- Home
- Entertainment
- ప్రియుడితో క్లోజ్డ్ ఫోటో పంచుకుంటూ `స్పెషల్ వాలెంటైన్స్ డే` ప్రకటించిన రకుల్.. పోస్ట్ వైరల్
ప్రియుడితో క్లోజ్డ్ ఫోటో పంచుకుంటూ `స్పెషల్ వాలెంటైన్స్ డే` ప్రకటించిన రకుల్.. పోస్ట్ వైరల్
రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగులో ఓ ఊపు ఊపేసిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్‌లో రచ్చ లేపుతుంది. తన అందాల విందుతో నార్త్ ఆడియెన్స్ కి సరికొత్త ట్రీట్‌నిస్తుంది.

రకుల్ తన ప్రియుడిని ఫోటోని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ఈ వాలెంటైన్స్ డే తనకు చాలా స్పెషల్ అని ప్రకటించింది. రకుల్ ప్రేమలో పడిన తర్వాత వస్తోన్న మొదటి వాలెంటైన్స్ డే కావడంతో చాలా స్పెషల్‌గా భావిస్తుంది రకుల్. అంతేకాదు ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తుంది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రేమికుల రోజుల సందర్భంగా స్పందించింది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు వాలెంటైన్స్ డే విషెస్ తెలిపింది. ఈ సందర్భంగా ఆమె తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోని పంచుకోవడం విశేషం. అంతేకాదు బ్లాక్ అండ్‌వైట్‌లోనూ తన హాట్ ఫోటోని షేర్ చేసింది. దీంతో ఆమె పోస్ట్, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సందర్భంగా తన ప్రియుడు జాకీ భగ్నాని తనకు చాలా స్పెషల్ అని పేర్కొంది. అంతేకాదు ఈ సందర్భంగా తన వర్క్ ఏరియాలోని ఇష్టమైన వారితో, అలాగే ఫుడ్ విషయంలో కలిసొచ్చే ఫ్రెండ్స్ తో ఫోటోలను పంచుకుంటూ వాలెంటైన్స్ డే విషెస్ తెలిపింది రకుల్.
మరోవైపు ఆమె పంచుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటో సైతం వైరల్‌గా మారింది. ఇందులో చాలా హాట్‌గా కనిపిస్తుంది రకుల్. ఈ సందర్భంగా రకుల్ చెబుతూ, `మీరు నిజమైన వ్యక్తిగా జన్మించారు. కానీ పరిపూర్ణంగా ఆలింగనం చేసుకోలేరు. మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీకు మీరు విలువిచ్చుకోండి. అందరికి ప్రేమికులందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు` అని తెలిపింది రకుల్.
రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీ అయిపోయింది. తెలుగులో ఆల్మోస్ట్ సినిమాలు తగ్గించేసింది. హిందీలో అరడజను చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అవి అన్ని చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్ల ప్రారంభమయితే ఈ ఏడాది వరుసగా దాదాపు ఆరు చిత్రాలతో రకుల్ సందడి చేయబోతుంది.
అందులో `ఎటాక్`, `రన్‌వే34`, `డాక్టర్ జీ`, `థ్యాంక్ గాడ్`, `మిషన్ సిండెరెల్లా`, `చట్రివాలి` చిత్రాలున్నాయి. మరోవైపు తమిళంలో `అయలాన్` అనే సినిమా విడుదలకు రెడీగా ఉంది.