పవన్ హీరోయిన్లు వీరేః క్రిష్ సినిమాలో నిధి, ప్రభాస్ బ్యూటీ.. రీమేక్‌లో సినిమాలో రకుల్
పవన్ కళ్యాణ్ సరసన నటించే హీరోయిన్ల విషయంలో నెమ్మదిగా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం ఆయన క్రిష్ చిత్రంలో, అలాగే `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో నటిస్తున్నారు. ఇందులో నటించే హీరోయిన్లు ఖరారైనట్టు సమాచారం. నిధి అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేర్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం పవన్ `వకీల్‌సాబ్`ని పూర్తి చేసుకుని `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే పవన్ షూటింగ్‌లో పాల్గొనగా, నిన్న(గురువారం)రానా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.
ఇందులో హీరోయిన్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. ఇందులో రానాకి జోడిగా సాయిపల్లవి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే పవన్ కి జోడిగా రకుల్ ప్రీత్ సింగ్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. దాదాపు కన్ఫమ్ అనే వార్త వినిపిస్తుంది.
దీంతోపాటు క్రిష్ చిత్రంలో హీరోయిన్లు కూడా ఫైనల్ అయ్యారట. ఓ హీరోయిన్‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ, ప్రభాస్ ఐటెమ్ భామ జాక్వెలిన్‌ని ఫైనల్ చేశారట. ఈ అమ్మడు ప్రభాస్ నటించిన `సాహో`లో ఐటెమ్ సాంగ్‌లో మెరిసిన విషయం తెలిసిందే.
మరో హీరోయిన్ కూడా ఉందట. ఆ పాత్ర కోసం `ఇస్మార్ట్` హీరోయిన్ నిధి అగర్వాల్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ ముగ్గురు హీరోయిన్లు దాదాపుగా ఖరారైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ బందిపోటు పాత్రలో కనిపిస్తాడు. వజ్రాల దొంగగా కనిపిస్తాడని టాక్. కెరీర్‌లో పవన్ చేస్తున్న తొలి పీరియాడికల్ మూవీ.
ఇదిలా ఉంటే నిధి అగర్వాల్ `ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో విజయాన్ని అందుకుని వరుసగా భారీ ఆఫర్స్ ని దక్కించుకుంటుంది. ఇప్పటికే ఈ అమ్మడు తమిళంలో రెండు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.
శింబుతో `ఈశ్వరన్`, జయంరవితో `భూమి` చిత్రాల్లో నటించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాలు ఆకట్టుకున్నాయి. ఇందులో నిధికి మంచి పేరు వచ్చింది.
ఎప్పుడు హాట్ అందాలతో కుర్రకారుకి మత్తెక్కించే ఈ అమ్మడు సైలెంట్ భారీ ఆఫర్స్ కొట్టేస్తూ దూసుకుపోతుంది.
ఇప్పుడు పవన్‌తో ఆఫర్ కొట్టేసిందంటే ఈ బ్యూటీ రేంజ్ మారిపోయినట్టే అని చెప్పొచ్చు. సినిమా విజయం సాధిస్తే స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోయింది.
మరోవైపు ప్రస్తుతం నిధి.. అశోక్ గల్లా హీరోగా రూపొందే చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. రవితేజతోనూ `ఖిలాడి`లో మెరవనున్నట్టు సమాచారం.