివీల్ చేశాడు. సాంగ్ లో బ్యాగ్రౌండ్ లో ఉన్న డాన్సర్స్ అంతా ఉక్రెయిన్ కి చెందిన వారే. ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉక్రెయిన్ వాతావరణం, పరిస్థితులు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయని.. కానీ ఇప్పుడు అంతా మారిపోయిందని రామ్ చరణ్ తెలిపారు.
ప్రస్తుతం ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో తనకు తెలిసిన వ్యక్తులకు ఆర్థిక సాయం చేసినట్లు స్వయంగా రాంచరణ్ రివీల్ చేశాడు. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ సమయంలో ఓ వ్యక్తి నాకు అక్కడ సెక్యూరిటీగా ఉన్నాడు. అతడితో ఫోన్ ద్వారా టచ్ లో ఉన్నా.
ఇటీవల అతడికి ఫోన్ చేసినప్పుడు అతడు చెప్పిన మాటలకు నా హృదయం బరువెక్కింది. తన 80 ఏళ్ల తండ్రి కూడా తుపాకీ పట్టుకుని యుద్ధంలో పాల్గొన్నట్లు తెలిపాడు. దీనితో అతడితో పాటు నాకు తెలిసిన వాళ్లకు సాయంగా కొంత డబ్బు పంపినట్లు రాంచరణ్ తెలిపాడు.
ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. అలియా భట్ సీత పాత్రలో నటిస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.