- Home
- Entertainment
- పవన్ కళ్యాణ్, అక్షయ్, దేవరకొండ సినిమాలపై బిగ్ అప్డేట్..2017 రిపీట్ అవుతుంది, దిల్ రాజు కాన్ఫిడెన్స్ చూశారా
పవన్ కళ్యాణ్, అక్షయ్, దేవరకొండ సినిమాలపై బిగ్ అప్డేట్..2017 రిపీట్ అవుతుంది, దిల్ రాజు కాన్ఫిడెన్స్ చూశారా
2017 లో వరుసగా 6 సూపర్ హిట్లు కొట్టారు దిల్ రాజు. 2026లో కూడా అదే రిపీట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. 2026లో తమ ప్లానింగ్ లో పవన్ కళ్యాణ్, అక్షయ్ కుమార్ సినిమాలు కూడా ఉన్నాయని తెలిపారు.

ట్రాక్ తప్పిన దిల్ రాజు
టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ తిరుగులేని నిర్మాతగా మారారు. కథల ఎంపిక విషయంలో దిల్ రాజు జడ్జిమెంట్ అద్భుతంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఆయనకి కొన్ని పరాజయాలు ఎదురయ్యాయి కానీ.. గతంలో దిల్ రాజు సినిమా నిర్మిస్తున్నారు అంటే మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే కాన్ఫిడెన్స్ ఆడియన్స్ లో ఉండేది. దిల్ రాజు చివరగా నిర్మించిన ఫ్యామిలీ స్టార్, గేమ్ ఛేంజర్, తమ్ముడు లాంటి చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఒక్కటే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం దిల్ రాజు, శిరీష్ గోవాలో సందడి చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ప్రదర్శించడానికి ఎంపిక అయింది. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థకి అరుదైన గౌరవం అనే చెప్పాలి.
2017 రిపీట్ అవుతుంది
గోవాలో జరుగుతున్న ఈ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనేందుకు దిల్ రాజు, శిరీష్, అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేష్ వెళ్లారు. అక్కడ దిల్ రాజు, శిరీష్ మీడియాతో మాట్లాడుతూ 2026 లో రాబోయే తమ చిత్రాల ప్లానింగ్ ని వివరించారు. దిల్ రాజు మాట్లాడుతూ మా బ్యానర్ కి 2017 గోల్డెన్ ఇయర్. ఆ ఏడాది 6 సూపర్ హిట్స్ వచ్చాయి. 2026లో కూడా అదే రిపీట్ అవుతుంది. దాదాపు 6 సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి అని దిల్ రాజు అన్నారు.
ఎల్లమ్మపై దిల్ రాజు కాన్ఫిడెన్స్
బలగం వేణు దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ అనే చిత్రం ఖరారు అయినట్లు తెలిపారు. చాలా కాలంగా ఈ చిత్రం వార్తల్లో ఉంటోంది. ముందుగా నాని, ఆ తర్వాత నితిన్ ని ఈ చిత్రం కోసం అనుకున్నారు. కానీ కుదర్లేదు. ఇప్పుడు ఈ చిత్రం దేవిశ్రీ ప్రసాద్ చేతుల్లోకి వెళ్ళింది. త్వరలోనే హీరోయిన్ ని కూడా ఫైనల్ చేస్తామని దిల్ దిల్ రాజు తెలిపారు. అదే విధంగా విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్ అనే చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా రవికిరణ్ కోలా దర్శకుడు.
అక్షయ్ కుమార్ తో సంక్రాంతికి వస్తున్నాం రీమేక్
బాలీవుడ్ లో కూడా దిల్ రాజు ఒక చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ తో సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ..అక్షయ్ కుమార్ తో సినిమా చేస్తున్న సంగతి నిజమే అని అన్నారు. సంక్రాంతికి వస్తున్నాంలో మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకుని కథలో మార్పులు చేస్తున్నాం. ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అని దిల్ రాజు తెలిపారు. అనీష్ బాజ్మీ ఈ చిత్రానికి దర్శకుడు అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ తో సినిమా
అదే విధంగా ఆశిష్ తో దేత్తడి అనే చిత్రం రూపొందించబోతున్నట్లు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఉంటాయని అన్నారు. శిరీష్ మాట్లాడుతూ.. నెక్స్ట్ ఇయర్ తమ సినిమాల ప్లానింగ్ లో పవన్ కళ్యాణ్ గారి మూవీ కూడా ఉందని ప్రకటించారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు ఫైనల్ అవుతాయని అన్నారు.

