ఘనంగా శర్వానంద్ పెళ్లి వేడుక, బెస్ట్ ఫ్రెండ్ రాంచరణ్ సందడి.. ఫొటోస్ వైరల్
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ ఒకరు. శర్వానంద్ తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెబుతూ ప్రస్తుతం ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే.
- FB
- TW
- Linkdin
Follow Us
)
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో హీరో శర్వానంద్ ఒకరు. శర్వానంద్ తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెబుతూ ప్రస్తుతం ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన రక్షిత రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో శర్వానంద్ వివాహం జరుగుతోంది. శర్వానంద్, రక్షిత పెళ్లి వేడుకలు జైపూర్ లో ఘనంగా జరుగుతున్నాయి.
సంగీత్, హల్దీ వేడుకల్లో శర్వా, రక్షిత హుషారుగా డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శర్వానంద్ తన వివాహ వేడుకకి టాలీవుడ్ నుంచి చాలా మంది సెలెబ్రిటీలని ఆహ్వానించారు. పొలిటీషియన్స్ కి కూడా ఆహ్వానాలు అందాయి. తాజాగా శర్వానంద్ పెళ్ళిలో అతని బెస్ట్ ఫ్రెండ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హాజరయ్యారు.
ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాంచరణ్ తో పాటు ఈ పెళ్లి వేడుకకి అఖిల్ అక్కినేని, రానా దగ్గుబాటి కూడా హాజరైనట్లు తెలుస్తోంది. రాంచరణ్, శర్వానంద్ చిన్ననాటి నుంచి క్లాస్ మేట్స్. ఆ విధంగా వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు.
ఇదిలా ఉండగా 38 ఏళ్ల శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతుండడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల క్రితమే శర్వానంద్, రక్షితలకు నిశ్చితార్థం జరిగింది. అప్పుడు కూడా రాంచరణ్ ఉపాసనతో కలసి హాజరయ్యాడు.
రక్షిత రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వర్క్ చేస్తోంది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా శర్వానంద్ కి రక్షితతో పరిచయం ఏర్పడిందట. అభిప్రాయాలు కలవడంతో ఫ్రెండ్ షిప్ మొదలుపెట్టి ప్రేమికులుగా మారారు.
ఆమె తండ్రి తెలంగాణ హైకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నారు. అలాగే ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డికి మనవరాలు. మొత్తానికి శర్వానంద్ బలమైన బ్యాగ్రౌండ్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోబోతున్నాడు.