- Home
- Entertainment
- సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు కోసం చేసిన చివరి ప్రయత్నం ఏంటో తెలుసా, చంద్రబాబు దగ్గరకి మ్యాటర్
సూపర్ స్టార్ కృష్ణ తన కొడుకు కోసం చేసిన చివరి ప్రయత్నం ఏంటో తెలుసా, చంద్రబాబు దగ్గరకి మ్యాటర్
సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఒక సినిమా వ్యవహారం అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు వరకు వెళ్ళింది. ఆ సినిమా ఏంటి ? కృష్ణ తన కొడుకు కోసం చేసిన ప్రయత్నం ఏంటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ కృష్ణ సినిమాలు
సూపర్ స్టార్ కృష్ణ 350 పైగా చిత్రాల్లో నటించారు. సినిమా కోసం సూపర్ స్టార్ కృష్ణ చేసినన్ని సాహసాలు ఇంకెవరూ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో గొప్ప చిత్రాలని సూపర్ స్టార్ కృష్ణ అందించారు. కృష్ణ తన ఇద్దరు కొడుకులు రమేష్ బాబు, మహేష్ బాబులని నటులుగా తీర్చిదిద్దారు. మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు.
డైరెక్టర్ ఎన్ శంకర్ కామెంట్స్
రమేష్ బాబు మూడేళ్ళ క్రితం అనారోగ్యంతో మరణించారు. రమేష్ బాబు 80, 90 దశకాల్లో హీరోగా రాణించారు. కొన్ని చిత్రాల్లో నటించారు. కానీ రమేష్ బాబు నటించిన ప్రతి చిత్రం డిజాస్టర్ అవుతుండడంతో ఆయనకి సినిమా పట్ల విరక్తి కలిగింది. అందుకే సినిమాలు పూర్తిగా వదిలేశారు. దర్శకుడు ఎన్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ, రమేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కృష్ణతో ఎన్‌కౌంటర్ మూవీ
ఎన్‌కౌంటర్ అనే టైటిల్ తో కృష్ణ గారికి కథ చెప్పడానికి వెళ్ళాను. కృష్ణ గారు 2 గంటల పాటు కథ విని చాలా బావుంది అన్నారు. నేను ఈ సినిమా చేస్తున్నాను. షూటింగ్ కి అంతా రెడీ చేసుకోండి అని చెప్పారు. ఈ మూవీలో వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, రాధిక, రోజా కీలక పాత్రల్లో నటించారు. కృష్ణ తనయుడు రమేష్ బాబు కూడా ఓ పాత్రలో నటించారు. ఆ పాత్ర కోసం ముందుగా వేరే నటుడిని అనుకున్నాం. కానీ కృష్ణ గారు తన కొడుకు రమేష్ బాబుని అడగమని చెప్పారు. రమేష్ ని ఒకసారి అడగండి. రమేష్ సినిమాలు వదిలేయాలని అనుకుంటున్నాడు.
కొడుకు కోసం కృష్ణ చేసిన చివరి ప్రయత్నం
ఇది రమేష్ కి లాస్ట్ మూవీ అయితే బావుంటుంది అని నా ఫీలింగ్. ఒక వేళ ఈ మూవీ సూపర్ హిట్ అయితే రమేష్ మళ్ళీ సినిమాలు తిరిగి ప్రారంభిస్తాడేమో. అప్పుడు ఇంకా హ్యాపీ అని కృష్ణ తనతో చెప్పినట్లు ఎన్ శంకర్ గుర్తు చేసుకున్నారు. కృష్ణ కోరిక మేరకు ఎన్ శంకర్ వెళ్లి.. రమేష్ బాబుని అడగడం, దానికి ఆయన అంగీకరించడం జరిగింది. రమేష్ బాబు ఎన్‌కౌంటర్ చిత్రంలో నటించడానికి ఒప్పుకోవడంతో కృష్ణ గారిలో పట్టలేని సంతోషం కనిపించింది. కృష్ణ గారు రమేష్ బాబు కెరీర్ కోసం చేసిన చివరి ప్రయత్నం ఇదే.
షూటింగ్ లొకేషన్స్ ఇవే
నటీనటులంతా ఎంపిక కావడంతో షూటింగ్ మొదలు పెట్టాం. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా ఫారెస్ట్ లోనే ఉంటుంది. దీని కోసం వికారాబాద్, హార్సిలీ హిల్స్, మదనపల్లె, భద్రాచలం, మోతుగూడెం లాంటి అటవీ ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరిపాం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో, విప్లవాత్మక కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అప్పట్లో 1996, 97లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉంది. మేము షూటింగ్ జరిపిన లొకేషన్స్ కూడా నక్సలైట్లు ఎక్కువగా తిరిగే ప్రాంతాలే.
చంద్రబాబు వద్దకు కృష్ణ
దీనితో అప్పటి డీజీపీ స్థాయి వ్యక్తులు మా సినిమా షూటింగ్ పై ఇంటెలిజెన్స్ నిఘా పెట్టారు. ఒకసారి షూటింగ్ కి వస్తున్న రమేష్ బాబు కారుని పోలీసులు ఆపేశారు. షూటింగ్ ఎక్కడ జరుగుతోంది, నటీనటులు ఎవరెవరు వచ్చారు అనే వివరాలు ప్రతి రోజూ ఇంటెలిజెన్స్ ద్వారా డీజీపీ టేబుల్ పైకి వెళ్ళేవి. ఈ విషయం సూపర్ స్టార్ కృష్ణ గారికి తెలిసింది. దీనితో కృష్ణ గారు నేరుగా అప్పటి సీఎం చంద్రబాబుని కలిశారు. ఇంటెలిజెన్స్, పోలీసులు తమ సినిమాపై నిఘా పెట్టారు అనే విషయాన్ని చంద్రబాబుకి తెలిపారు. దీనితో చంద్రబాబు.. అదేం పర్వాలేదు సర్.. మీరు హ్యాపీగా షూటింగ్ చేసుకోండి, అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని కృష్ణతో చెప్పినట్లు ఎన్ శంకర్ తెలిపారు. మొత్తంగా ఎన్‌కౌంటర్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని 1997లో రిలీజ్ అయింది. రమేష్ బాబు ఎన్‌కౌంటర్ మూవీ తర్వాత మళ్ళీ నటించలేదు.