ట్రెడిషనల్ వేర్ లో రకుల్ బ్యూటీఫుల్ లుక్స్.. లెహంగా వోణీలో స్టార్ హీరోయిన్ అందాల విందు.!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) బ్యాక్ టు బ్యాక్ ట్రెడిషన్ లుక్ లో అభిమానులతో పాటు నెటిజన్లను ఫిదా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కొన్నాళ్ల పాటు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి ఊపూపింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే.
మరోవైపు సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. సినిమాల బిజీ నుంచి ఇప్పుడిప్పుడే కాస్తా ఫ్రీ అయిన రకుల్ బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెటిజన్లను అలరిస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. గ్లామర్ ఫొటోలలో అదరగొడుతోంది.
తాజాగా ఈ బ్యూటీ మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుంది. ట్రెడిషనల్ లుక్ లో అందాలు ఆరబోసింది. సంప్రదాయ దుస్తుల్లో వెడ్డింగ్ సీజన్ ను మరింత గ్రాండ్ గా చేసింది. ఒంపుసొపుల్ని ప్రదర్శిస్తూ కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది.
పింక్ లెహంగా వోణీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి గ్లామర్ విందు చేసింది. బ్యూటీఫుల్ ఫ్లవర్ డెకరేషన్స్ మధ్య విరబూసిన సన్నజాజిలా ఆకట్టుకుంటోంది. మరోవైపు వోణీ తీసేసి టాప్ గ్లామర్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ ను ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు.
ప్రతి విషయాన్ని తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుున్న రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది. 16 ఏండ్లుగా తమ ఇంట్లో పెరిగిన పెట్ డాగ్ నిన్న మరణించింది. దీంతో కాస్తా ఎమోషనల్ అయ్యింది. తనమీద ఉన్న ప్రేమను భావోద్వేగ భరితంగా వెల్లడించింది.
ఇటు కేరీర్ తో పాటు అటు పర్సనల్ లైఫ్ ను కూడా ఎంజాయ్ చేస్తోంది. తన ప్రియుడు జాక్నీ భగ్నానీతో డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ ను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం రకుల్ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’లో నటిస్తోంది.