- Home
- Entertainment
- ప్రణతి అంటే చరణ్‌కి భయమట.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన ఎన్టీఆర్.. ఆ రోజు అర్థరాత్రి ఇద్దరు ఏంచేస్తారంటే?
ప్రణతి అంటే చరణ్‌కి భయమట.. షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన ఎన్టీఆర్.. ఆ రోజు అర్థరాత్రి ఇద్దరు ఏంచేస్తారంటే?
ఎన్టీఆర్, రామ్‌చరణ్ మంచి స్నేహితులు. `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాతో వీరిద్దరి స్నేహం బయటి ప్రపంచానికి తెలిసిందే. అంతేకాదు వీరిద్దిరి మధ్య స్నేహం ఎలా పుట్టింది, వీరిద్దరు అర్థరాత్రిళ్లు ఏం చేస్తారో అనేది కూడా ఎన్టీఆర్ బయటపెట్టేశాడు.

ఎన్టీఆర్(NTR), చరణ్(Ram Charan).. రాజమౌళి(Rajamouli)తో కలిసి ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్` (RRR Movie) ప్రమోషన్‌లో బిజీగా గడుపుతున్నారు. ఈ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇందులో అలియాభట్, బ్రిటీష్ నటి ఒలీవియా మోర్రీస్ కథానాయికగా నటించారు. అజయ్ దేవగన్, శ్రియా ముఖ్య పాత్రలు పోషించారు. డివివి దానయ్య దాదాపు రూ. 478కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ సినిమా ప్రమోషన్‌లో క్షణం తీరిక లేకుండా NTR, చరణ్, జక్కన్న ఉన్నారు. గ్రూప్ ఇంటర్వ్యూలు, చిట్‌చాట్‌లు చేస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. సినిమాపై అందరి అటెన్షన్‌ని గ్రాస్ప్ చేస్తున్నారు. అందుకోసం పలు ఆసక్తికర విషయాలను, కొన్ని రహస్యాలను వెల్లడిస్తుండటం విశేషం. అందులో భాగంగా ఎన్టీఆర్, Charanల మధ్య స్నేహానికి సంబంధించిన అసలు సీక్రెట్‌ని వెల్లడించారు. ఇప్పుడిది ఆసక్తిని రేకెత్తిస్తుంది.
ఇటీవల దర్శకుడు అనిల్ రావిపూడితో జరిగిన గ్రూప్ ఇంటర్వ్యూ చిట్‌చాట్‌లో ఎన్టీఆర్..తమ ఫ్రెండ్‌షిప్ సీక్రెట్‌ని రివీల్ చేశాడు. అంతేకాదు తన భార్య ప్రణతి అంటే రామ్‌చరణ్ భయపడతాడనే విషయాన్ని కూడా ఆయన బోల్డ్ గా చెప్పేయడం హాట్ టాపిక్ అవుతుంది. చరణ్, తాను భిన్నమైన మనస్తత్వాలు కలిగిన వాళ్లమన్నారు. ఇలాంటి వాళ్ల మధ్యే స్నేహం బలంగా ఉంటుందని చెప్పారు తారక్.
ఇంకా చెబుతూ, భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయంటారు. అలా తమ విషయంలో జరిగిందని, అగ్ని పర్వతం బద్దలైపోతున్నా చరణ్ చాలా కామ్‌గా, కూల్‌గా ఉంటాడని, ప్రతి ఎమోషన్ తనలో దాచుకుంటాడని తెలిపారు. చరణ్‌లో ఉండే ఆక్వాలటీ తనకు బాగా నచ్చిందట. అలా చరణ్‌తో స్నేహం ఏర్పడిందని చెప్పారు. అప్పట్లో స్టార్ క్రికెట్ పోటీ జరుగుతుండేవని, తాను, చరణ్ కలిసి రాత్రిళ్లు వెళ్లేవాళ్లమని తెలిపారు తారక్.
అలా వెళ్లి కలిసి చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లమని, ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం జరిగింది. అలా తెలియకుండానే తమ మధ్య బలమైన స్నేహం ఏర్పడిందని చెప్పారు ఎన్టీఆర్. ఆ స్నేహం ఎంతలా బలపడిందో ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. మార్చి 26 తన భార్య లక్ష్మీ ప్రణతి పుట్టిన రోజు. ఆ రోజు భార్యతో సెలబ్రేట్ చేసుకునవాళ్లట. ఆ రోజు అర్థరాత్రి అయ్యిందంటే చాలు ఇంటి బయట చరణ్ కారు రెడీగా ఉండేదట. సైలెంట్‌గా ఇంట్లో నుంచి తారక్ వెళ్లిపోయేవాడని, ఇలా చాలా సార్లు జరిగిందని చెప్పాడు తారక్.
ఆ అర్థరాత్రి చరణ్ పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకునేవాళ్లమని, ఎంజాయ్ చేసేవాళ్లమని చెప్పాడు ఎన్టీఆర్. అయితే ఆ వెంటనే తన భార్య ప్రణతి నుంచి ఫోన్ వచ్చేదట. మార్చి 26 అయిపోయింది కదా అని తాను చెప్పేవాడట. అయితే తన ఇంటి గేట్ వద్ద ప్రణతి ఉంటుందేమో అని రామ్‌చరణ్ భయపడేవాడట. ఇది చాలా ఫన్నీ మూవ్‌మెంట్స్ అని తెలిపారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన చెప్పిన ఈ విషయాలు ఇద్దరు హీరోల అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు ఫ్యాన్స్ మధ్య కూడా ఈ దెబ్బతో స్నేహం మరింత బలపడుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఇక సినిమా విడుదలకు వారం రోజులే ఉంది. దీంతో పక్కా ప్లానింగ్‌తో ప్రమోషన్ జోరు పెంచింది `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్. శుక్రవారం దుబాయ్‌లో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. `ఎక్స్ పో 2020 దుబాయ్` పేరుతో దుబాయ్‌లో ఈవెంట్ జరుగుతుంది. ఇప్పటికే రాజమౌళి, తారక్, చరణ్‌లో దుబాయ్‌కి చేరిపోయారు. ఇక రేపు(మార్చి 19) సాయంత్రం కర్నాటకలోని చిక్కాబల్లాపూర్‌లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. ఆ తర్వాత దేశంలోని తొమ్మిది మెయిన్ సీటీస్‌ని ఈ బృందం కవర్ చేయబోతుంది.