Rakul Yoga Poses : రకుల్ ప్రీత్ నుంచి తప్పకుండా నేర్చుకోవాల్సిన విషయం.. స్టార్ హీరోయిన్ డెడికేషన్ చూశారా!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు. ఇంట్రెస్టింగ్ పోస్టులు పెడుతూ తన అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటారు. తాజాగా మరో పోస్ట్ పెట్టారు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో బడా హీరోల సరసన నటించి మెప్పించింది. తనదైన శైలిని నటనరంగంలో చూపింది.
స్టార్ హీరోలకు జోడీగా నటించిన రకుల్ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది. సౌత్ తోపాటు నార్త్ లోనూ వరుస సినిమాలు చేసి అదరగొట్టింది. సినిమా ఫలితాలు ఎలా ఉన్నా.. తనమార్క్ మాత్రం చూపించింది. మంచి క్రేజ్ దక్కించుకుంది.
రకుల్ ప్రీత్ కూడా తన అభిమానులకు సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటుంది. నెట్టింట ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. కొన్ని పోస్టులతో తన అభిమానులతో పాటు నెటిజన్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది. అదేంటంటే...
రకుల్ ప్రీత్ వర్కౌట్స్ విషయంలో ఎంత డెడికేషన్ గా ఉంటారో తెలిసిందే. ప్రతిరోజూ ఫిజికల్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫొటోలను, స్టిల్స్ ను అభిమానులతో పంచుకుంటూ వారిలోనూ ఫిట్ నెస్ పై ఆసక్తిని పెంచుతుంటారు.
అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇతర హీరోయిన్ల కంటే కాస్తా ఎక్కవగానే జిమ్ లో సమయం గడుపుతుంటారు. ఇక తాజాగా యోగాసనాలతో దర్శనం ఇచ్చింది. శరీరాన్ని విల్లులా వంచుతూ ఆకట్టుకుంది. మరోవైపు ఫిట్ నెస్, జిమ్, యోగా చేయాలనుకునే వారికి ఇలా పాఠాలు నేర్పుతోంది. స్ఫూర్తిని నింపుతోంది.
ప్రస్తుతం రకుల్ ప్రీత్ మళ్లీ సౌత్ లో సందడి చేస్తోంది. రీసెంట్ గా తమిళ చిత్రం ‘ఆయలాన్’ Ayalaan తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. నెక్ట్స్ ‘ఇండియన్ 2’తో అలరించబోతోంది.