Ram Charan: చిరంజీవి హీరోయిన్ పై రాంచరణ్ క్రష్.. ఆమెపై అంత ఇష్టం ఎందుకంటే..
మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. రాంచరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

Ram Charan
మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒకవైపు ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. రాంచరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇంతకు మించిన బర్త్ డే గిఫ్ట్ రాంచరణ్ కి మరొకటి ఉండదు. చిరుత చిత్రంతో టాలీవుడ్ లో మెగా వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు.
Ram Charan
ఒక్కో మెట్టు ఎదుగుతూ బాక్సాఫీస్ వద్ద తన చిత్రాలతో రికార్డులు సృష్టించే స్థాయికి చరణ్ చేరుకున్నాడు. రాంచరణ్ బర్త్ డే కావడంతో అతడి కెరీర్ గురించి విశేషాలని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సందర్భం చిక్కినప్పుడల్లా చరణ్ తన తండ్రి చిరంజీవి నటించిన చిత్రాల గురించి చెబుతుంటారు.
Ram Charan
రాంచరణ్ కి బాగా నచ్చిన చిరంజీవి మూవీ విజేత అట. ఆ చిత్రం అంటే తనకు చాలా ఇష్టం అని రాంచరణ్ పలు సందర్భాల్లో తెలిపాడు. అలాగే నచ్చని మూవీ కూడా ఉంది. అదేంటంటే.. చిరంజీవి కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచిన బిగ్ బాస్. అలాగే చిరంజీవి నటించిన చిత్రాల్లో రుద్రవీణ అంటే కూడా రాంచరణ్ కి బాగా ఇష్టం.
Ram Charan
చిరంజీవితో అధిక చిత్రాల్లో నటించిన సీనియర్ హీరోయిన్ రాధపై రాంచరణ్ కి క్రష్ ఉందట. ఈ విషయాన్ని రాంచరణ్ కెరీర్ బిగినింగ్ లో తెలిపాడు. చిన్నతనంలో నాన్నగారు, రాధ నటించిన సినిమాలు విపరీతంగా చూసేవాడట. పైగా వాళ్ళిద్దరిదీ సూపర్ హిట్ పెయిర్ కావడంతో సహజంగానే రాంచరణ్ కి రాధ అంటే ఇష్టం ఏర్పడింది.
Ram Charan
యముడికి మొగుడు, కొండవీటి దొంగ, దొంగ, కొదమసింహం లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో చిరంజీవి, రాధ జంటగా నటించారు. ఇక రాంచరణ్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్ర సీక్వెల్ లో నటించాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
Ram Charan
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం ఒక దృశ్య కావ్యంలా నిలిచింది. చిరంజీవి కూడా ఒక సందర్భంలో ఆ చిత్రానికి రాంచరణ్ సీక్వెల్ చేస్తే బావుంటుందని అన్నారు.