MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకి పెళ్లిళ్లు జరిగింది ఒక్క హీరోయిన్ వల్లే.. షాకింగ్ మ్యాటర్, ఆమె మాత్రం

రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లకి పెళ్లిళ్లు జరిగింది ఒక్క హీరోయిన్ వల్లే.. షాకింగ్ మ్యాటర్, ఆమె మాత్రం

ఎన్టీఆర్ 2011లో లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది అల్లు అర్జున్, స్నేహ వివాహం జరిగింది. మరుసటి ఏడాది రాంచరణ్, ఉపాసన పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. అయితే వీళ్లంతా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఒకే ఒక్క హీరోయిన్ కారణం అట.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 12 2024, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టాలీవుడ్ లో రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ముగ్గురూ టాప్ హీరోలుగా కొనసాగుతున్నారు. ముగ్గురూ పాన్ ఇండియా క్రేజ్ పై కన్నేశారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎన్టీఆర్, రాంచరణ్ కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చింది. రీసెంట్ గా విడుదలైన దేవర చిత్రంతో ఎన్టీఆర్ ఆ క్రేజ్ ని ఇంకా పెంచుకున్నారు. త్వరలో రాంచరణ్, అల్లు అర్జున్ గేమ్ ఛేంజర్, పుష్ప 2 చిత్రాలతో రాబోతున్నారు. అయితే ఈ ముగ్గురిలో షాకిచ్చే కామన్ మ్యాటర్ ఒకటుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ ముగ్గురు 2011, 2012లో పెళ్లిళ్లు చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఎన్టీఆర్ 2011లో లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది అల్లు అర్జున్, స్నేహ వివాహం జరిగింది. మరుసటి ఏడాది రాంచరణ్, ఉపాసన పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయ్యారు. అయితే వీళ్లంతా పెళ్లిళ్లు చేసుకోవడానికి ఒకే ఒక్క హీరోయిన్ కారణం అట. ఆ విషయాన్ని సదరు హీరోయినే బయటపెట్టి షాకింగ్ మ్యాటర్ రివీల్ చేసింది. ఆమె ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. 

35


తమన్నా ఏ హీరోతో నటిస్తే ఆ హీరో వెంటనే పెళ్లి చేసుకుంటున్నాడట. ఓ ఇంటర్వ్యూలో రాంచరణ్, తమన్నా పాల్గొన్నారు. ఆ సమయంలో తమన్నా ఈ విధంగా కామెంట్స్ చేసింది. చరణ్ నువ్వొకటి గమనించావా ? నేను ఎవరితో నటిస్తుంటే ఆ హీరోలకి వెంటనే పెళ్లి అయిపోతోంది అని చెప్పింది. రాంచరణ్ రియాక్ట్ అవుతూ.. అవును నువ్వు ఈ విషయాన్ని రచ్చ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడే చెప్పావు. కానీ నేను సీరియస్ గా తీసుకోలేదు. 

Also Read: నేను పాడిన పాటకి చిరంజీవి ప్రాణప్రతిష్ఠ..ఎస్పీ బాలు దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్లు ఎవరంటే, ఇప్పటి హీరోల్లో

45

రచ్చ షూటింగ్ పూర్తయ్యే లోపే అమ్మా నాన్న నాకు పెళ్లి ఫిక్స్ చేయడం ఉపాసనతో ఎంగేజ్ మెంట్ జరగడం చక చకా జరిగిపోయాయి అని రాంచరణ్ తెలిపాడు.రాంచరణ్, తమన్నా రచ్చ చిత్రంలో నటించారు. ఆ మూవీ రిలీజ్ కాగానే రాంచరణ్ పెళ్లి జరిగింది. అంతకు ముందు తమన్నా ఎన్టీఆర్ తో ఊసరవెల్లి చిత్రంలో నటించింది. ఆ చిత్ర షూటింగ్ అప్పుడే ఎన్టీఆర్ పెళ్లి జరిగింది. బద్రీనాథ్ షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ కి పెళ్లి జరిగింది. 

Also Read: అఫీషియల్..సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్', విశ్వంభర వాయిదా.. బాలయ్య X రాంచరణ్ తప్పదా..

55

అంతకు ముందు తమన్నా కార్తీతో ఆవారా చిత్రంలో నటించింది. ఆవారా రిలీజ్ అయ్యాక కార్తీ పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాలన్నీ తమన్నా గుర్తు చేసుకుంది. అయితే రాంచరణ్ తమన్నాకి ఒక సలహా ఇచ్చాడు. మీతో నటించడం వల్ల మా పెళ్లిళ్లు జరిగాయి. మీకు పెళ్లి జరగాలంటే ఒకసారి రానాతో నటించు అని చెప్పాడు. ఎందుకలా అని తమన్నా అడిగింది.. అది అంతే అంటూ చరణ్ ఫన్నీగా బదులిచ్చాడు. నాకు ఎప్పుడు పెళ్లి కావాలి అని నేను కోరుకుంటానో అప్పుడు రానాతో నటిస్తాను అంటూ తమన్నా కూడా సరదాగా చెప్పింది. అయితే తమన్నా సెంటిమెంట్ వర్కౌట్ కాని హీరోలు కూడా ఉన్నారు. ప్రభాస్, రామ్ పోతినేని లాంటి హీరోలు తమన్నాతో నటించినప్పటికీ వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. తమన్నా కూడా ఇంకా వివాహ బంధంలోకి అడుగుపెట్టలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Movies: ఓటీటీలో తప్పక చూడాల్సిన 7 డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్
Recommended image2
Jacqueliene Fernandez: కేన్స్‌లో మరోసారి జాక్వెలిన్ మాయ.. రాహుల్ మిశ్రా డ్రెస్‌లో గ్లామర్ షో
Recommended image3
Chiranjeevi: వివాదానికి తాత్కాలికంగా తెర, పెద్దికి లైన్ క్లియర్.. 2 మీటింగులతో తెగ్గొట్టేసిన చిరంజీవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved