- Home
- Entertainment
- అయ్యప్ప దీక్ష పూర్తి చేసిన చరణ్.. సిద్ధివినాయక టెంపుల్ లో గ్లోబల్ స్టార్ ప్రత్యేక పూజలు
అయ్యప్ప దీక్ష పూర్తి చేసిన చరణ్.. సిద్ధివినాయక టెంపుల్ లో గ్లోబల్ స్టార్ ప్రత్యేక పూజలు
అయ్యప్ప మాల విమరణ కోసం నిన్ననే ముంబైకి చేరుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ఈ రోజు ప్రసిద్ధ సిద్ధివినాయక టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేశారు. చరణ్ కోసం అభిమానులు ఆలయం వద్దకు చేరుకొని సందడి చేశారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హిందూ సంప్రదాయాలను, ఆచారాలను ఎంతలా పాటిస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి పండగను సెలబ్రేట్ చేసుకుంటుంటారు. రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి వినాయక చవితిని జరుపుకున్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా చరణ్ ముంబైలోని శ్రీ సిద్ధివినాయక టెంపుల్ (Siddhivinayak Temple) ను సందర్శించారు. నిన్ననే ముంబైకి చేరుకున్న చెర్రీ ఈరోజు ఉదయం వినాయక దేవాలయంలో తన అయ్యప దీక్షను పూర్తి చేశారు. దీక్ష విరమణ కోసమే ముంబైకి వెళ్లారు.
ఈరోజు ఉదయం సిద్ధివినాయకుడికి చరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందారు. అర్చకులు చరణ్ కు ప్రత్యేక పూజలతో దేవుడి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో చరణ్ అయ్యప్ప మాలలో కనిపించిన ఫొటోలు వైరల్ గా మారాయి.
చరణ్ కొన్నేళ్లుగా అయ్యప్ప మాలను ప్రతియేటా తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీక్ష స్వీకరించిన రోజుల్లో చాలా నియమనిష్టలతో ఉంటారు. మాలలోనే సినీ ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు హాజరై హిందూ సంప్రదాయాలకు మరింత గౌరవం వచ్చేలా చేస్తున్నారు.
ఈరోజుతో శ్రీ సిద్ధివినాయక ఆలయంలో అయ్యప్ప దీక్షను ముగించారు. చరణ్ ఆధ్యాత్మిక ప్రయాణం.. దేవుడిపై ఆయనకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి, నిబద్ధతకు నిదర్శనమని తెలియజేస్తోంది. చివరిగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సమయంలోనూ అయ్యప్ప దీక్షను ఆచరించారు రామ్ చరణ్.
ఈఏడాది కుమార్తె క్లిన్ కారా పుట్టడం, కెరీర్ లోనూ చరణ్ పీక్స్ కు వెళ్లడం, కఠిన నియమాలతో ఆధ్యాత్మిక బాటలో పయనిస్తుండటంతో అభిమానులు సంతోషిస్తున్నారు. ఇక రామ్ చరణ్ రాకాతో సిద్ధివినాయక టెంపుల్ వద్ద అభిమానులు సందడి చేశారు. సెల్ఫీల కోసం ప్రయత్నించారు. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలోని ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘ఉప్పెన’ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ16లో నటించనున్నారు.