- Home
- Entertainment
- Rakul Stunning Photos: క్లీవేజ్ అందాలతో రచ్చ లేపుతున్న రకుల్.. తాజ్ మహల్ అందాల చాటున కిర్రాక్ పోజులు
Rakul Stunning Photos: క్లీవేజ్ అందాలతో రచ్చ లేపుతున్న రకుల్.. తాజ్ మహల్ అందాల చాటున కిర్రాక్ పోజులు
రకుల్ తెలుగులో సినిమాలు చేయకపోయినా ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ అలరిస్తూనే ఉంది. తన గ్లామర్ ఫోటోలతో నిత్యం వారిని ఖుషీ చేస్తూనే ఉంది. ఇప్పుడు ఆమె పంచుకున్న స్టన్నింగ్ ఫోటోలు చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు.

రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) ఎల్లో ట్రెండీ వేర్‌లో హోయలు పోయింది. ఆదివారం తన ప్రియుడు జాకీ భగ్నానీతో కలిసి తాజ్ మహల్ సందర్శించింది రకుల్. వీరిద్దరు కలిసి అక్కడ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండగా, అభిమానులు ఎగబడి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పంచుకోగా అవి వైరల్ అయ్యాయి. Rakul Preet Singh Photos.
Rakul Preet Singh Photos.
ఇప్పుడు తనే ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. గ్లామరస్ ఫోటోలను పంచుకుని కనువిందు చేస్తుంది. హాట్ పోజులతో ఆమె పంచుకున్న చిత్రాలు తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా కసిగా చూస్తూ రకుల్ ఇచ్చిన పోజులు నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అల్లంత దూరాన తాజ్ మహల్ కనిపిస్తుండగా, ఆ అద్భుత కట్టడం బ్యాక్ డ్రాప్‌లో రకుల్ ఇచ్చిన పోజులు కట్టిపడేస్తుండటం విశేషం. తాజ్‌మహల్ కంటే నువ్వే అందంగా ఉన్నావంటున్నారు నెటిజన్లు. ఇక ఆమె అభిమానులు ఓ అడుగుముందేసి రచ్చ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ లేటెస్ట్ పిక్స్ చూపుతిప్పుకోనివ్వడం లేదని చెప్పొచ్చు.
ఇక స్టార్ హీరోయిన్‌గా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది రకుల్ ప్రీత్ సింగ్. సీనియర్లలో నాగార్జునతో కలిసి నటించిన ఆమె.. దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. ఎన్టీఆర్, మహేష్, రామ్‌చరణ్, బన్నీ, గోపీచంద్, ఆది, రామ్, నితిన్ ఇలా యంగ్‌స్టర్స్ తోనూ ఆడిపాడింది. చివరగా `కొండపొలం` చిత్రంలో వైష్ణవ్‌తేజ్‌తో కలిసి నటించగా, ఈ చిత్రం నిరాశపరిచింది.
ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. దాదాపు అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వాటిలో అజయ్ దేవగన్‌తో `రన్‌వే 34`, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి `డాక్టర్ G`, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి `అటాక్` అనే సినిమాలు చేస్తోంది . అలాగే `థ్యాంక్ గాడ్`, `ఛత్రీవాలీ`, `మిషన్ సిండ్రెల్లా` సినిమాలకు కూడా అంగీకారం తెలిపింది.
మరోవైపు బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతుంది రకుల్. గతేడాది తన ప్రేమ విషయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి ఎక్కడ చూసినా వీరిద్దరు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.