- Home
- Entertainment
- నరేంద్ర మోదీతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. ఆర్చరీకి బ్రాండ్ అంబాసిడర్ గా సరైనోడు, ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్
నరేంద్ర మోదీతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. ఆర్చరీకి బ్రాండ్ అంబాసిడర్ గా సరైనోడు, ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్
అర్చరీ ప్రీమియర్ లీగ్ విజయాన్ని పురస్కరించుకొని రామ్ చరణ్, ఉపాసన ప్రధానమంత్రి మోదీని కలిశారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కి రాంచరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీతో రామ్ చరణ్ భేటీ
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని భేటీ అయ్యారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించిన అర్చరీ ప్రీమియర్ లీగ్ (APL) విజయవంతం కావడంతో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా చరణ్, ఉపాసన మోదీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ప్రపంచంలో తొలిసారిగా ప్రారంభమైన అర్చరీ ప్రీమియర్ లీగ్ కుప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. రామ్ చరణ్ ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసడర్గా వ్యవహరించారు. మొదటి ఏడాదిలోనే ఈ క్రీడా ఈవెంట్ విజయవంతమవడం గమనార్హం.
ప్రపంచ స్థాయికి భారతీయ ఆర్చరీ
ఈ సందర్భంగా రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలు షేర్ చేస్తూ, "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి క్రీడలపై ఉన్న అభిరుచి, ప్రోత్సాహం భారతీయ అర్చరీ వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు సహాయపడుతుందని" అన్నారు. అలాగే ఈ లీగ్‌లో పాల్గొన్న అన్ని క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలిపారు. చరణ్ మాట్లాడుతూ, భారతదేశం క్రీడా రంగంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నదని, ఈ తరహా కార్యక్రమాలు కొత్త తరానికి స్పూర్తినిస్తాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీ ఈ సమావేశంలో అర్చరీ క్రీడా ప్రాధాన్యంపై చర్చించారని, భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం అందించాలనే సంకల్పాన్ని వ్యక్తపరిచారని సమాచారం.
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చరణ్
అర్చరీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్ విజయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. భారత క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో పోటీపడటానికి ఇది ఒక వేదికగా నిలిచిందని విశ్లేషకులు భావిస్తున్నారు. వ్యక్తిగతంగా రామ్ చరణ్ తన బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. క్రీడా ప్రోత్సాహం, యువతలో స్పోర్ట్స్ స్పిరిట్ పెంపు వంటి అంశాలపై చరణ్ ఎల్లప్పుడూ సానుకూలంగా స్పందిస్తుంటారు.
ఫ్యాన్స్ క్రేజీ రియాక్షన్
ప్రధాని నరేంద్ర మోదీతో రామ్ చరణ్ భేటీ కావడం పట్ల అభిమానులు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ కి సరైనోడిని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేశారు అని ప్రశంసిస్తున్నారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి పాత్రలో విలుకాడిగా యాక్షన్ సీన్స్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
పెద్ది సినిమాతో బిజీగా చరణ్
ఇక రామ్ చరణ్ ప్రొఫెషనల్ ఫ్రంట్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన పెద్ది అనే గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పుణేలో జరుగుతోంది, ఇందులో చరణ్–జాన్వీపై ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.