- Home
- Entertainment
- మరో భారీ సిక్సర్ బాదేసిన రాంచరణ్, రిలీజ్ కి ముందే 130 కోట్లు పిండేసిన మెగా పవర్ స్టార్
మరో భారీ సిక్సర్ బాదేసిన రాంచరణ్, రిలీజ్ కి ముందే 130 కోట్లు పిండేసిన మెగా పవర్ స్టార్
పెద్ది చిత్రంతో రాంచరణ్ రిలీజ్ కి ముందే సిక్సర్ల జోరు చూపిస్తున్నారు. టీజర్ నుంచి మొన్న రిలీజైన చికిరి సాంగ్ వరకు ప్రతీది ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. తాజాగా పెద్ది ఓటీటీ రైట్స్ కి సంబంధించిన అప్డేట్ వైరల్ గా మారింది.

రాంచరణ్ పెద్ది మూవీ
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. రాంచరణ్ సిక్సర్ల మీద సిక్సర్లు బాదేస్తున్నాడు. ఈ మూవీలో చరణ్ విలేజ్ క్రికెటర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. టీజర్ లో ఈ హంగామా మొదలైంది. ఇటీవల విడుదలైన చికిరి సాంగ్ 100 మిలియన్ల వ్యూస్ తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
పెద్ది ఓటీటీ రైట్స్
ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ అప్డేట్ తో పెద్ది సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పెద్ది ఓటీటీ హక్కులు బాంబు లాంటి ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఏకంగా పెద్ది ఓటీటీ రైట్స్ 130 కోట్లకు అమ్ముడయ్యాట.
ఓటీటీ హక్కులు ఎవరికంటే..
అందుతున్న సమాచారం మేరకు నెట్ ఫ్లిక్స్ ఈ హక్కులని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషల్లో ఓటీటీ హక్కులని నెట్ ఫ్లిక్స్ సంస్థే సొంతం చేసుకుందట. 130 కోట్ల డీల్ అంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రం దాదాపు 350 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కుతోంది.
పెద్ది రిలీజ్ డేట్
పెద్ది సినిమాపై ఎలాంటి బజ్ ఉందో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. మార్చి 27న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో భారీ యాక్షన్ సీన్ ని చిత్రీకరిస్తున్నారు. ఆ తర్వాత ఢిల్లీలో ఓ షెడ్యూల్ ఉంటుంది.
షూటింగ్ అప్డేట్
ఆ తర్వాత హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ ఉంటుందట. ఈ షెడ్యూల్ లోనే ఐటెం సాంగ్ ని చిత్రీకరిస్తారు. దీనితో షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే అని చెబుతున్నారు. కాబట్టి పెద్ది రిలీజ్ డేట్ లో మార్పు ఉండదని తెలుస్తోంది. ఐటెం సాంగ్ లో నటించే హీరోయిన్ ని ఇంకా ఫైనల్ చేయలేదు. ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడీగా తొలిసారి జాన్వీ కపూర్ నటిస్తోంది.

