MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అఫీషియల్..సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్', విశ్వంభర వాయిదా.. బాలయ్య X రాంచరణ్ తప్పదా..

అఫీషియల్..సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్', విశ్వంభర వాయిదా.. బాలయ్య X రాంచరణ్ తప్పదా..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 12 2024, 11:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌. ముందుగా ఈ సినిమాను డిసెంబ‌ర్‌లో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేస్తున్నారు. ఈ విష‌యంపై చిత్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు స్ప‌ష్ట‌తనిచ్చారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆయ‌న మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ప్పుడు క్రిస్మ‌స్ కంటే సంక్రాంతి అయితే బావుంటుంద‌ని నాతో పాటు  బాలీవుడ్‌, కోలీవుడ్, క‌ర్ణాట‌క‌ ఓవ‌ర్ సీస్‌లోని ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్స్ అంద‌రూ భావించాం. ఈ ఆలోచ‌న‌ను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ సంస్థ‌కు తెలియ‌జేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నామ‌ని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభ‌ర‌’ సినిమా కూడా భారీ బ‌డ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వ‌స్తున్న‌ట్లు అనౌన్స్ చేశారు. అందువ‌ల్ల సంక్రాంతి డేట్ కావాల‌ని చిరంజీవిగారిని, యువీ వారిని అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. 

35
Game Changer

Game Changer

‘గేమ్ చేంజర్’ సినిమాను సంక్రాంతికి రావ‌టానికి వాళ్ల విశ్వంభ‌ర సినిమాను మ‌రో రిలీజ్ డేట్‌కు విడుద‌ల చేయాల‌నుకున్నారు. నిజానికి విశ్వంభ‌ర సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌తో స‌హా పూర్త‌వుతుంది. అయితే నా కోసం, మా సినిమా కోసం వాళ్ల సినిమాను మ‌రో రిలీజ్ డేట్‌కు రిలీజ్ చేయ‌టానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేష‌న్స్ వంశీ, ప్ర‌మోద్‌, విక్కీకి నా ధ‌న్య‌వాదాలు. ‘గేమ్ చేంజర్’ సినిమాను సంక్రాంతి విడుద‌ల చేస్తున్నాం. ఇటు అభిమానుల‌కు, అటు సినీ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా సినిమాను తీర్చిదిద్ద‌తూ రాత్రింబ‌గ‌ళ్లు క‌ష్ట‌ప‌డుతున్నాం. ఆల్ రెడీ రెండు పాట‌లు విడుద‌లయ్యాయి. రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి.

Also Read: నేను పాడిన పాటకి చిరంజీవి ప్రాణప్రతిష్ఠ..ఎస్పీ బాలు దృష్టిలో బెస్ట్ డ్యాన్సర్లు ఎవరంటే, ఇప్పటి హీరోల్లో

 

45

 రీసెంట్‌గా వ‌చ్చిన ‘రా మ‌చ్చా మ‌చ్చా..’ యూ ట్యూబ్‌లో మారుమోగిపోతుంది. త‌ర్వాత టీజ‌ర్ వ‌స్తుంది. త‌ర్వాత మ‌రో మూడు పాట‌ల‌ను రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజ‌యం సాధించేలా ప్లాన్ చేశాం. అటు రామ్ చ‌ర‌ణ్‌గారికి గ్లోబ‌ల్ స్టార్ అనే బ్రాండ్ ఏదైతే ప‌డిందో దాన్ని.. గ్లోబ‌ల్‌గా ఈ సినిమా విజ‌యం సాధించేలా ప్ర‌య‌త్నిస్తున్నాం. ఆ ప్ర‌య‌త్నం ఫలిస్తుంది. సంక్రాంతికి క‌లుద్దాం’’ అన్నారు.

 

55

దిల్ రాజు స్వయంగా ప్రకటించడంతో గేమ్ ఛేంజర్ సంక్రాంతికి రావడం, చిరంజీవి విశ్వంభర చిత్రం వాయిదా పడడం అఫీషియల్ అయింది. విశ్వంభర వాయిదా కాకుండా ఉండిఉంటే ఈ సంక్రాంతికి చిరంజీవి వెర్సెస్ బాలయ్య పోటీ ఉండేదని అంతా భావించారు. బాలయ్య నటిస్తున్న ఎన్బీకే 109 చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు విశ్వంభర తప్పుకోవడంతో చిరు, బాలయ్య పోటీకి ఆస్కారం లేదు. కానీ గేమ్ ఛేంజర్ వస్తుండడంతో బాలయ్య, రాంచరణ్ మధ్య పోటీ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
దిల్ రాజు
Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image2
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Recommended image3
Youtuber Nandu: యూట్యూబర్ నందు నెల సంపాదన ఎంతో తెలుసా? నందూస్ వరల్డ్ క్లోజ్ అవ్వబోతోందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved