MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టయిల్‌ కా బాప్‌ అంటోన్న రకుల్ ప్రీత్ సింగ్‌.. ప్రియుడు వచ్చాక జోరు మామూలుగా లేదుగా..

స్టయిల్‌ కా బాప్‌ అంటోన్న రకుల్ ప్రీత్ సింగ్‌.. ప్రియుడు వచ్చాక జోరు మామూలుగా లేదుగా..

రకుల్ ప్రీత్‌ సింగ్‌.. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇటీవల తెలుగు సినిమాలు తగ్గించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. మరోవైపు త్వరలో పెళ్లికి సిద్ధమవుతుంది. ఇటీవల తన ప్రియుడిని పరిచయం చేసి ఫ్యాన్స్ ని సర్‌ప్రైజ్‌ చేసిన విషయం తెలిసిందే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 02 2021, 09:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

రకుల్‌ ప్రీత్‌సింగ్‌(Rakul Preet Singh) దాదాపు పదేళ్లపాటు ఆడియెన్స్ ని అలరిస్తుంది. గ్లామర్‌తో మైమరపిస్తుంది. ముఖ్యంగా కమర్షియల్‌ సినిమాలకు బెస్ట్ ఆప్సన్‌గా నిలిచిన రకుల్ కి సక్సెస్‌లు తగ్గిపోయాయి. అదే సమయంలో ఆమె తెరపై కనిపించిన సందర్భాలు కూడా చాలా తక్కువే. కేవలం లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించడంతో అవకాశాలు తగ్గిపోయాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

దీంతో బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టింది రకుల్‌. అక్కడ బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూసుకుపోతుంది. అయితే అక్కడ కూడా రకుల్ కి సక్సెస్‌ ఆమడ దూరంగా ఉండిపోతున్నాయి. ఇటీవల ఆమె నటించిన `మర్జావాన్‌`, `సిమ్లా మిర్చి`, `సర్దార్‌ కా గ్రాడ్సన్‌` చిత్రాలు పరాజయం చెందాయి. ప్రస్తుతం ఐదు హిందీ సినిమాల్లో నటిస్తుంది Rakul Preet Singh. ఈ సినిమాల రిజల్ట్ రకుల్‌ కెరీర్‌ ఆధారపడి ఉందని చెప్పొచ్చు. 

37

ఇదిలా ఉంటే ఇటీవల తన ప్రియుడిని అనౌన్స్ చేసి షాక్‌ ఇచ్చింది రకుల్. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానితో ప్రేమలో ఉన్నట్టు వెల్లడించింది. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా టైమ్స్ ఫ్రెష్‌ ఫేస్‌ సీజన్‌ 13 నేషనల్‌ గ్రాండ్‌ ఫినాలేలో పాల్గొంది. 
 

47

ముంబాయిలో సోమవారం సాయంత్రం ఈ ఈవెంట్‌ జరగ్గా ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పాల్గొని సందడి చేశారు. అంతేకాదు ఈ ఈవెంట్‌కి జడ్జ్ గా వ్యవహించింది. ఫైనలిస్ట్ ని నిర్ణయించింది. అయితే ఇందులో రకుల్‌ లుక్ మాత్రం హైలైట్‌గా నిలిచింది. ఆమె టాప్‌ టూ బాటమ్‌ రెడ్‌ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలిచింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. 

57

టైమ్స్ ఫ్రెష్‌ ఫేస్‌ సీజన్‌ 13 నేషనల్‌ గ్రాండ్‌ ఫినాలేలో ఫోటోలకు పోజులిచ్చింది రకుల్‌. ఫస్ట్ రన్నర్స్‌ అప్‌ దిగ్వేజ్‌ మోర్, అక్షిత, సెకండ్‌రన్నరప్‌ క్రిష్ణ, అంచల్‌లతో కలిసి రకుల్‌ ఫోజులిచ్చింది. ఫ్రెష్‌ ఫేస్‌లను మించిన అందంతో అందరిని కట్టిపడేసింది. ఆయా పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కంటెస్టెంట్లు కూడా రకుల్‌ ఫ్యాషన్‌కి ఫిదా అయిపోవడం విశేషం. 

67

రకుల్‌ చివరగా తెలుగులో `చెక్‌` చిత్రంలో నటించింది. నితిన్‌ హీరోగా, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మరో కథానాయికగా నటించిన ఈ చిత్రానికి చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పరాజయం చెందింది. దీంతో మళ్లీ మరే తెలుగు సినిమాకి కమిట్‌ కాలేదు రకుల్‌. కానీ ప్రస్తుతం `అక్టోబర్‌ 31 లేడీస్‌ నైట్‌` అనే తెలుగు, తమిళం బైలింగ్వల్‌ చిత్రం చేస్తుంది. 
 

77

ఇక హిందీలో ఏకంగా ఐదు సినిమాలు చేస్తుంది. `ఎటాక్‌`, `మేడే`, `థ్యాంక్‌ గాడ్‌`, `డాక్టర్‌ జీ`, `మిషన్‌ సిండెరెల్లా` చిత్రాలు చేస్తుంది. ఈ సినిమాలన్నీ భారీ కాస్టింగ్‌తో, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రాలు కావడం విశేషం. వీటితో రకుల్‌ కెరీర్‌ మరో మలుపు తీసుకోబోతుందని చెప్పొచ్చు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved